ఎల్జీబీటీ ప్రజలపై హింస
ఎల్జీబీటీ ప్రజలు తరచుగా తమ లైంగికత, లింగ గుర్తింపు లేదా మనోలింగ వ్యక్తీకరణ (మానసిక లింగ వ్యక్తీకరణ) కారణంగా తమపై టార్గెట్ చేయబడిన హింసను అనుభవిస్తారు.[1] ఈ హింస కొన్ని దేశాల్లో స్వలింగ సంపర్కానికీ, మనోలింగ వ్యక్తీకరణకూ వ్యతిరేకమైన చట్టాల రూపంలో గానీ, లేదా ఎల్జీబీటీ వ్యతిరేకులైన వ్యక్తుల నుంచి గానీ రావచ్చు. ఈ హింస మానసికంగా కానీ శారీరకంగా కానీ ఉండవచ్చు. దీనికి పాల్పడేవారు హోమోఫోబియా [a] ద్వారా ప్రేరేపించబడవచ్చు. దీనిని ప్రభావితం చేసే కారకాలు సాంస్కృతిక, మతపరమైన, [2] [3] [4] లేదా రాజకీయ అంశాలు ఇంకా పక్షపాతాలు కావచ్చు. [5]
ప్రస్తుతం భారతదేశం, జపాన్, తైవాన్, థాయిలాండ్, వంటి ఆసియా దేశాలతో సహా దాదాపు అన్ని పాశ్చాత్య దేశాల్లోనూ స్వలింగ సంపర్క చర్యలు చట్టబద్ధంగా ఉన్నాయి, ఇంకా వీటిలో చాలా దేశాల్లో ఎల్జీబీటీ వ్యక్తులపై హింస ద్వేషపూరిత నేరంగా వర్గీకరించబడింది. ఇప్పుడు మనం మాట్లాడుకున్న దేశాల వెలుపల, వివక్షాపూరిత చట్టాలూ, హింసా, ఇంకా బెదిరింపుల కారణంగా అనేక దేశాలు తమ ఎల్జీబీటీ జనాభాకు ప్రమాదకరమైనవిగా పరిగణింపబడుతున్నాయి. వీటిల్లో ముఖ్యంగా ఇస్లాం ప్రధాన మతంగా ఉన్న దేశాలన్నీ, ఇస్లాం ప్రథాన మతంగా లేని దేశాలైన చాలా ఆఫ్రికన్ దేశాలూ (దక్షిణాఫ్రికా మినహా), మయన్మార్ వంటి ఆసియా దేశాలూ, ఇంకా ఐరోపాలో రష్యా, పోలాండ్ (ఎల్జీబీటీ-రహిత జోన్లు), సెర్బియా, అల్బేనియా, కొసావో, మోంటెనెగ్రో, ఇంకా బోస్నియా హెర్జెగోవినా వంటి కొన్ని పూర్వపు కమ్యూనిస్టు దేశాలూ ఉన్నాయి. [4] ఇటువంటి హింస తరచుగా స్వలింగ సంపర్కాన్ని ఒక రోగంగా లేదా క్యారెక్టర్ లేకపోడంగా చిత్రీకరించే సాంప్రదాయిక సామాజిక వైఖరులతో, ఇంకా మతపరమైన ఖండనతో ముడిపడి ఉంటుంది. [2] [3]
చారిత్రాత్మకంగా, స్వలింగ సంపర్కులపై చట్టం ద్వారా ఆమోదించబడిన హింస ఎక్కువగా పురుషుల మధ్య స్వలింగ సంపర్కానికి మాత్రమే పరిమితం చేయబడింది, దీనిని వలసవాద ఇంగ్లీషు చట్టాలలో "సాడమీ" అని పిలిచేవారు. మధ్య యుగాలలో, ఇంకా ఆధునిక యుగ ప్రారంభ కాలంలో, ఈ సాడమీ అనబడే స్వలింగ సంపర్కానికి క్రిస్టియన్, ముస్లిం పాలిత దేశాల్లో సాధారణంగా మరణ శిక్ష విధించబడేది. [6] ఆధునిక కాలంలో (19వ శతాబ్దం నుండి 20వ శతాబ్దం మధ్యకాలం వరకు) పాశ్చాత్య దేశాల్లో ఈ శిక్షల తీవ్రత మెల్లగా తగ్గుతూ జరిమానాలుగా లేదా చిన్నపాటి జైలుశిక్షగా మారింది. పరస్పర అంగీకారంతో జరీపే స్వలింగ సంపర్కం చట్టవిరుద్ధంగా ఉన్న దేశాల సంఖ్య మెల్లగా తగ్గుముఖం పడుతూ వస్తోంది. 2009లో ప్రపంచవ్యాప్తంగా 80 దేశాల్లో (ముఖ్యంగా మధ్యప్రాచ్యం, మధ్య ఆసియా, ఇంకా ఆఫ్రికాలో చాలా వరకు, కానీ కొన్ని కరేబియన్, వాయువ్యాసియా, పసిఫిక్ దేశాలూ) స్వలింగ సంపర్కం చట్టవిరుద్ధం కాగా (వీటిలో 5 దేశాలు మరణశిక్ష విధిస్తున్నాయి), [7] 2016 వచ్చేటప్పటికి ఈ సంఖ్య 72 దేశాలకు తగ్గింది.[8]
ఎల్జీబీటీ హక్కులకు చట్టపరమైన రక్షణ, ఇంకా స్వలింగ వివాహాలకు చట్టబద్ధతా కలిగిన దేశం అయిన బ్రెజిల్ ప్రపంచంలోనే అత్యధిక ఎల్జీబీటీ హత్యల రేటును కలిగి ఉంది, 2017లోనే 380 కంటే ఎక్కువ హత్యలు జరిగాయి, 2016తో పోలిస్తే ఇది 30% పెరుగుదల. [b] [9] స్వలింగ సంపర్కులైన పురుషులు ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో ప్రాణాంతకమైన హింసను అనుభవిస్తారు, ఉదాహరణకు ఇస్లామిక్ స్టేట్ (ISIS) పాలిత ప్రాంతాల్లోనూ, లేదా నైజీరియా వంటి దేశాల్లోనూ వారిని రాళ్లతో కొట్టి చంపుతున్నారు. [10] [11] [12]
