ఎ.ఎస్.బ్యాట్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
A. S. Byatt/ఎ.ఎన్.బ్యాట్ (పూర్తి పేరు) అంటోనియా సూజన్ బ్యాట్.
Byatt in June 2007 in Lyon, France.
పుట్టిన తేదీ, స్థలంAntonia Susan Drabble
(1936-08-24) 1936 ఆగస్టు 24 (వయసు 87)
Sheffield, England
వృత్తిWriter, poet రచయిత్రి
జాతీయతEnglish/ ఇంగ్లీష్
కాలం1964 – present/ ప్రస్తుతం
పురస్కారాలుMan Booker Prize/ బుకర్ ప్రైజ్

ఆగ్రశ్రేణి ప్రపంచ రచయితల్లో బ్యాట్ ఒకరు. సాహిత్యాన్ని గురించి, సాహితి వ్వక్తిత్వాల గురించి నవలలు వ్రాయటం ఈమె విలక్షణత. సాహిత్య సిద్ధాంతాలు, దేశదేశాల జానపద గాథలు, అభూత కల్పనలూ, తర తర సాహితీ వారసత్వము ఈమె రచనలకు యితి వృత్తాలు. చారిత్రిక అంశాలను ఆధారంగా చేసుకొని వ్రాసిన ఈమె రచనలను చదివిన పాఠకులు, వాస్తవమేదో...... కల్పన ఎదో తేల్చుకోలేక తికమక పడతారు. సరదాగా చదువుకొని తృప్తి పదదామనుకునే చదువరలకు అది కొరుకుడు పడక పోవచ్చు. తన రచన నారికేళ పాకముగా వుంటే తనకిష్టమని కాదు గానీ, వేరు విధంగా తాను వ్రాయలేనంటుంది. బుకర్ బహుమతితో పాటు అనేక సాహితి బహుమతులను అందుకున్న బ్యాట్ స్వయంగా చిత్రకారిణి కూడ.

బాల్యము,విద్య[మార్చు]

ఎ.ఎన్.బ్యాట్ పూర్తి పేరు అంటోనియా సూజన్ బ్యాట్. ఈమె ఆగస్టు 24, 1936లో ఇంగ్లాండ్ లోని యార్క్ షైర్ లో పుట్టింది. క్వేకర్ స్కూల్, న్యూన్ హాం కాలేజ్, సామర్ విల్ కాలేజీల్లో విద్యాభాసం చేసింది. లండన్ యూనివర్సిటి లోని కుడ్య చిత్ర విభాగంలోనూ, సెంట్రల్ స్కూల్ ఆఫ్ ఆర్ట్ అండ్ డిజైన్ లోనూ కొంత కాలము బోధించింది. ఇంగ్లీషు సాహిత్య అధ్యపకురాలిగా కొంత కాలం పనిచేసింది. అనేక సాహితీ బహుమతులకు న్యాయనిర్ణేతగా వ్వవహరించింది.

ఇతివృత్తాలు[మార్చు]

సాహిత్యాన్ని గురించి, సాహిత్య వ్వక్తిత్వాలగురించి, సాహిత్య సిద్ధాంతాలు, వివిధ దేశాల జానపద గాథలు, మొదలైనవాటిని ఇతి వృత్తాలుగా తీసుకొని శాస్త్రీయ పరిజ్ఞానముతో అభూత కల్పనలు కలగలిపి రాయటంలో ఈమె నేర్పరి. చారిత్రక అంశాలను ఆధారంగా చేసుకొని వ్రాసిన నవలలను చదివిన పాఠకులు అందులోని వాస్తవమెంతో, కల్పన ఎంతో తెలుసుకోలేక తికమక పడతారు. కాని కొంత ఓపికతో చదివితే అందులోని ఆనందమే వేరు.

