ఎమెరాడ్ టౌబియా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎమెరాడ్ టౌబియా
Toubia in 2024లో ఎమెరాడ్ టౌబియా
జననం (1989-03-01) 1989 మార్చి 1 (వయసు 35)
మాంట్రియల్, క్యూబెక్, కెనడా
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2008–ప్రస్తుతం
జీవిత భాగస్వామి
ప్రిన్స్ రాయిస్
(m. 2018; div. 2022)

ఎమెరాడ్ టౌబియా (ఆంగ్లం: Emeraude Toubia; జననం 1989 మార్చి 1) ఒక అమెరికన్ నటి. 2016 నుండి 2019 వరకు, ఆమె ఫ్రీఫార్మ్ ఫాంటసీ సిరీస్ షాడోహంటర్స్‌లో ఇసాబెల్లె లైట్‌వుడ్ పాత్రను పోషించింది. ఆమె 2021 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియో రొమాంటిక్ కామెడీ సిరీస్ విత్ లవ్‌లో లిల్లీ డియాజ్‌గా నటిస్తోంది.

ప్రారంభ జీవితం

[మార్చు]

టౌబియా క్యూబెక్‌లోని మాంట్రియల్‌లో ఏకైక సంతానంగా జన్మించింది.[1][2] ఆమె టెక్సాస్‌లోని బ్రౌన్స్‌విల్లేలో పెరిగింది. టౌబియా తల్లి మిర్తా సోనియా, మెక్సికోలోని సియుడాడ్ విక్టోరియాలో పుట్టి పెరిగింది. ఆమె తండ్రి ఎలియాస్ టౌబియా, జోమోరోడ్ హిలానీ లెబనీస్-అమెరికన్‌ల కుమారుడు గాబీ టౌబియా. ఉత్తర లెబనాన్‌లో కౌరా జిల్లాలోని డెడ్డే పట్టణం నుండి. చిన్నతనంలో, ఆమె వృత్తిపరంగా క్లాసికల్ బ్యాలెట్, ఫ్లేమెన్కో, బెల్లీ డ్యాన్స్, లిరికల్ డ్యాన్స్‌లలో శిక్షణ పొందింది. ఆమె తన మాధ్యమిక విద్యను బ్రౌన్స్‌విల్లేలోని హోమర్ హన్నా ఉన్నత పాఠశాలలో పూర్తిచేసింది. ఆమె పదిహేను సంవత్సరాల వయస్సులోనే అనేక అందాల పోటీలలో పోటీ పడింది. మిస్ సౌత్ టెక్సాస్, మిస్ రియో ​​గ్రాండే వ్యాలీ అమెరికా, మిస్ టీన్ బ్రౌన్స్‌విల్లే కిరీటం.. ఇలా ఎన్నో టైటిల్స్ ఆమె సాధించింది.[3]

కెరీర్

[మార్చు]

1999లో, పది సంవత్సరాల వయస్సులో, ఆమె టెలివిసా పిల్లల కార్యక్రమం ఎల్ ముండో డి లాస్ నినోస్‌తో టెలివిజన్‌ రంగంలో అడుగుపెట్టింది. ఆమె 2008లో యూనివిజన్ అందాల పోటీల సిరీస్ న్యూస్ట్రా బెల్లెజా లాటినా రెండవ సీజన్‌లో ఆమె పాల్గొన్నది. ఆమె దీంతో విస్తృతంగా ప్రసిద్ది చెందింది. ఆమె మొదటి రన్నరప్‌గా ఎంపికైంది.

ఆ తరువాత, ఆమె మేబెల్లైన్, జె. సి. పెన్నీ, సోనీ, గార్నియర్, ఎటి&టి వంటి బ్రాండ్‌ల ప్రకటనలకు మోడల్ గా వ్యవహరించింది. 2009లో, ఆమె మోడల్ లాటినా రెండవ సీజన్‌లో చేరి, ఐదవ స్థానంలో నిలిచింది.

ఆమె మిస్ టెక్సాస్ యుఎస్ఎ 2010లో సెమీఫైనలిస్ట్. 2011 నుండి 2013 వరకు, ఆమె అనేక ఎన్బిసి యూనివర్సో సంగీతం, వినోద కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా పనిచేసింది, ఇందులో ది అరేనా, 18 & ఓవర్, మన్2పాప్ మొదలైనవి ఉన్నాయి. ఆమె 2013 బిల్‌బోర్డ్ లాటిన్ మ్యూజిక్ అవార్డ్స్ కోసం మన్2 రెడ్ కార్పెట్ స్పెషల్‌కి సహ-హోస్ట్ చేసింది. 2013లో, ఆమె నికెలోడియన్ లాటిన్ అమెరికా యూత్ టెలినోవెలా 11-11: ఎన్ మి క్యూడ్రా నాడా క్యూడ్రాలో ఎలిజబెత్‌గా తన నటనను ప్రారంభించింది, దీనికి ఆమె అకాడమీ అవార్డ్-నామినేట్ అయిన నటి అడ్రియానా బర్రాజాచే శిక్షణ పొందింది.

