ఎ. శివశైలం
ఎ. శివశైలం | |
---|---|
జననం | |
మరణం | 2011 జనవరి 12 | (వయసు 76)
విద్యాసంస్థ | లయోలా కళాశాళ, చెన్నై |
వృత్తి | పారిశ్రామికవేత్త విద్యావేత్త దాత |
క్రియాశీల సంవత్సరాలు | 1957–2011 |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | అమాల్గమేషన్స్ గ్రూప్ |
జీవిత భాగస్వామి | ఇందిరా శివశైలం |
పిల్లలు | మల్లికా శ్రీనివాసన్ జయశ్రీ వెంకటరామన్ |
తల్లిదండ్రులు | ఎస్. అనంతరామకృష్ణన్ (తండ్రి) |
పురస్కారాలు | పద్మశ్రీ NIQA Outstanding Industrialist Award SAE India Lifetime Achievement Award SIAM Lifetime Achievement Award AIMA Distinguished Service Award ACMAI Golden Jubilee Lifetime Contribution Award |
అనంతరామకృష్ణన్ శివశైలం (1934 ఆగష్టు 24 - 2011 జనవరి 12) భారతీయ పారిశ్రామికవేత్త, విద్యావేత్త, దాత. 12,000 (2011 నాటికి) పైచిలుకు శ్రామికశక్తిని కలిగి, ₹ 7000 కోట్ల వార్షిక వ్యాఓఅరం గల అమాల్గమేషన్స్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్‌కు మాజీ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్.[1] అతను 2015 లో US$ 2.5 బిలియన్ల నికర విలువతో భారతదేశంలో 37వ సంపన్నుడిగా ఫోర్బ్స్ జాబితాలో చోటు చేసుకున్నాడు.[2] అతను సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్‌కు (1970, 1971) [3] ASSOCHAM కూ అధ్యక్షుడిగా ఉన్నాడు. 1969-1970 మధ్యకాలంలో మద్రాస్ షెరీఫ్ గా పనిచేసాడు.[4] భారత పరిశ్రమకు ఆయన చేసిన సేవలకు గాను 2007 లో భారత ప్రభుత్వం ఆయనకు నాల్గవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మశ్రీని ప్రదానం చేసింది.[5]
జీవిత చరిత్ర
[మార్చు]శివశైలం 1934 ఆగస్టు 24న దక్షిణ తమిళనాడు రాష్ట్రం తిరునెల్వేలి జిల్లాలోని ఆళ్వార్‌కురిచిలో అమాల్‌గమేషన్స్ గ్రూప్ వ్యవస్థాపకుడు ఎస్. అనంతరామకృష్ణన్‌కు పెద్ద కుమారుడిగా జన్మించాడు.[4] అతను చెన్నైలోని లయోలా కళాశాల నుండి వాణిజ్యంలో పట్టభద్రుడయ్యాడు. లండన్‌లోని చార్టర్డ్ అకౌంటెన్సీ సంస్థలో అకౌంటెంట్‌గా తన వృత్తిని ప్రారంభించాడు. అక్కడ అతను నాలుగు సంవత్సరాలు పనిచేశాడు. [6] 1957 లో అతను తన తండ్రితో కలిసి కంప్ట్రోలర్, కోశాధికారిగా వారి కుటుంబ వ్యాపారంలో చేరాడు. 1960 లో ప్రారంభించిన ట్రాక్టర్స్ అండ్ ఫార్మ్ ఎక్విప్‌మెంట్ లిమిటెడ్ (TAFE) లో[7] జనరల్ మేనేజర్‌గా 1961 లో బాధ్యతలు చేపట్టాడు.[8] అతను 7 సంవత్సరాలు TAFEకి నాయకత్వం వహించాడు. 1964 లో తండ్రి మరణించిన తరువాత, అతను గ్రూప్ వ్యాపారానికి నాయకత్వం చేపట్టాడు. అధికారికంగా 1968 లో గ్రూప్‌కు ఛైర్మన్ అయ్యాడు. అతని తన సోదరుడు A. కృష్ణమూర్తి వైస్ ఛైర్మన్‌గా ఎన్నికయ్యాడు.[9] 2011 లో మరణించే వరకు శివశైలం ఈ పదవిలో ఉన్నాడు. ఈ కాలంలో గ్రూప్ వ్యాపారం ₹ 35 కోట్ల నుండి ₹ 7000 కోట్లకు పెరిగింది. 48 అనుబంధ సంస్థలు, 12,000 మంది ఉద్యోగుల స్థాయికి ఎదిగింది.[1] ట్రాక్టర్స్ అండ్ ఫార్మ్ ఎక్విప్‌మెంట్ లిమిటెడ్, గ్రూప్ యొక్క ఫ్లాగ్‌షిప్ కంపెనీ, అప్పటి నుండి భారతదేశంలో అతిపెద్ద ఎగుమతిదారుగా, వ్యవసాయ ట్రాక్టర్ల తయారీలో రెండవ అతిపెద్ద సంస్థగా అవతరించింది.[6] కంపెనీ వార్షిక ఉత్పత్తి 100,000 ట్రాక్టర్లు, వార్షిక వ్యాపారం US$ 1600 కోట్లు.[8]
ASSOCHAM మాజీ ప్రెసిడెంట్ అయిన శివశైలం, సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్‌కి వరుసగా రెండు పర్యాయాలు (1970, 1971) [3] అధ్యక్షుడిగా ఉన్నాడు. 1969 నుండి 1970 వరకు రెండు సంవత్సరాలు మద్రాస్ షెరీఫ్‌గా పనిచేశాడు.[4] అతనికి మద్రాస్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీతో, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్‌తో అనుబంధం ఉంది. పరమకల్యాణి గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్, అల్వార్‌కురిచి, తిరునెల్వేలిలోని మనోన్మణియం సుందరనార్ యూనివర్శిటీలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎన్విరాన్‌మెంట్ సైన్సెస్ స్థాపకుడు.