రచనాశైలి[మార్చు]

చారిత్రిక అంశాలు మాత్రమే కాదు, కవుల నిజ జీవితములోని విషయాలను ఇతివృత్తాలుగా తీసుకొని, అందులో ఆయా కవుల నిజజీవితములోని సంఘటనలు, వారు పుట్టిన తేదీలు, వారు చదివిన పాఠశాలలతో సహా రాస్తుంది. ఆ సంఘటనల చుట్టూ అభూత కల్పనలు కల్పించి వ్రాస్తే అదేదో ఆయా కవుల పరిశోధనాత్మక చరిత్ర అనే భ్రమను కల్పిస్తాయి తప్ప ఎవరు మాత్రము అది కల్పన అని అనుకోలేరు. ఈ శైలిలో వ్రాయడములో ఈమెకు విలక్షణ ఉంది. సరదాగా చదువుకుందా మనుకునే వారికి ఈ పుస్తకాలు కొరుకుడు పడక పోవచ్చు. కాని కొంత కృషితో చదివితే కలిగే పఠనానందము అపూర్వమైనది. నారికేళ పాకములో వ్రాయడము తనకిష్టమని కాదు గాని వేరు విధంగా వ్రాయలేనంటారు బ్యాట్.

రచనలు[మార్చు]

బ్యాట్ వ్రాసిన తొలి నవల షాడో ఆఫ్ ఎ సన్ ఇది 1964లో అచ్చయింది. తండ్రి మాటకు ఎదురు చెప్పలేని ఒక చిన్న పిల్ల కథ ఇది. తర్వాతి నవల ది గేం. ఇందులో అక్కాచెళ్ళెళ్ళ అనుబంధాన్ని చిత్రించారు. ఇది 1987 లో విడుదలై విమర్శకుల ప్రశంశలను అందుకుంది. ఈమెకు విశేష ఖ్యాతిని తెచ్చిపెట్టిన నవల పొసెషన్ 1990లో విడుదలయినది. 1992లో ఎంజిల్స్ అండ్ ఇన్ సెక్ట్స్ అనె రెండు నవలలు వెలువడ్డాయి. పాఠకులు బాగా ఇష్టపడ్డ ఈమె కథా సంకలనాలు షుగర్ అండ్ ఆదర్ స్టోరీస్. 1987, 1993లలో వెలువడ్డాయి. చిత్ర కళలో ప్రావీణ్యమున్న బ్యాట్, ఎమిల్ జోలా, మరెల్ ప్రూ, స్రె ఐరిస్ మర్దోక్ ల నవల్లో చిత్రాల ప్రాధాన్యాన్ని గురించి పోర్టెయిట్స్ ఫిక్షన్ అనే పుస్తకం వ్రాసి 2001 లో ప్రచురించింది. ప్రముఖ ప్రెంచి చిత్రకారుడు మాటిస్ చిత్రాల ప్రేరణతో వ్రాసిన కథలు జిన్ అండ్ ది నైటింగేల్స్ - స్తోరీస్ ఒఫ్ ఫైర్ అండ్ ఐస్. 1998 లో విడుదల అయింది. ఈమె ఇటీవల (2003) విడుదల చేసిన కథా సంకలనం లిటిల్ బ్లాక్ బుక్

అందుకున్న అవార్డులు[మార్చు]

ఈమె వ్రాసిన నవలా మాలికకు సిల్వర్ పెన్ అవార్డు వచ్చింది. 1990, 1999 లలో బ్రిటిష్ ప్రభుత్వం, బ్యాట్ చేసిన రచనా సేవను గుర్తించి సత్కరించింది. 2002 లో షేక్సియర్ ప్రైజ్ కూడ గెలుచుకుంది. ఈమె వ్రాసిన పొజిషెన్ 1990 లో బుకర్ ప్రైజ్ కు ఎంపికైంది. ఐరిష్ టైమ్స్ పత్రిక ఇంటర్నేషనల్ ఫిక్షన్ ప్రైజ్ తో సత్కరించింది. ఈమెకు విశేష ఖ్యాతిని ఆర్జించి పెట్టినది ఈ పుస్తకమే. ఈమె అనేక విశ్వ విద్యాలయాలనుండి గౌరవ డాక్టరేట్ ను కూడ పొందారు.

మూలాలు[మార్చు]