Jump to content

ఎలన్ మస్క్

వికీపీడియా నుండి
ఎలన్ మస్క్
2015 లో ఎలన్ మస్క్
జననం
ఎలన్ రీవ్ మస్క్

(1971-06-28) 1971 జూన్ 28 (వయసు 53)
ప్రిటోరియా, ట్రాన్స్వాల్, దక్షిణ ఆఫ్రికా
జాతీయతదక్షిణ ఆఫ్రికన్, కెనడియన్, అమెరికన్
విద్యవాటర్క్లూప్ హౌస్ ప్రిపరేటరీ స్కూల్
ప్రిటోరియా బాయ్స్ హై స్కూల్
విద్యాసంస్థక్వీన్స్ యూనివర్సిటీ
పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం[1][2]
వృత్తిపారిశ్రామికవేత్త, ఇంజనీరు, ఆవిష్కర్త.
సుపరిచితుడు/
సుపరిచితురాలు
స్పేస్‌ఎక్స్, పేపాల్, టెస్లా మోటార్స్, హైపర్‌లూప్, సోలార్‌సిటీ, ఒపెన్AI
నికర విలువIncrease US$12.5 బిలియన్ (August 2016)[3]
బిరుదుస్పేస్‌ఎక్స్ యొక్క సిఈఓ , సిటిఓ
టెస్లా మోటార్స్ యొక్క సిఈఓ , ప్రొడక్ట్ ఆర్కిటెక్ట్
సోలార్‌సిటీ చైర్మన్
ఓపెన్AI యొక్క సహ చైర్మన్
జీవిత భాగస్వామి
జస్టిన్ మస్క్
(m. 2000; div. 2008)
  • తలులహ్ రిలే (m. 2010, div. 2012, m. 2013, sep. 2016)[4][5]
పిల్లలు6 కుమారులు[6]
తల్లిదండ్రులుమేయే మస్క్ (తల్లి)
ఎర్రోల్ మస్క్ (తండ్రి)
బంధువులుటోస్కా మస్క్ (సోదరి)
కింబల్ మస్క్ (సోదరుడు)
సంతకం
Elon Musk

ఎలన్ మస్క్ (Elon Reeve Musk) (జననం: 1971 జూన్ 28) దక్షిణాఫ్రికాలో జన్మించిన కెనడియన్-అమెరికన్, ఇతను పెద్దవ్యాపారి, పెట్టుబడిదారు, [10][11] ఇంజనీర్,[12] ఆవిష్కర్త.[13][14][15][16]

బాల్యము

[మార్చు]

మస్క్‌ 1971 జూన్‌ 28న దక్షిణాఫ్రికాలోని ప్రెటోరియాలో జన్మించాడు. తండ్రి ఎర్రల్‌ ఒక ఇంజినీర్‌. తల్లి మే కెనడాకు చెందిన మోడల్‌. మస్క్‌ చిన్నప్పటి నుంచి పుస్తకాల పురుగు. బయటి వారితో ఎలా ఉండాలో అంతగా తెలియదు. దీంతో తోటి విద్యార్థుల వేధింపులకు తొలి లక్ష్యంగా మారేవాడు. ఇది అతని బాల్యాన్ని Archived 2021-09-17 at the Wayback Machine దుర్భరం చేసింది. ఒకసారి తోటి విద్యార్థులు అతన్ని మెట్లమీద నుంచి తోసేసి తీవ్రంగా కొట్టారు. దీంతో మస్క్‌ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందాడు. ఆ గాయాల కారణంగా ఇప్పటికీ ఊపిరి సరిగా పీల్చుకోలేడు.

1980లో మస్క్‌ తల్లిదండ్రులు విడిపోయారు. అయితే మస్క్‌ మాత్రం తండ్రి వద్దనే ఉన్నాడు. కానీ, తర్వాత కాలంలో అది సరైన నిర్ణయం కాదని ఆయనే స్వయంగా తెలిపాడు. పెద్దయ్యాక తండ్రితో తెగతెంపులు చేసుకున్నాడు.

