ఎ .హెచ్.వి. సుబ్బారావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఎ.హెచ్.వి. సుబ్బారావు (జననం 1934-మరణం 2010) గా ప్రసిద్ధుడయిన అడిదం హనుమద్ వేంకట సుబ్బారావు ప్రముఖ పాత్రికేయులు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్, ఏఎన్‍ఎస్, ఆంధ్రజ్యోతి, పి.టి.ఐ. మొదలగు ప్రముఖ వార్తా సంస్థల్లో పనిచేసారు. సినిమా, సాంకేతికం, రాజకీయం, వ్యంగ్య రచనలు చేసేవారు.

వృత్తి

[మార్చు]

1957లో ఇండియన్ ఎక్స్‌ప్రెస్ మదురై ఎడిషన్ సబ్ ఎడిటర్ గా వృత్తి జీవితం ప్రారంభించారు. ఆ తరువాత కొంతకాలానికి హైదరాబాదు చేరి ఏ.ఎన్.ఎస్ లో రిపోర్టర్ గా పనిచేసారు. అనంతరం ఆంధ్రజ్యోతి దినపత్రికలో 1962 లో చేరారు. అక్కడ పదేళ్ళ పాటూ వివిధ అంశాలపై అనేక వ్యాసాలు, వ్యంగ్య రచనలు చేసి ప్రఖ్యాతి పొందారు. అనంతరం 1972లో పి.టి.ఐ. హైదరాబాదులో చేరారు. ఆపై ఢిల్లీలో ఆంధ్ర రాజకీయాలు చూసే ప్రత్యేక ప్రతినిధిగా పనిచేసారు. 1989 లో పక్షవాతం వచ్చే వరకూ ఇదే పనిలో చురుగ్గా కొనసాగారు. పక్షవాతం అనంతరం ఉద్యోగము నుండి సెలవు తీసుకొని హైదరాబాదుకు తిరిగి వచ్చారు. అప్పటి నుండి ఎన్నో డాక్యుమెంటరీ చిత్రాలు చేపట్టారు. 1994 లో పి.టి.ఐ. నుండి పదవీ విరమణ తీసుకొన్నారు.

మృతి

[మార్చు]

అకస్మాత్తుగా వచ్చిన గుండెపోటుతో 2010 నవంబరు 2లో నిర్యాణం చెందారు.[1]

మూలాలు

[మార్చు]