ఈము పక్షులు గుడ్లను పొదుగుట
గది ఉష్ణోగ్రతకు అలవాటైన తరువాత, ఫలవంతమైన ఈము గుడ్లను పొదగడానికి ఏర్పాట్లు చేయాలి. ఒక ట్రేలో సమాంతరంగా గాని ఏటవాలుగా గాని, వరుసలుగా గుడ్లను పెట్టాలి. గుడ్లు పొదిగే స్థలాన్ని (incubator) పూర్తిగా శుభ్రపరిచి, శుద్ధిచేసి సిద్ధంగా ఉంచాలి. మెషీన్ (యంత్రాన్ని) మీట నొక్కి, పొదగడానికి కావలిసిన ఉష్ణోగ్రత సరిగా ఉండేటట్లు చూసుకోవాలి. అంటే డ్రై బల్బే (వేడి బల్బు) ఉష్ణోగ్రత సూమారు 96 - 970 f , వెట్ బల్బ్ (తేమ బల్బు) ఉష్ణోగ్రత సుమారు 78 - 800 f (సుమారు 30 - 40% RH ) లుగా ఉండాలి. గుడ్లను ఉంచిన ట్రేను జాగ్రత్తగా ఒక సెట్టర్ (పొదిగే ప్రాంతం) లో ఉంచాలి. ఒకేసారి, ఇన్ క్యూబేటర్ సరైన ఉష్ణగ్రతతో, తేమతో సిద్ధంగా ఉన్నట్లైతే, గుడ్లను పొదగడానికి ఏర్పాటు చేసుకున్న సమయాన్ని, అవసరమైతే దాని జాతి చరిత్రను తెలిపే చీటిని అందులో పెట్టాలి. ఇన్ క్యూబేటర్ లోని ప్రతి 100 క్యూబిక్ అడుగుల స్థలానికి, 20 గ్రాముల పొటాషియం పెర్మాంగవేట్ (Potassium permananganate) + 40 మిల్లీ లీటర్ల ఫార్మలిన్ (Formaline) ను ఉపయోగించి రోగక్రిములను నాశనం చేయాలి. ప్రతిగంటకు, ఒకసారి గుడ్లను తిప్పుతూ, 48వ రోజు వచ్చే దాకా అలా చేస్తూ ఉండాలి. 49వ రోజు తరువాత గుడ్లను అటూ, యిటూ తిప్పడం మానివేసి, కదలికల కోసం గమనిస్తూ ఉండాలి. 52వ రోజుకు పొదగబడే సమయం అయిపోతుంది. ఎమూ పక్షి పిల్లలు పొడిగా ఉండేటట్లు చూడాలి. గుడ్ల నుండి పిల్లలు బయటికి వచ్చినప్పుడు, కనీసం 24 గంటల నుండి 72 గంటల దాకా పొదగబడిన గది (hatcher compartment) లోనే ఉంచాలి. అందువలన వాటిలోని నూగు తగ్గి ఆరోగ్యంగా ఉండడానికి యిది అవసరం. సాధారణంగా, పొదగడంలో 70% కాని అంతకు మించి కాని ఫలితం ఉంటుంది. తక్కువగా పొదగబడడానికి చాల కారణాలు ఉంటాయి. సంతానోత్పత్తి దశలో, సక్రమమైన పోషకాహారం అంద చేయడం వలన, తరువాతి కాలంలో ఆరోగ్యకరమైన పిల్లలు పొందడానికి కారణమౌతుంది.[1]
ఇవి కూడా చూడండి
[మార్చు]- ఈము పక్షి పిల్లల పెంపకం
- ఎదిగే ఈము పక్షి పెంపక నిర్వహణ
- సంతానోత్పత్తి దశలో ఉన్న ఈము పక్షుల పెంపక నిర్వహణ
- ఈము పక్షుల ఆహారం లేక మేత
- ఆరోగ్యపరమైన జాగ్రత్తలు , నిర్వహణ
- ఈము పక్షుల ఉత్పత్తులు
- ఈము పక్షుల పెంపకంలో ఆర్థిక లాభాలు