తొలి విజయం

[మార్చు]

మస్క్‌ 12ఏళ్ల వయస్సులో బ్లాస్టర్‌ అనే వీడియోగేమ్‌ను తయారు చేశాడు. పీసీ అండ్‌ ఆఫీస్‌ టెక్నాలజీ అనే పత్రిక దీనిని 500 డాలర్లకు కొనుగోలు చేసింది. ఆ తర్వాత 17ఏళ్ల వయస్సులో దక్షిణాఫ్రికా సైన్యంలో పనిచేయడం ఇష్టం లేక కెనడా వెళ్లిపోయాడు.

ఆ తర్వాత చదువుపై దృష్టిపెట్టాడు. కింగ్‌స్టన్‌లోని క్వీన్స్‌ యూనివర్శిటీలో రెండేళ్లపాటు చదువుకొని అమెరికా వెళ్లిపోయాడు. అక్కడ పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం నుంచి భౌతికశాస్త్రంలో పట్టా పొందాడు. వార్టోన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ నుంచి ఆర్థిక శాస్త్రంలో పట్టాపొందాడు. 24ఏళ్ల వయస్సులో మస్క్‌ అప్లయిడ్‌ సైన్సెస్‌లో పీహెచ్‌డీ చేసేందుకు స్టాన్‌ఫోర్డ్‌ విశ్వవిద్యాలయంలో చేరాడు. కానీ, ఆయన మనస్సు మొత్తం వ్యాపారం పైనే ఉండేది. దీంతో పీహెచ్‌డీలో చేరిన రెండు రోజులకే అక్కడి నుంచి బయటకు వచ్చేశాడు.

వ్యాపారం

[మార్చు]

1995లో తన సోదరుడు కింబల్‌తో కలిసి ‘జిప్‌2’ను ప్రారంభించాడు. దీనికి పెట్టుబడి 28,000 డాలర్లు. మిగిలినది ఏంజెల్‌ ఇన్వెస్టర్ల నుంచి సమకూర్చుకున్నాడు. ఇదొక వెబ్‌ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ. న్యూస్‌పేపర్లు ఆన్‌లైన్‌ సిటీ గైడ్లను అభివృద్ధి చేసుకోవడానికి సాయం చేస్తుంది. దీనికి మస్క్‌ సీఈవో అవుదామనుకున్నాడు. కానీ, పెట్టుబడిదారులు అంగీకరించకపోవడంతో ఆశలు నెరవేరలేదు. ఆ తర్వాత ఈ కంపెనీని కాంపాక్‌ 307 మిలియన్‌ డాలర్ల నగదు, 37 మిలియన్‌ డాలర్ల వాటాలను ఇచ్చి కొనుగోలు చేసింది. మస్క్‌ వాటా కింద 22 మిలియన్‌ డాలర్లు వచ్చాయి. చిన్న వయసులోనే అది భారీ విజయం. అయితే వ్యాపారిగా అక్కడితో ఆగలేదు. 10మిలియన్‌ డాలర్లతో ఎక్స్‌.కామ్‌ అనే ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ సర్వీస్‌ కంపెనీని ప్రారంభించాడు. వ్యాపారంలో రాటుదేలిన మస్క్‌ దీనిని పేమెంట్‌ గేట్‌వే ‘పేపాల్‌’కు అమ్మేశాడు. ఒప్పందంలో భాగంగా పేపాల్‌ సీఈవోగా పనిచేశాడు. తర్వాత పేపాల్‌ను ‘ఈ-బే’ కొనుగోలు చేసింది. అప్పటికే పేపాల్‌లో అత్యధిక వాటాదారైన మస్క్‌కు 165 మిలియన్‌ డాలర్లు అందాయి.