2014లో, వెనెవిసియోన్ టెలినోవెలా కోసిటా లిండాలో ఆమె డుల్స్ రింకన్‌గా కనిపించింది. మరుసటి సంవత్సరం, ఆమె యూనివిజన్-వెనివిజన్ టెలినోవెలా వోల్టే పా' క్యూ టె ఎనామోర్స్‌లో స్టెఫానీ కరం పాత్రను పోషించింది. 2016లో, ఆమె కాసాండ్రా క్లేర్ రచించిన ది మోర్టల్ ఇన్‌స్ట్రుమెంట్స్ బుక్ సిరీస్ ఆధారంగా ఫ్రీఫార్మ్ ఫాంటసీ సిరీస్ షాడోహంటర్స్‌లో నటించింది. అదే నెలలో, ఆమె ప్రిన్స్ రాయిస్‌తో కలిసి సింగిల్ "కల్పా అల్ కొరాజోన్" మ్యూజిక్ వీడియోలో కనిపించింది.

2021 నుండి, ఆమె అమెజాన్ ప్రైమ్ వీడియో రొమాంటిక్ కామెడీ సిరీస్ విత్ లవ్‌లో లిల్లీ డియాజ్‌గా నటించింది.[4] ఆమె రొమాంటిక్ కామెడీ చిత్రం ది రెడోలో కూడా నటించింది.[5]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

టౌబియా 2011లో సంగీత విద్వాంసుడు ప్రిన్స్ రాయిస్‌తో డేటింగ్ చేయడం ప్రారంభించింది.[6] వారు 2018 నవంబరు 30న మెక్సికోలోని శాన్ మిగ్యుల్ డి అల్లెండేలో వివాహం చేసుకున్నారు. అయితే, వారు మార్చి 2022లో విడాకులు తీసుకోబోతున్నట్లు ప్రకటించారు.[7]

టౌబియా గెట్ స్కూల్డ్ (The Get Schooled Foundation) లాభాపేక్ష లేని సంస్థకు మద్దతు ఇస్తుంది. 2016 మే 26న, ఆమె కాలిఫోర్నియాలోని శాన్ బెర్నార్డినోలో మిడిల్ కాలేజ్ హైస్కూల్‌ ప్రిన్సిపాల గా వ్యవహరించింది.[8]

ఫిల్మోగ్రఫీ

[మార్చు]
సంవత్సరం టైటిల్ పాత్ర నోట్స్
2010 అరోరా రిసెప్షనిస్ట్ ఎపిసోడ్: "గ్రాన్ లాంజామింటో"
2013 11-11: ఎన్ మి క్యూడ్రా నాడ క్యూడ్రా ఎలిజబెత్ 75 ఎపిసోడ్‌లు
2014 కోసిటా లిండా డుల్స్ రింకన్ 96 ఎపిసోడ్‌లు
2015 వోల్టే పా' క్యూ టె ఎనామోర్స్ స్టెఫానీ కరమ్ 29 ఎపిసోడ్‌లు
2015 టాట్టూడ్ లవ్ ఎస్మెరాల్డా
2016–2019 షాడోహంటర్స్ ఇసాబెల్లె లైట్‌వుడ్ ప్రధాన పాత్ర; 55 ఎపిసోడ్‌లు
2019 లవ్ ఇన్ ది సన్ అలానా టెలివిజన్ ఫిల్మ్ (హాల్ మార్క్)
2021 హాలిడే ఇన్ సాంటా ఫె బెలిండా సాయర్ టెలివిజన్ చిత్రం; కో-ఎగ్జిక్యూటివ్ నిర్మాత కూడా
2021–2023 విత్ లవ్ లిల్లీ డియాజ్ ప్రధాన పాత్ర

మూలాలు

[మార్చు]
  1. Hamilton Rushforth, Samantha (July 20, 2017). "Exclusive: Shadowhunters Star Emeraude Toubia On Her Lebanese Roots". Harper's Bazaar. Retrieved August 16, 2017.
  2. Simon, Samantha (December 22, 2015). "8 Things to Know About Shadowhunters Star Emeraude Toubia". InStyle. Archived from the original on April 3, 2019. Retrieved January 4, 2016.
  3. ""Hay que hacer todo de corazón": Emeraude Toubia". Diario Panorama (in స్పానిష్). March 5, 2014. Archived from the original on March 4, 2016. Retrieved June 13, 2015.
  4. Petski, Denise (June 3, 2021). "'With Love': Emeraude Toubia To Star In Gloria Calderón Kellett's Amazon Series". Deadline Hollywood. Retrieved December 8, 2021.
  5. Grobar, Matt (January 13, 2022). "'The Redo': 'With Love' Star Emeraude Toubia To Executive Produce And Topline Rom-Com From Director Daniella Eisman". Deadline Hollywood.
  6. "Prince Royce ¡estrena romance!". TVNotas (in స్పానిష్). August 19, 2011. Archived from the original on 2016-04-28. Retrieved April 13, 2016.
  7. Roiz, Jessica (March 9, 2022). "Prince Royce & Emeraude Toubia Divorce After Three Years of Marriage: 'We Are At Peace'". Billboard. Retrieved May 9, 2022.
  8. "Emeraude Toubia Drops By Middle College High School". Get Schooled. Archived from the original on August 11, 2016. Retrieved June 14, 2016.