ఎవ్వరికీ చెప్పొద్దు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎవ్వరికీ చెప్పొద్దు
దర్శకత్వంబసవ శంకర్‌
రచనబసవ శంకర్‌
నిర్మాతరాకేశ్‌ వర్రే
తారాగణంరాకేశ్‌ వర్రె, గార్గేయి ఎల్లాప్రగడ
ఛాయాగ్రహణంబ‌స‌వ శంక‌ర్‌
తేజ యర్రంశెట్టి
స‌త్య‌జిత్ సుగ్గు
సంగీతంశంక‌ర్ శ‌ర్మ‌
నిర్మాణ
సంస్థ
క్రేజీ యాంట్స్‌ ప్రొడక్షన్స్‌
పంపిణీదార్లుశ్రీ వెంకటేశ్వర ఫిలింస్‌ దిల్‌రాజు
విడుదల తేదీ
8 అక్టోబరు 2019 (2019-10-08)
సినిమా నిడివి
148 నిమిషాలు
దేశం భారతదేశం
భాషతెలుగు

ఎవ్వరికీ చెప్పొద్దు 2019లో విడుదలైన తెలుగు సినిమా. క్రేజీ యాంట్స్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై రాకేశ్‌ వర్రే నిర్మించగా బసవ శంకర్‌ దర్శకత్వం వహించాడు. రాకేశ్‌ వర్రె, గార్గేయి ఎల్లాప్రగడ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర ఫిలింస్‌ బ్యానర్‌పై దిల్‌రాజు అక్టోబర్‌ 8న విడుదల చేశాడు.[1]

హరి (రాకేష్ వర్రే) హారతి (గార్గేయి యల్లాప్రగడ) ఒకరికిఒకరి ఇష్టపడతారు. అయితే తన తండ్రికున్న కుల పిచ్చి గుర్తు వచ్చి హరిది వేరే కులం అని ఆ ప్రేమను హరి మీద వ్యక్త పరచాదు. కొన్ని సంఘటనలు అనంతరం హరికి, హారతి ఇంకా బాగా నచ్చేస్తోంది, అలాగే హారతికి కూడా హరి అంతే నచ్చుతాడు. కానీ తన కుటుంబ పరిస్థితుల రీత్యా తాము ఇద్దరం కలవడం అసాధ్యం అని భావించిన హారతి, హరికి దూరంగా తన గురించి ఏ వివరాలు తెలియకుండా హరిని వదిలి వెళ్ళిపోతుంది. దాంతో హరి హారతి కోసం ఏమి చేశాడు ? చివరికీ హరి హారతిని పెళ్లి చేసుకున్నాడా ? లేదా ? అనేదే మిగతా సినిమా కథ.[2]

నటీనటులు

[మార్చు]
  • రాకేశ్‌ వర్రె
  • గార్గేయి ఎల్లాప్రగడ [3]
  • వంశీ రాజ్ నెక్కంటి
  • ఘని
  • మేకా రుక్మిణి
  • సుజాత గీసుకొండ
  • గడ్డం శ్రీనివాస్
  • కె.ప్రసన్న

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: క్రేజీ యాంట్స్‌ ప్రొడక్షన్స్‌
  • నిర్మాత: రాకేశ్‌ వర్రే
  • కథ, స్క్రీన్‌ప్లే , దర్శకత్వం: బసవ శంకర్‌
  • సంగీతం: శంక‌ర్ శ‌ర్మ‌
  • సినిమాటోగ్రఫీ: బ‌స‌వ శంక‌ర్‌, తేజ యర్రంశెట్టి, స‌త్య‌జిత్ సుగ్గు

మూలాలు

[మార్చు]
  1. Suryaa (5 October 2019). "అక్టోబర్‌ 8న 'ఎవ్వరికీ చెప్పొద్దు'". Archived from the original on 22 సెప్టెంబరు 2021. Retrieved 22 September 2021.
  2. The Times of India (8 October 2019). "Evvarikee Cheppoddu Movie Review {3/5}: A fresh love story!". Archived from the original on 22 September 2021. Retrieved 22 September 2021.
  3. The Hindu (15 October 2019). "Gargeyi Yellapragada is confidence personified" (in Indian English). Archived from the original on 22 సెప్టెంబరు 2021. Retrieved 22 September 2021.