అంతరిక్ష ప్రయోగాలు

[మార్చు]

పేపాల్‌ విక్రయానికి ఏడాది ముందు 2001లో ఎలన్‌ మస్క్‌ ఓ కీలక ప్రాజెక్టుకు ప్రాణం పోశాడు. అందే ‘మార్స్‌ ఓయాసిస్‌’. అంగారకుడి మానవ జీవనాన్ని సుసాధ్యం చేయడానికి అవసరమైన గ్రీన్‌ హౌస్‌ నిర్మాణానికి ఉద్దేశించిన ప్రాజెక్టు అది. అంగారకుడి పైకి వెళ్లాలంటే రాకెట్లు అవసరం. దీంతో రష్యాలో ఖండాంతర క్షిపణులను కొనుగోలు చేయాలని భావించాడు. అందుకు మాస్కో వెళ్లాడు. కానీ, అక్కడ మస్క్‌కు తీవ్ర అవమానం ఎదురైంది. ఒక్క రాకెట్‌ను 8మిలియన్‌ డాలర్లకు విక్రయిస్తామని రష్యా ఆయుధ వ్యాపారులు తెలిపారు. అది ఎక్కువ మొత్తం అని మస్క్‌ అభిప్రాయపడ్డాడు. ‘కొనటానికి డబ్బులు లేవా’ అని వెటకారపు మాటలు వినిపించడంతో ‘మా సొంతంగా తయారు చేసుకుంటాం’ అనే సమాధానమిచ్చి ఆ మీటింగ్‌ నుంచి బయటకు వచ్చేశాడు. నేరుగా అమెరికా విమానం ఎక్కేశాడు. అయితే ఆయన మనస్సులో ఒకే ఆలోచన.. ఎలాగైనా అంగారకుడిని చేరుకోవాలి.. రాకెట్లను అత్యంత చౌకగా తయారు చేస్తే తప్ప ఇది సాధ్యం కాదని అర్థం చేసుకున్నాడు.

స్పేస్ ఎక్స్

[మార్చు]

రాకెట్‌ ముడి పదార్థాలకు అయ్యే ఖర్చులను లెక్కలు వేసుకొన్న మస్క్‌కు ఓ విషయం అర్థమైంది. మార్కెట్లో ఉన్న రాకెట్ల తయారీ అత్యంత చౌక అయిన విషయం. మార్కెట్‌ ధరలో మూడు శాతం ధరకే రాకెట్‌ను తయారు చేయవచ్చని భావించాడు. దీంతో తన సొంత డబ్బు 100 మిలియన్‌ డాలర్లను పెట్టుబడి పెట్టి 2002 మే నెలలో ‘స్పేస్‌ ఎక్స్‌’ను ప్రారంభించాడు. దీనికి నాసా ఆర్థిక సాయం అందజేసింది. ఇక్కడ తొలుత వైఫల్యాలు వెక్కిరించాయి. 2006లో స్పేస్‌ ఎక్స్‌ తొలిరాకెట్‌ను ప్రయోగించింది. 33 సెకన్లలోనే అది పేలిపోయింది. 2007, 2008లో చేసిన ప్రయోగాలు కూడా విఫలం కావడంతో మస్క్‌ ఆందోళనకు లోనయ్యాడు. స్పేస్‌ ఎక్స్‌ దివాళ తీయడం ఖాయమని పెట్టుబడిదారులు భావించారు. వారి వద్ద ఇంకా ఒక్క ప్రయోగానికే డబ్బు ఉంది. ఈ ప్రయోగం ఆయన జీవితాన్ని మార్చేసింది. 2008 సెప్టెంబర్‌లో ప్రయోగించిన ఫాల్కన్‌-1 రాకెట్‌ విజయవంతంగా భూకక్ష్యలోకి చేరింది. దీంతో అదే ఏడాది నాసా 1.6బిలియన్‌ డాలర్ల భారీ కాంట్రాక్టును స్పేస్‌ఎక్స్‌కు అందజేసింది. ఈ కాంట్రాక్టు ప్రకారం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి అవసరమైన సామగ్రిని తరలించాలి. దీనికోసం స్పేస్‌ ఎక్స్‌ ప్రయోగాలు చేస్తోంది. 22 డిసెంబర్‌ 2015లో పునర్వినియోగానికి అవకాశం ఉన్న రాకెట్‌ను ప్రయోగించింది. ఈ రాకెట్‌ విజయవంతంగా మళ్లీ భూకక్ష్యలో నుంచి లాంచింగ్‌ప్యాడ్‌పైకి వచ్చింది. మానవ చరిత్రలో ఈ విధమైన ప్రయోగం విజయవంతం కావడం ఇదే తొలిసారి. ప్రైవేటు రంగంలో అతిపెద్ద రాకెట్‌ ఇంజిన్ల తయారీ సంస్థగా స్పేస్‌ ఎక్స్‌ అవతరించింది. తాజాగా బుధవారం ప్రయోగించిన ఫాల్కన్‌ హెవీ ప్రపంచలోనే అత్యంత శక్తివంతమైన రాకెట్‌. ఈ రాకెట్‌ ద్వారా ఒక కారును అంతరిక్షంలో ప్రవేశపెట్టారు. దీనికి వినియోగించిన కారు టెస్లా సంస్థది. టెస్లా కూడా మస్క్‌ ఆలోచనల్లో నుంచి పుట్టిన సంస్థే.

