ఏకల్ విద్యాలయ ఫౌండేషన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఏకల్ విద్యాలయ ఫౌండేషన్
సంకేతాక్షరంEVF
స్థాపన1986
వ్యవస్థాపకులుభౌరావ్ దేవరాస్
Shyam Gupta
కార్యస్థానం
  • భారతదేశం, యునైటెడ్ స్టేట్స్
అనుబంధ సంస్థలుసంఘ్ పరివార్
జాలగూడుwww.ekal.org

ఏకల్ విద్యాలయ ఫౌండేషన్ అనేది భారతదేశంలోని ఏకోపధ్యాయ పాఠశాలలు నడిపే ఏకల్ అభియాన్ ప్రాజెక్ట్ కు ప్రధాన సంస్థ. ఈ ఫౌండేషన్ ఏకల్ అభియాన్ సంస్థ క్రింద పనిచేస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఆఫ్ ట్రైబల్స్ సొసైటీ (FTS), శ్రీ హరి సత్సంగ్ సమితి (SHSS), ఆరోగ్య ఫౌండేషన్ ఆఫ్ ఇండియా (AFI), గ్రామోత్తమ్ ఫౌండేషన్ (GF) అనే అనేక అనుబంధ సంస్థలను కలిగి ఉంది.[1]

స్థాపన

[మార్చు]

జార్ఖండ్‌లోని గుమ్లా జిల్లాలో ఏకల్ విద్యాలయ ఫౌండేషన్ 1986లో స్థాపించబడింది. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) 3వ సర్ సంఘచాలక్ మధుకర్ దత్తాత్రయ దేవరాస్ తమ్ముడు భౌరావ్ దేవరాస్ చేత ఇది ప్రారంభించబడింది. ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన సీనియర్ కార్యకర్త శ్యామ్ గుప్తా ద్వారా ఈ సంస్థ అభివృద్ధి చేయబడింది.[2][3] [4]

అభివృద్ధి

[మార్చు]

ఆగస్ట్ 2020 నాటికి, ఈశాన్య రాష్ట్రాలలో 2,100 పాఠశాలలతో సహా EVF ద్వారా 102753 కంటే ఎక్కువ పాఠశాలలు ఉన్నాయి. పాఠశాలల సంఖ్య 2010లో 27,000, 2011లో 34,000, 2013లో 51,717, 2020 నాటికి 1,02,753కి పెరిగింది. విద్య, పాఠశాల సవాలుగా ఉన్న గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి బిడ్డను చేరుకోవడమే EVF లక్ష్యం .EVF 2030 నాటికి 2,00,00 గ్రామ పాఠశాలలను చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.[5]

EVF హిందూ జాతీయవాద సంస్థలైన విశ్వ హిందూ పరిషత్‌తో అనుబంధం కలిగి ఉంది, ఇది రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) నిర్వహించే సంస్థల కుటుంబమైన సంఘ్ పరివార్‌లో భాగం. ఈ ఫౌండేషన్‌కు గతంలో ఎస్సెల్ గ్రూప్ చైర్మన్, జీ టీవీ వ్యవస్థాపకుడు సుభాష్ చంద్ర నాయకత్వం వహించాడు. భారతీయ నటి హేమ మాలిని, ఏకల్ విద్యాలయ ఉద్యమానికి ప్రపంచ బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేసింది.[6]

కార్యకలాపాలు

[మార్చు]

ఏకల్ విద్యాలయాలు 6-14 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు ఐదు సంవత్సరాల ఉచిత, అనధికారిక విద్యను అందిస్తుంది. ఒక సాధారణ పాఠశాలలో 8 లేదా 9 తరగతులు ఉత్తీర్ణులైన, ప్రత్యేకంగా శిక్షణ పొందిన స్థానిక యువకులచే బోధించబడే 30-40 మంది విద్యార్థులు ఉంటారు. స్థానిక నిర్వాహకుడు 10 పాఠశాలల యూనిట్‌ను "సబ్‌క్లస్టర్" అని పిలుస్తారు. స్థానిక ప్రజలు "క్లస్టర్" (30 పాఠశాలల యూనిట్), సబ్‌ఏరియా (90 పాఠశాలల యూనిట్), ప్రాంతం (270 పాఠశాలల యూనిట్) వంటి ఉన్నత సంస్థ స్థాయిలలో కూడా పాల్గొంటారు. తరగతులు చెట్టు కింద లేదా గుడిసెలో జరుగుతాయి. కథలు, జానపద నాటకాలు, జానపద పాటలు, ధార్మిక ప్రసంగాలు వంటి కార్యక్రమాలు కూడా జరువుతారు. విద్యార్థులు, ఉపాధ్యాయులలో సగం మంది స్త్రీలు, విద్యార్థులలో ఐదవ వంతు మంది ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు, వారిలో కొందరు ఫౌండేషన్‌కు సేవ చేయడానికి తిరిగి వస్తారు.[7][8]

మూలాలు

[మార్చు]
  1. Bhattacharya, Snigdhendu (10 October 2020). "How one-teacher Ekal schools helped the spread of Hindutva in rural West Bengal". en:The Caravan (in ఇంగ్లీష్). Retrieved 2021-06-21.{{cite web}}: CS1 maint: url-status (link)
  2. "Providing holistic education to children". CNN-IBN. 2 May 2012. Archived from the original on 3 January 2013. Retrieved 2 May 2012.
  3. "Ekal Vidyalayas help increase attendance". The Hindu. Chennai, India. 2 May 2012. Archived from the original on 4 February 2013. Retrieved 2 May 2012.
  4. "Ekal Foundation Reports Higher Donations in 2010". Indo-American News. 22 April 2011. Archived from the original on 7 April 2016. Retrieved 17 March 2012.
  5. "Urban-rural exchange in Ekal conference". The Telegraph. Calcutta, India. 7 April 2008. Retrieved 13 February 2010.
  6. "Hema to campaign for Ekal schools, BJP". en:The Times of India. 17 October 2003. Archived from the original on 10 జూన్ 2015. Retrieved 17 March 2012.
  7. Correspondent, Navada. "अब आयी एकल विद्यालय की अवधारणा" [Here comes the concept of Ekal schools] (in హిందీ). en:Prabhat Khabar. Retrieved 10 September 2011.[permanent dead link]
  8. "Ekal Vidyalaya aims at taking the school to the children". en:The Hindu. Chennai, India. 16 July 2007. Archived from the original on 8 December 2007. Retrieved 2010-02-15.