కొన్ని దేశాల్లో, 85% ఎల్జీబీటీ విద్యార్థులు తమ స్కూళ్లలో ఎల్జీబీటీ వ్యతిరేక హింసను అనుభవిస్తున్నారని అంచనా, ఇంకా 45% ట్రాన్స్‌జెండర్ విద్యార్థులు ఈ వేధింపులూ, హింసా తట్టుకోలేక పూర్తిగా చదువు మానేస్తున్నారు. [13] అంతిమంగా తమ కుటుంబ ఆదరణ కూడా కరువయ్యి, ఎంతో మంది ట్రాన్స్‌జెండర్ పిల్లలు పొట్టకూటి కోసం భిక్షాటనకూ, పడుపు వృత్తికీ సిద్ధపడుతున్నారు.
పాదపీఠిక
[మార్చు]- ↑ ఎల్జీబీటీ వ్యక్తులన్నా, చర్యలన్నా పడకపోవడాన్ని, లేదా వారిపై ద్వేషాన్ని హోమోఫోబియా అంటారు.
- ↑ గ్రూపో గే దా బాహియా (GGB) నివేదిక ప్రకారం
మూలాలు
[మార్చు]- ↑ "Violence Against the Transgender Community in 2019 | Human Rights Campaign". Archived from the original on 2020-10-06. Retrieved 2020-06-17.
- ↑ 2.0 2.1 Stewart, Chuck (2009). The Greenwood Encyclopedia of LGBT Issues Worldwide (Volume 1). Santa Barbara, California: Greenwood Press. pp. 4, 7, 85–86. ISBN 978-0313342318.
- ↑ 3.0 3.1 Stewart, Chuck (2009). The Greenwood Encyclopedia of LGBT Issues Worldwide (Volume 2). Santa Barbara, California: Greenwood Press. pp. 6–7, 10–11. ISBN 978-0313342356.
- ↑ 4.0 4.1 Stewart, Chuck (2009). The Greenwood Encyclopedia of LGBT Issues Worldwide (Volume 3). Santa Barbara, California: Greenwood Press. pp. 1, 6–7, 36, 65, 70. ISBN 978-0-313-34231-8.
- ↑ Meyer, Doug (2015). Violence against Queer People. Rutgers University Press. Archived from the original on 2019-05-15. Retrieved 2017-07-20.
- ↑ Reggio, Michael (February 9, 1999). "History of the Death Penalty". PBS Frontline. Archived from the original on 2020-01-16. Retrieved 2020-02-06.
- ↑ Radia, Kirit; Dwyer, Devin; Gorman, Elizabeth (June 19, 2009). "New Benefits for Same-Sex Couples May Be Hard to Implement Abroad". ABC News (in ఇంగ్లీష్). Archived from the original on 2023-01-25. Retrieved 2023-01-02.
- ↑ "ILGA publishes 2010 report on State sponsored homophobia throughout the world". International Lesbian, Gay, Bisexual, Trans and Intersex Association. 2010. Archived from the original on 2014-03-23.
- ↑ "Brazil has world's highest LGBT murder rate, with 100s killed in 2017 – MambaOnline – Gay South Africa online". MambaOnline – Gay South Africa online (in అమెరికన్ ఇంగ్లీష్). January 24, 2018. Archived from the original on 2018-09-24. Retrieved 2018-03-29.
- ↑ "ISIS Hurls Gay Men Off Buildings, Stones Them: Analysts". NBC News (in ఇంగ్లీష్). August 26, 2015. Retrieved 2023-11-19.
- ↑ ISIS throws gay men off buildings | CNN (in ఇంగ్లీష్), March 5, 2015, retrieved 2023-11-19
- ↑ Hazzad, Ardo (July 2, 2022). "Nigerian Islamic court orders death by stoning for men convicted of homosexuality". Reuters (in ఇంగ్లీష్). Retrieved 2023-11-19.
- ↑ "Report shows homophobic and transphobic violence in education to be a global problem". May 17, 2016. Archived from the original on October 18, 2020. Retrieved March 10, 2020.