టెస్లా కార్ల సంస్థ

[మార్చు]

మస్క్‌ మానసపుత్రికల్లో టెస్లా ఒకటి. 2002లో స్పేస్‌ ఎక్స్‌ను ప్రారంభించిన తర్వాత 2003లో టెస్లాకు జీవం పోశాడు. రాకెట్ల వ్యయాన్నే తగ్గించాలనుకున్న మస్క్‌ కార్ల వ్యయాన్ని ఎందుకు తగ్గించకూడదు అని భావించాడు. ఈ ఆలోచన ప్రతిరూపమే టెస్లా. ఈ కంపెనీ విద్యుత్తు కార్లను అభివృద్ధి చేసింది. ఈ కంపెనీ తొలి కారు ‘రోడ్‌స్టర్‌’. అత్యంత వేగంగా దూసుకుపోయే ఈ కారు చాలా ఖరీదైంది. దీంతో దీని లాంచింగ్‌ ఆలస్యమైంది. ఫలితంగా 2008లో కంపెనీ ఆర్థిక ఒడుదొడుకులను ఎదుర్కొంది. ఎంతగా అంటే కంపెనీ మూతపడే స్థితికి వచ్చింది. దీంతో తనకు ఉన్నది మొత్తం టెస్లాలో పెట్టుబడిగా పెట్టాడు. ఆ తర్వాత రోడ్‌స్టర్‌ను మార్కెట్‌లోకి విడుదల చేశాడు. అది భారీ విజయం సాధించింది. ఆ తర్వాత కంపెనీ వెనుదిరిగి చూసుకోలేదు. టెస్లా మోడల్‌ 3 కారును 35వేల డాలర్లకు అందజేస్తామని ప్రకటించింది. దీనికి రోజుకు 1800 బుకింగ్‌లు చొప్పున వచ్చాయి. 2017 నుంచి ఈ కారు మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చింది. ఇదొక భారీ విజయం. ఇవే కాక ‘సోలార్‌ సిటీ’, ‘హైపర్‌ లూప్‌’, ఓపెన్‌ ఏఐ, న్యూరాలింక్‌, ది బోరింగ్‌ కంపెనీ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థలు మస్క్‌ ఆలోచనల నుంచి పుట్టినవే.

వ్యక్తిగత జీవితము

[మార్చు]

మస్క్‌ క్వీన్స్‌ విశ్వవిద్యాలయంలో చదివేటప్పుడు జస్టిన్‌ విల్సన్‌తో పరిచయం ప్రేమగా మారింది. తర్వాత ఆమెనే పెళ్ళి చేసుకున్నాడు. వీరికి ఐదుగురు పిల్లలు. వీరిలో కవలలు, ట్రిప్లెట్‌లు ఉండటం విశేషం. స్పేస్‌ ఎక్స్‌ ప్రాజెక్టు ప్రారంభ సమయంలో పెద్ద కుమారుడు కన్నుమూయడం మస్క్‌ను కలచివేసింది. 2008లో జస్టిన్‌ నుంచి విడిపోయాడు.

