ఎల్. కిజుంగ్లుబా ఆవో

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ద రెవెడెంట్
జననం(1906-02-08)1906 ఫిబ్రవరి 8
లిర్మన్, నాగాహిల్స్ జిల్లా, అసోం రాజ్యం, బ్రిటిష్ ఇండియా (ప్రస్తుతం లిర్మన్, మొకొక్చుక్ జిల్లా, నాగాలాండ్, భారతదేశం)
మరణం1997 జనవరి 22(1997-01-22) (వయసు 90)
పురస్కారాలుపద్మశ్రీ పురస్కారం (1976)

ఎల్. కిజుంగ్లుబా (1906 ఫిబ్రవరి 8 - 1997 జనవరి 22) నాగాలాండ్ నుండి వచ్చిన మొదటి బాప్టిస్ట్ మిషనరీ. అతను భారతదేశంలోని నాగాలాండ్ లోణి మోకోక్చుంగ్ జిల్లా లిర్మెన్ గ్రామంలో జన్మించాడు.

జీవితం

[మార్చు]

అతను భారతదేశంలోని నాగాలాండ్ లోని ఆవో నాగా బాప్టిస్ట్ అసోసియేషన్కు ఫీల్డ్ డైరెక్టర్గా పనిచేశాడు. ఈ పదవిలో అతను ఈశాన్య భారతదేశంలోని ఆవో నాగా తెగల చర్చిల పనిని పర్యవేక్షించాడు. గతంలో ఈ బాధ్యతను అమెరికన్ మిషనరీలు నిర్వహించేవి. ఒక అమెరికన్ మిషనరీ అతనిని నాగా క్రైస్తవులలో "పెద్ద రాజనీతిజ్ఞుడు" గా అభివర్ణించారు.

కిజుంగ్లుబా జోర్హాట్ లోని జోర్హాట్ క్రిస్టియన్ హైస్కూల్లో చదివాడు. చాలా సంవత్సరాలుగా తన ప్రజలలో పాస్టర్, సువార్తికుడుగా ఉన్నాడు. అతను ఈశాన్య భారతదేశంలోని బాప్టిస్ట్ చర్చిల మండలికి అధ్యక్షుడిగా ఉన్నాడు. అతను అస్సాం క్రిస్టియన్ కౌన్సిల్లో అధికారిక పదవుల్లో కూడా పనిచేశాడు. అఖిల భారత క్రిస్టియన్ సమావేశాలకు హాజరయ్యాడు. నాగాలాండ్ లో విప్లవ ఉద్యమం వల్ల ఏర్పడిన ఇబ్బందుల సమయంలో సయోధ్యలో అతను సాపేక్షంగా తెలియని పాత్ర పోషించాడు. ది డైలీ నోట్స్ (కానన్స్ బర్గ్, పెన్సిల్వేనియా 1963 ఏప్రిల్ 10) లో నివేదించిన విధంగా నెహ్రూ స్వయంగా అతనిని సంప్రదించాడు.[1] అల్లకల్లోల సమయాల్లో అతను పోషించిన పాత్రకు గాను ఆయనకు 1965లో అమెరికన్ బాప్టిస్ట్ కన్వెన్షన్ యొక్క ఎడ్విన్ టి. డాల్బర్గ్ శాంతి పురస్కారం లభించింది.[2] సామాజిక సేవకు అతను చేసిన కృషికి గాను 1976లో భారతదేశపు నాల్గవ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీ అవార్డు అందుకున్నాడు.

మూలాలు

[మార్చు]
  1. "Baptist". Canonsburg, Pennsylvania: The Daily Notes. 10 April 1963. p. 3 – via newspapers.com.
  2. "Dahlberg Award Winners". Levellers. 4 July 2007. Retrieved 8 May 2015.