Jump to content

ఎన్.ఎస్. బోసురాజు

వికీపీడియా నుండి
ఎన్.ఎస్. బోస్ రాజు
ఎన్.ఎస్. బోసురాజు


ఎమ్మెల్సీ
పదవీ కాలం
1 జులై 2014[1] – 30 జూన్ 2020
నియోజకవర్గం ఎమ్మెల్యే కోటా

శాసనసభ్యుడు
పదవీ కాలం
1999 – 2008
ముందు గంగాధర్ నాయక్
తరువాత జి హంపయ్య నాయక్
నియోజకవర్గం మాన్వి

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ కాంగ్రెస్
జీవిత భాగస్వామి కృష్ణ వేణి

నడింపల్లి సుభాష్ చంద్ర బోసురాజు కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన కర్ణాటక శాసనసభకు మాన్వి నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై సిద్దరామయ్య రెండవ మంత్రివర్గంలో 2023 మే 27న రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టాడు.[2][3][4][5]

రాజకీయ జీవితం

[మార్చు]

ఎన్.ఎస్. బోసురాజు పశ్చిమగోదావరి జిల్లా భీమవరం తాలూకా మోగల్లులో జన్మించిన ఆయన కొన్నాళ్ల కిందట వ్యవసాయం నిమిత్తం కర్ణాటకలోని రాయచూరు తాలూకా జీనూరు క్యాంపునకు వెళ్లి వ్యవసాయంతో పాటు ఎరువుల వ్యాపారం చేశాడు. ఆయన 1969లో యూత్ కాంగ్రెస్ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేశాడు. ఎన్.ఎస్. బోసురాజు 1999 నుండి 2008 వరకు మాన్వి శాసనసభ నియోజకవర్గం వరకు ఎమ్మెల్యేగా, 2014 నుండి 2020 వరకు శాసనమండలి సభ్యుడిగా పనిచేశాడు. ఆయన 2018లో తెలంగాణ ఏఐసీసీ ఇన్ఛార్జి కార్యదర్శిగా నియమితుడయ్యాడు.[6][7]

మూలాలు

[మార్చు]
  1. "Legislative Council Members". Kla.kar.nic.in. Retrieved 2017-11-26.
  2. Eenadu (28 May 2023). "అనుబంధాలే ఆలంబన". Archived from the original on 28 May 2023. Retrieved 28 May 2023.
  3. Eenadu (28 May 2023). "ఆలస్యమైనా.. అమృత ఫలమే". Archived from the original on 28 May 2023. Retrieved 28 May 2023.
  4. Sakshi (28 May 2023). "8 మందికి తొలిసారి బెర్తులు". Archived from the original on 28 May 2023. Retrieved 28 May 2023.
  5. Eenadu (28 May 2023). "కర్ణాటకలో కొలువుదీరిన పూర్తిస్థాయి మంత్రివర్గం". Archived from the original on 28 May 2023. Retrieved 28 May 2023.
  6. Deccan Herald (21 June 2018). "Bose Raju, Saleem Ahmed appointed AICC secretaries" (in ఇంగ్లీష్). Archived from the original on 5 June 2023. Retrieved 5 June 2023.
  7. Namasthe Telangana (27 May 2023). "కర్ణాటకలో మంత్రులకు శాఖల కేటాయింపు.. సిద్ధూ దగ్గరే ఆర్థిక శాఖ.. డీకేకు నీటి పారుదల శాఖ". Archived from the original on 28 May 2023. Retrieved 28 May 2023.