Jump to content

ఎన్. హరికుమార్

వికీపీడియా నుండి
ఎన్. హరికుమార్
జననం (1955-07-19) 1955 జూలై 19 (వయసు 69)
కొల్లాం, కేరళ
విద్యాసంస్థఎంజీఆర్ ప్రభుత్వ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్
వృత్తిసౌండ్ డిజైనర్
క్రియాశీల సంవత్సరాలు1979-ప్రస్తుతం
గుర్తించదగిన సేవలు
మంజు, అనంతరం, మథిలుకల్, మజా
జీవిత భాగస్వామిశాలిని హరికుమార్

నారాయణన్ నాయర్ హరికుమార్ కేరళ రాష్ట్రానికి చెందిన సినిమా సౌండ్ డిజైనర్. ఇతడు రెండు జాతీయ చలనచిత్ర అవార్డులు, తొమ్మిది కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులను గెలుచుకున్నాడు. అదూర్ గోపాలకృష్ణన్ తీసిన అనంతరం, మథిలుకల్, నిజాలుకుతు, నాలు పెన్నుంగల్ , ఒరు పెన్నుమ్ రాందానుమ్ మొదలైన అనేక సినిమాలకు పనిచేశాడు.[1] కేరళ స్టేట్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ వారి చిత్రాంజలి స్టూడియోలో చీఫ్ సౌండ్ ఇంజనీర్, స్టూడియో మేనేజర్‌గా పనిచేశాడు. ఆ తర్వాత ఏరీస్ విస్మయాస్ మాక్స్‌లో చీఫ్ ఆడియో ఇంజనీర్‌గా పనిచేశాడు.

జననం, విద్య

[మార్చు]

హరికుమార్ 1955, జూలై 19న కేరళ రాష్ట్రంలోని కొల్లాంలో జన్మించాడు. కొల్లం ప్రభుత్వ పాఠశాలలో తన పాఠశాల విద్యనుపూర్తి చేసి, మోడల్ బాయ్స్ హైస్కూల్, తుంబ సెయింట్ జేవియర్స్ కాలేజ్, ఎంజీఆర్ ప్రభుత్వ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ నుండి సౌండ్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా పొందాడు.

వృత్తిరంగం

[మార్చు]

ఢిల్లీ దూరదర్శన్ కేంద్రంలో సౌండ్ రికార్డిస్ట్‌గా తన వృత్తిని ప్రారంభించిన హరికుమార్, 1979లో చిత్రాంజలి స్టూడియోలో ప్రముఖ సౌండ్ ఇంజనీర్ పి. దేవదాస్ ఆధ్వర్యంలో సౌండ్ రికార్డిస్ట్‌గా చేరాడు.[2]

అవార్డులు

[మార్చు]
జాతీయ చలనచిత్ర అవార్డులు
9 సార్లు కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డులు
  • 2000 - మజా[4]
  • 2002 - నిజాల్కుతు
  • 2003 - మార్గం
  • 2004 - పెరుమఝక్కలం
  • 2006 - దృష్టాంతం
  • 2008 - ఒరు పెన్నుమ్ రాందానుమ్ (టి. కృష్ణన్ ఉన్నితో)
  • 2009 - పథం నిలయిలే తీవండి
  • 2013 - కన్యకా టాకీస్ (సౌండ్ మిక్సింగ్)
  • 2014 - విభిన్న చిత్రాలకు సౌండ్ మిక్సింగ్‌లో అత్యుత్తమం (సౌండ్ మిక్సింగ్)
ఇతర అవార్డులు
  • 7 సార్లు- కేరళ స్టేట్ ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డ్ ఫర్ బెస్ట్ సౌండ్ మిక్సింగ్ - ఒరిడమ్ ఎక్ట్[5][6]
  • 2011 - సౌండ్ మిక్సింగ్ కోసం జాన్ అబ్రహం నేషనల్ అవార్డు ప్రత్యేక ప్రస్తావన[7]
  • ఏషియానెట్ అవార్డు
  • మాతృభూమి మెడిమిక్స్ అవార్డు
  • అమృత ఫిలిం ఫ్రాటర్నిటీ అవార్డు
  • కేరళ స్టేట్ టీవీ అవార్డ్ ఫర్ బెస్ట్ ఆడియో
  • స్టేట్ టీవీ అవార్డు బెస్ట్ ఎడిటర్

మూలాలు

[మార్చు]
  1. Adoor Gopalakrishnan: A Life in Cinema. Penguin Books, India. 8 July 2010. pp. 59, 91, 92, 149, 194, 201, 209, 210. ISBN 9780670081714. Retrieved 2023-05-10. {{cite book}}: |work= ignored (help)
  2. 2.0 2.1 "35th National Film Awards" (PDF). Directorate of Film Festivals. pp. 44, 45. Retrieved 2023-05-10.
  3. "37th National Film Awards" (PDF). Directorate of Film Festivals. pp. 50, 51. Retrieved 2023-05-10.
  4. "Kerala State Film Awards 2000-2012". Kerala I & PRD. Archived from the original on 7 July 2015. Retrieved 2023-05-10.
  5. "Oridam - Awards". www.oridam.com. Archived from the original on 31 ఆగస్టు 2014. Retrieved 7 August 2014.
  6. "Oridam awards". OneIndia.in. Archived from the original on 2014-08-10. Retrieved 2023-05-10.
  7. "Signs 2011 Opening and Closing Ceremonies". Federation of Film Societies of India. Archived from the original on 10 August 2014. Retrieved 2023-05-10.

బయటి లింకులు

[మార్చు]

ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో ఎన్. హరికుమార్ పేజీ