ఏచర్
This పేజీకి ఏ ఇతర పేజీల నుండి లింకులు లేకపోవడం చేత ఇదొక అనాథ పేజీగా మిగిలిపోయింది. |
ఏచర్ | |
అక్షాంశరేఖాంశాలు: Coordinates: Unknown argument format |
|
---|---|
దేశం | Hungary |
County | Pest |
వైశాల్యము | |
- మొత్తం | 13.1 km² (5.1 sq mi) |
జనాభా (2001) | |
- మొత్తం | 3,252 |
- సాంద్రత | 248.05/km2 (642.4/sq mi) |
కాలాంశం | CET (UTC+1) |
- Summer (DST) | CEST (UTC+2) |
పోస్టల్ కోడ్ | 2233 |
Area code(s) | 29 |
వెబ్‌సైటు: www.ecser.hu |
ఏచర్, హంగేరీ దేశంలో బుడాపెస్ట్ సమీపంలోని పెస్ట్ అనే ప్రాంతం లోని ఒక గ్రామం.
స్థానం
[మార్చు]ఏచర్ (Ecser, సుమారుగా "acher" అని ఉచ్ఛరింపబడుతుంది), స్లొవేకియన్ భాషలో Ečer అనబడుతుంది. ఇక్కడ స్లొవేకియన్ జనులు అల్పసంఖ్యలో ఉన్నారు. ఇది బుడాపెస్ట్‌కు ఆగ్నేయంగా, ఫెరిహెజీ అంతర్జాతీయ విమానాశ్రయం దగ్గరలో ఉంది. మాగ్లోడ్, వెచెస్, గ్యోమ్రో, యుల్లో అనేవి దీని చుట్టుప్రక్కల జనావాసాలు. M0 రహదారి ఈ గ్రామం దగ్గరనుండి వెళుతుంది. ఈ గ్రామం బుడాపెస్ట్-యుజస్జాస్జ్-స్జోల్నోక్ రైల్వేలైను 120a పై ఉంది.
చరిత్ర
[మార్చు]హంగరియన్లు తమ దేశంలో 896 లో ప్రవేశించినప్పటి నుండిఈ గ్రామం వున్ననూ, వ్రాతపూర్వకంగా ఏచర్ చరిత్ర 1315 డిసెంబరు 15 నుండి లభ్యమవుతున్నది. ఓ కథనం ప్రకారం దీనికి ఆపేరు, హంగరియన్ తెగల యువరాజు, పెట్టాడు. ఏచర్ కు అర్థం లోకల్ భాషలో 'ఓక్ వృక్షం'. ఓట్టోమన్ సామ్రాజ్యపు ఆధిపత్య కాలంలో (1526-1686), ముఖ్యంగా ఈ గ్రామానికి దగ్గరలో వున్న బుడా లొంగిపోయినప్పుడు ఈ గ్రామం మృతమైంది. 1699లో తిరిగీ ప్రజలు నివాసాలేర్పరచుకున్నారు. రకోక్జీ స్వాతంత్ర్యోద్యమం (1703-1711) సమయంలో ఏచర్ నుండి 11 మంది సైనికులు పాల్గొన్నారు. 1700 ఆరంభంలో ఈ కౌంటీ యజమాని ఆంటల్ గ్రాస్సాల్కొవిచ్ స్లొవేకియన్లను నివాసాలిచ్చాడు.
విశేషాలు
[మార్చు]ఈ గ్రామంలో మిగిలిన ప్రాచీన కట్టడం రోమన్ కేథలిక్ చర్చి, దీని నిర్మాణం 1740లో జరిగింది.
ఈగ్రామపు జానపద నృత్యం వెడ్డింగ్ అట్ ఏచర్, ఏచర్ లో పెండ్లి (ఏచెరీ లకోడాల్మాస్).
దీని ఆర్మ్-కోట్ పై, చర్చి, జానపద-నృత్యం, ఓక్ వృక్షం, మూడు ముఖ్యమైన గ్రామ చిహ్నాలు గలవు.
ఏచర్ జంట నగరాలు
[మార్చు]ఏచెర్ జంట నగరాలు :
- జ్లాటే క్లేసీ (స్లొవేకియా)
- కుంబాగ్ (టర్కీ)