ఎస్పరాంటో

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఎస్పెరాంటో అంతర్జాతీయ భాష. దీనిని 1887 లో లుడ్విగ్ లజారస్ జామెన్ హాఫ్ తయారుచేశారు. ప్రస్తుతము 20 లక్షల మందికి పైగా ఈ భాషను మాట్లాడుతున్నారు. ఇది అన్ని భాషలకన్నా సులభంగా ఉంటుంది. ఈ భాషను మాట్లాడేవారు ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలలో ఉన్నారు. ఎస్పెరాంటో నేర్చుకోవటం ద్వారా అన్ని దేశాలలో మనం మిత్రులను కలిగిఉండవచ్చు. ఈ భాషను తెలుగు ద్వారా నేర్చుకోవటానికి తిరుపతికి చెందిన గోగుల విజయ కుమార్ ఒక పుస్తకాన్ని ప్రచురించారు. ఈ భాషలో 28 అక్షరాలుంటాయి. ఒక్కొక్క అక్షరానికి ఒక శబ్దం మాత్రమే ఉంటుంది. వ్యాకరణం అంతా 16 సూత్రాలలో ఇమిడి ఉంటుంది. రాయటానికి ఎ బి సి డి లనే వాడుతారు. అయితే కొన్ని అక్షరాలకు పై ఒత్తులు ఉంటాయి, ఉచ్చారణ సౌలభ్యం కోసం.

యూనివర్సల్ ఎస్పెరాంటొ అసోసియేషన్ నెదర్లాండ్స్లో రోటెర్ డాం నగరంలో ఉంది. వీరు పుస్తకాలను, పత్రికలను ముద్రిస్తారు. వీరి అంతర్జాల చిరునామా uea.org. ప్రతి సంవత్సరము ప్రపంచ ఎస్పెరాంటొ సమావేశాలు వివిధ దేశాలలో జరుగుతాయి. నూరవ ప్రపంచ ఎస్పెరాంటో సమావేశాలు జూలై 2015 లో లిల్లే నగరం, ఫ్రాన్స్ దేశంలో నిర్వహించబడతాయి. 2008లో బెంగళూరు, కర్ణాటకలో 5వ ఆసియా ఎస్పెరాంటొ సమావేశాలు జరిగాయి. భారతదేశంలో భారత ఎస్పెరాంటొ ఫెడరేషన్ 1983 నుంచి పనిచేస్తున్నది. 2008 నుంచి 2014 వరకు యూనివర్సల్ ఎస్పెరాంటొ అసోసియేషనుకు భారతదేశానికి చెందిన డా. ప్రొబాల్ దాస్ గుప్త అధ్యక్షుడుగా ఉన్నారు.

దస్త్రం:Esperanto
international language