ఈము పక్షుల సంరక్షణ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

రేటైట్ జాతికి చెందిన ఈము పక్షులు సాధారణంగా, దృఢంగా ఉండి ఎక్కువ కాలం జీవిస్తాయి. (80 జీవితకాలం). మరణాలు ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఈము పక్షుల చిన్న పిల్లలలోనూ, ఎదుగుతున్న క్రమంలోనూ సంభవిస్తాయి. ఈ సమస్యలలో, చలితో బాధపడడం లేక తీవ్రమైన ఆకలి, పోషకాహార లేమి, ప్రేవులలో అడ్డంకి, కాళ్ళలో లోపాలు, జీర్ణక్రియకు సంబంధించిన వ్యాధులు, క్లోస్ట్రిడియల్ వ్యాధులు వంటివి వస్తాయి. వీటికి గల ముఖ్య కారణాలు, సక్రమమైన పోషకాహారం అంద చేయలేక పోవడం, ఒత్తిడి, నిర్వహణా లోపాలు, వంశ పారం పర్య (జెనిటిక్) లోపాలు. రైనిటిస్, (Rhinitis - జలుబు) కాండిడియాసిస్ (Candidiasis - చర్మవ్యాధులు), సాల్మోనెల్లా (salmonella), అస్పెర్గిలాసిస్ (aspergillosis), కొసిడియాసిస్ (coccidiosis), పేలు (lie), అస్కారిడ్ (ascarid infestations) వంటి యితర వ్యాధులు కూడా పోకుతాయి. ఐవర్ మెక్టిన్ ను (Ivermection) పక్షిపిల్ల లోపలి భోగాల్లోనూ, బైటి భాగాల్లోనూ పట్టే క్రిముల నుండి రక్షణ కల్పించవచ్చు.[1]

ఈము పక్షలలో ఎంటిరిటిస్ (enteritis), వైరల్ ఈస్ట్రన్ ఈ క్వైన్ ఎన్సిఫిలోమైలిటిస్ (eastern equine encephalomyelitis) (EEE) (మెదడు వ్యాధులు) వంటి వ్యాధులు వచ్చినట్లు కనుగొన్నారు. భారతదేశంలో చాల తక్కువగా రాణి ఖేత జబ్బు వచ్చినట్లు చెప్పడం బడింది. కాని ధ్రువపడలేదు. అయినప్పటికీ, పక్షుల పిల్లలకు, ఒక వారం వయసులో (లసోటా - lasota) (R.D) రాణి ఖేత్ జబ్బు కొరశు 4 వారాల వయసులో (lasota booster) (లసోటా బూస్టర్ మోతారులో) టీ కాలను యిప్పించడం, 8, 15,, 40 వారాల వయసులో ముక్తేశ్వరే స్ట్రేయిన్ యివ్వడం వలన అధిక రోగ నిరోధక శక్తి కలుగుతుంది.

రెండు ఈము పక్షులు

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. ప్రగతిపీడియా జాలగూడు[permanent dead link]

ఇతర లింకులు[మార్చు]