ఎస్. ఎస్. రామసుబ్బు
స్వరూపం
ఎస్. ఎస్. రామసుబ్బు | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2009 - 2014 | |||
ముందు | ఆర్. ధనుస్కోడి అథితన్ | ||
---|---|---|---|
తరువాత | కె. ఆర్.పి. ప్రభాకరన్ | ||
నియోజకవర్గం | తిరునెల్వేలి | ||
ఎమ్మెల్యే
| |||
పదవీ కాలం 1989 – 1996 | |||
ముందు | ఎన్. షణ్ముగయ్య తేవర్ | ||
తరువాత | అల్లాది అరుణ | ||
నియోజకవర్గం | అలంగుళం | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
రాజకీయ పార్టీ | కాంగ్రెస్ | ||
నివాసం | తిరునెల్వేలి |
ఎస్. ఎస్. రామసుబ్బు భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై, 2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో తిరునెల్వేలి నియోజకవర్గం నుండి తొలిసారిగా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2]
రాజకీయ జీవితం
[మార్చు]ఎస్. ఎస్. రామసుబ్బు తన తండ్రి ఎస్. సుదలైముత్తు నాడార్ అడుగుజాడల్లో కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1972లో జిల్లా విద్యార్థి కాంగ్రెస్ కార్యదర్శిగా పని చేశాడు. ఆయన అలంగుళం నుండి 1989, 1991 ఎన్నికలలో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3][4] ఆయన 2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో తిరునెల్వేలి నుండి తొలిసారి లోక్‍సభ సభ్యుడిగా ఎన్నికై పార్లమెంట్‌లో సైన్స్ & టెక్నాలజీ, పర్యావరణ & అటవీ కన్సల్టేటివ్ కమిటీ సభ్యుడిగా, రక్షణ మంత్రిత్వ శాఖ సభ్యుడిగా వివిధ హోదాల్లో పని చేశాడు.[5][6][7]
మూలాలు
[మార్చు]- ↑ "Detailed Profile: Shri S.S. Ramasubbu". India.gov.in Archive. National Informatics Centre. Archived from the original on 22 డిసెంబరు 2015. Retrieved 8 June 2015.
- ↑ "Statistical Reports of Lok Sabha Elections" (PDF). Election Commission of India. Retrieved 17 September 2011.
- ↑ 1989 Tamil Nadu Election Results, Election Commission of India
- ↑ 1991 Tamil Nadu Election Results, Election Commission of India
- ↑ The Hindu (1 May 2010). "MPs honoured" (in Indian English). Archived from the original on 27 September 2024. Retrieved 27 September 2024.
- ↑ The Hindu (12 April 2014). "It looks advantage DMK in Tirunelveli" (in Indian English). Archived from the original on 27 September 2024. Retrieved 27 September 2024.
- ↑ The Hindu (20 April 2014). "More crorepatis and candidates with criminal cases" (in Indian English). Archived from the original on 27 September 2024. Retrieved 27 September 2024.