ఎల్కోటి ఎల్లారెడ్డి
ఎల్కోటి ఎల్లారెడ్డి | |||
![]()
| |||
నియోజకవర్గం | నారాయణపేట అసెంబ్లీ నియోజకవర్గం | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | అక్టోబరు 1, 1939 ఉట్కూరు, మహబూబ్‌నగర్ జిల్లా | ||
మరణం | జనవరి 21, 2015 హైదరాబాద్ | ||
రాజకీయ పార్టీ | తెలుగుదేశం పార్టీ |
ఎల్కోటి ఎల్లారెడ్డి (అక్టోబరు 1, 1939 - జనవరి 21, 2015) మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు.
జీవిత విశేషాలు[మార్చు]
ఈయన 1939, అక్టోబరు 1న ఉట్కూరు గ్రామంలో జన్మించారు. వార్డు మెంబరుగా రాజకీయ ఆరంగేట్రం చేసి అంచెలంచెలుగా ఎదుగుతూ సర్పంచిగా, సమితి అధ్యక్షుడిగా, శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. రాష్ట్ర మంత్రిగానూ పనిచేశారు.
రాజకీయ ప్రస్థానం[మార్చు]
1965లో వార్డు సభ్యునిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించి, 1971లో సర్పంచిగా, 1982లో సమితి అధ్యక్షుడిగా, 1994లో శాసనసభ్యుడిగా ఎన్నికై 1997లో రాష్ట్రమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 1999లో మరోసారి తెలుగుదేశం పార్టీ తరఫున విజయం సాధించారు. 2004లో మహబూబ్ నగర్ లోకసభ స్థానం నుంచి పోటీచేసి ఓడిపోయారు. 2009లో నూతనంగా ఏర్పాటైన నారాయణపేట అసెంబ్లీ నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి మూడవసారి శాసనసభ్యుడిగా గెలుపొందారు.తెలంగాణా వచ్చిన తరవాత తెరాసలో చేరిన ఆయన ముక్తల్ లో అసెంబ్లీ స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు .[1]
వ్యక్తిగత జీవితం[మార్చు]
ఆయనకు నలుగురు కుమారులు ఉన్నారు. ఇద్దరు కొడుకులు వైద్యులు కాగా, మరో ఇద్దరు రాజకీయాల్లో ఉన్నారు.
మరణం[మార్చు]
జనవరి 6, 2015వ తేదీన తన ఇంట్లోని బాత్‌రూమ్‌లో కాలుజారి కిందపడిపోవడంతో అస్వస్థతకు గురైన ఆయనను కుటుంబసభ్యులు నిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు. రోజురోజుకూ ఆయన ఆరోగ్యపరిస్థితి విషమించడంతో మంగళవారం రాత్రి చికిత్స పొందుతూ జనవరి 21, 2015 న తుదిశ్వాస వదిలారు.[2]
మూలాలు[మార్చు]
- ↑ "మాజీ మంత్రి ఎల్లారెడ్డి కన్నుమూత". సాక్షి. 2015-01-21.
- ↑ మాజీ మంత్రి ఎల్లా రెడ్డి మృతి[permanent dead link]