[1] తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం అతనికి డాక్టర్ ఆఫ్ సైన్స్ ( హోనరిస్ కాసా ) డిగ్రీ ఇచ్చి సత్కరించింది. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్వాలిటీ అస్యూరెన్స్ అతనికి అత్యుత్తమ పారిశ్రామికవేత్త పురస్కారం ప్రదానం చేసింది.[1] అతను SAE ఇండియా, సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (SIAM) నుండి లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ పురస్కారాలను, ఆల్ ఇండియా మేనేజ్‌మెంట్ అసోసియేషన్ (AIMA) నుండి విశిష్ట సేవా పురస్కారాన్నీ అందుకున్నాడు.[1] ఆటోమోటివ్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నుండి గోల్డెన్ జూబ్లీ లైఫ్‌టైమ్ కంట్రిబ్యూషన్ పురస్కారం అందుకున్నాడు. లండన్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్‌లో ఫెలో.[8] 2007 లో భారత ప్రభుత్వం వారి పద్మశ్రీ పౌర పురస్కారం అందుకున్నాడు.[5]
శివశైలం 2011 జనవరి 12 న గుండెపోటుతో మణిపాల్‌లోని కస్తూర్బా ఆసుపత్రిలో మరణించారు.[10] అతని భార్య ఇందిరా శివశైలం అతని కంటే ముందు మరణించింది; ఆ దంపతులకు ఇద్దరు కుమార్తెలు-[11] పెద్ద కుమార్తె, మల్లికా శ్రీనివాసన్, వార్టన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ పూర్వ విద్యార్థి, [12] ట్రాక్టర్స్ అండ్ ఫార్మ్ ఎక్విప్‌మెంట్ లిమిటెడ్ కు ఛైర్మన్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. ఆమె టీవీఎస్ గ్రూప్ చైర్మనైన వేణు శ్రీనివాసన్ భార్య.[13] చిన్న కుమార్తె జయశ్రీ వెంకట్రామన్, TAFE డైరెక్టర్, చెన్నైకి చెందిన పారిశ్రామిక సమూహం WS ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టరైన మురళీ వెంకట్రామన్ భార్య.[4]
ఇవి కూడా చూడండి
[మార్చు]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 "Industrialist A. Sivasailam passes away". The Hindu. 12 January 2012. Retrieved 14 January 2016.
- ↑ "Amalgamations family". Forbes. 2015. Retrieved 14 January 2016.
- ↑ 3.0 3.1 "Society of Indian Automobile Manufacturers President". Society of Indian Automobile Manufacturers. 2016. Retrieved 14 January 2016.
- ↑ 4.0 4.1 4.2 4.3 "Sivasailam – gentle, yet forceful". Business Line. 12 January 2011. Retrieved 14 January 2016.
- ↑ 5.0 5.1 "Padma Awards" (PDF). Ministry of Home Affairs, Government of India. 2016. Archived from the original (PDF) on 15 October 2015. Retrieved 3 January 2016.
- ↑ 6.0 6.1 "He oversaw Amalgamations Group's rise to a Rs 7k-cr giant". Business Standard. 12 January 2011. Retrieved 14 January 2016.
- ↑ "History". TAFE. 2016. Archived from the original on 17 January 2016. Retrieved 14 January 2016.
- ↑ 8.0 8.1 8.2 "History in Making". Slide Share. 2016. Retrieved 14 January 2016.
- ↑ "Tributes paid to Anantharamakrishnan". The Hindu. 12 November 2005. Archived from the original on 12 April 2006. Retrieved 14 January 2016.
- ↑ "Amalgamations group chief Sivasailam passes away". Deccan Herald. 12 January 2011. Retrieved 14 January 2016.
- ↑ "Indira Sivasailam passes away". Business Line. 24 December 2008. Retrieved 14 January 2016.
- ↑ "Amalgamations Group's succession planning focus on theme 'unity': Mallika Srinivasan". Economic Times. 8 November 2011. Archived from the original on 5 మార్చి 2016. Retrieved 14 January 2016.
- ↑ "Next gen of Chennai-based family biz groups sits pretty at helm". The Financial Express. 6 March 2013. Retrieved 14 January 2016.