టోస్కా మస్క్, ఎలోన్ సోదరి. ఆమె మస్క్ ఎంటర్టైన్మెంట్  సంస్థకు వ్యవస్థాపకురాలు.వివిధ సినిమాలను  కూడా నిర్మించింది.

మస్క్ ఇంగ్లీష్ నటి తలులా రిలేతో  2010 లో,  రెండో  వివాహం చేసుకున్నాడు.మళ్లీ 2016 లో విడిపోవడం జరిగింది.

మస్క్ 2016 లో అమెరికన్ నటి అంబర్ హర్డ్ తో డేటింగ్ ప్రారంభించాడు, కాని వారు  ఒక సంవత్సరం తరువాత విడిపోయారు.

మే 7, 2018 న, మస్క్ ,   గ్రిమ్స్ తో డేటింగ్ ప్రారంభించాడు.గ్రిమ్స్ మే 4, 2020 న కుమారుడికి జన్మనిచ్చింది. మస్క్ అతనికి  "X Æ A-12"  అని పేరు పెట్టాడు.[17]

మూలాలు

[మార్చు]
  1. Hull, Dana (April 11, 2014). "Timeline: Elon Musk's accomplishments". Retrieved June 11, 2015 – via Mercury News.
  2. Zanerhaft, Jaron (2013). "Elon Musk: Patriarchs and Prodigies". CSQ. C-Suite Quarterly. Retrieved June 11, 2015.
  3. "Elon Musk". Forbes. Retrieved August 14, 2016.
  4. "Actor Talulah Riley files to divorce billionaire Elon Musk, again". The Guardian. March 21, 2016. Retrieved April 20, 2016. The pair first married in 2010 and divorced in 2012. They remarried 18 months later.
  5. "Elon Musk withdraws Talulah Riley divorce papers after being spotted at Allen & Company conference". Mail Online. August 5, 2015.
  6. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; Starter అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  7. "Billionaire Tesla CEO Elon Musk Buys Neighbor's Home in Bel Air For $6.75 Million". Forbes. Retrieved November 1, 2013.
  8. "Inside Elon Musk's $17M Bel Air Mansion". Bloomberg News. Retrieved August 21, 2013.
  9. Ohnsman, Alan (April 25, 2014). "Tesla Pays CEO Musk $70,000 Following $78 Million Year". Bloomberg Business. Bloomberg. Retrieved June 11, 2015.
  10. Curtis, Sophie (November 10, 2014). "Elon Musk 'to launch fleet of internet satellites'". The Daily Telegraph. London. Retrieved June 23, 2015. Elon Musk, inventor and business magnate
  11. Vance, Ashlee (September 13, 2012). "Elon Musk, the 21st Century Industrialist". Bloomberg BusinessWeek. Retrieved June 23, 2015.
  12. "Early Career Engineers, Conferences and Careers". asme.org. Archived from the original on 2017-09-19. Retrieved November 4, 2015.
  13. Cine, Celebrity. "Top 19 Controversies Surrounding Elon Musk". cinecelebrity.com. CineCelebrity. Retrieved March 7, 2024.{{cite web}}: CS1 maint: url-status (link)
  14. "The Top 10 Venture Capitalists on 2014's Midas List". Forbes. Retrieved June 10, 2015.
  15. Albergotti, Reed (March 21, 2014). "Zuckerberg, Musk Invest in Artificial Intelligence Company". The Wall Street Journal. Retrieved June 10, 2015.
  16. Love, Dylan (March 21, 2014). "Elon Musk And Mark Zuckerberg Have Invested $40 Million in a Mysterious Artificial Intelligence Company". Business Insider. Business Insider. Retrieved June 10, 2015.
  17. "Elon Musk and Grimes confirm baby name X Æ A-12". BBC News (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2020-05-06. Retrieved 2020-05-06.