ఏడిస్
Aedes | |
---|---|
Aedes aegypti | |
Scientific classification | |
Kingdom: | Animalia
|
Phylum: | |
Class: | |
Order: | |
Family: | |
Subfamily: | |
Genus: | Aedes Meigen, 1818
|
Species | |
See List of Aedes species |
ఏడిస్ ఈజిైప్టె అనే జాతి దోమకాటు వల్ల మానవ శరీరంలోకి ప్రవేశించే వైరస్ వల్ల వచ్చేది డెంగ్యూ జ్వరం. ఇది వర్షాకాలంలో అధికంగా కనిపిస్తుంది. ఏడిస్ ఈజిైప్టె దోమకాటు వల్ల ఒకరి నుంచి మరొకరికి డెంగ్యూ వైరస్ వ్యాప్తి చెందుతుంది. ఏడిస్ దోమ మన ఇంటి పరిసరాల్లోనే నివసిస్తుంది. పూలకుండీలు, ఎయిర్‌కూలర్లు, పాతటైర్లు, పాత ఖాళీడబ్బాల వంటి వాటిలో చేరే నీరు ఈ దోమకు అనుకూలం. మన పరిసరాలు అపరిశుభ్రంగా పెట్టుకుని దానికి అనుకూలమైన పరిస్థితులు మనమే కల్పిస్తాం. ఈ జాతి దోమ రాత్రిపూట కాకుండా సూర్యోదయ, సూర్యాస్తమయాల్లోనే తిరుగుతుంది. కాబట్టి ఆ సమయాల్లో దోమకాటు నుంచి రక్షించుకోవాలి.
లక్షణాలు
[మార్చు]101 నుంచి 105 డిగ్రీల ఫారన్‌హీట్ జ్వరం హఠాత్తుగా వస్తుంది. తీవ్రమైన తలనొప్పి, నడుము కింది భాగంలో తీవ్రమైన నొప్పి, కళ్లు మండటం వంటి లక్షణాలు వస్తాయి. తీవ్రమైన ఒళ్లునొప్పులు, కడుపులో తిప్పడం, వాంతులు, కుడి ఉదరభాగం పై వైపున నొప్పి వస్తుంది. ఉష్ణోగ్రత పెరిగినపుడు
తీవ్రంగా నీరసం, తలతిరగడం, ముక్కు నుంచి రక్తస్రావం, మలవిసర్జన నల్లగా ఉంటుంది. దోమ కుడితే ఏర్పడే ఎర్రని చుక్కల వంటివి ఏర్పడతాయి. డెంగ్యూతో పాటుగా రక్తస్రావం (డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్) లేదా రక్తపోటు అతి తక్కువకు పడిపోవడం, డెంగ్యూ షాక్ సిండ్రోమ్‌లు కనిపిస్తే ప్రాణాంతకమే. ఇలాంటివారు 5 శాతానికి అటు ఇటుగా ఉంటారు. 95 శాతం మందికి ప్రాణాంతకం కాదు.
నిర్ధారణ ఎలా?
[మార్చు]రక్తపరీక్షలో తక్కువ సంఖ్యలో తెల్లరక్తకణాలు, ప్లేట్‌లెట్లు, బ్లడ్‌స్మియర్ మీద ఎటిపికల్ సెల్స్ ద్వారా నిర్ధారణ చేయవచ్చు. ఎన్.ఎస్, యాంటిజెన్-యాంటీ డెంగ్యూ యాంటీబాడీలతో రోగనిర్ధారణ చేయవచ్చు. అయితే వ్యాధి ప్రారంభ దశలో ఇవి కనిపించకపోవచ్చు.
చికిత్స
[మార్చు]డెంగ్యూ చికిత్సకు ప్రత్యేకంగా మందులు లేవు కాబట్టి చికిత్సా విధానం పరోక్ష పద్ధతిలో ఉంటుంది. రోగులకు నోటి ద్వారా లేదా రక్తనాళాల ద్వారా ద్రవాలను పంపిస్తారు. అప్పుడప్పుడు ప్లేట్‌లెట్లను ఎక్కిస్తారు. చాలా కేసుల్లో ప్లేట్‌లెట్లు 10 వేల స్థాయికి పడిపోయినా (1.5-4.5 లక్షలు సాధారణం) లేక తీవ్రమైన రక్తస్రావం ఉన్నా ఇచ్చే సింగిల్ డోనార్ ప్లేట్‌లెట్స్ లేదా యాంటీ ఆర్‌హెచ్‌డీ ఇంజెక్షన్లు మాత్రం ఖరీదైనవి. 95 శాతం మందికి రక్తపోటు, ప్లేట్‌లెట్లు, హిమోగ్లోబిన్‌లను గమనిస్తూ ఉండడం, ఇంట్రావీసన్ ఫ్లూయిడ్స్ ఇవ్వడం చేస్తారు. కాబట్టి వీటికి ఖర్చు తక్కువే. స్టిరాయిడ్ ఇంజెక్షన్ల వల్ల ఎటువంటి లాభం ఉందని నిరూపణ కాలేదు. పైగా అవి ప్రమాదకరం. అవసరం లేకున్నా ప్లేట్‌లెట్స్ ఎక్కించడం, పి.ఆర్.పి.లు కూడా రోగికి నష్టం కలిగిస్తాయి.
ఆసుపత్రిలో ఎప్పుడు చేర్చాలి?
[మార్చు]రక్తపోటు బాగా పడిపోయినా, తీవ్రంగా వాంతులు చేసుకుంటూ నోటి ద్వారా ద్రవాలు తీసుకోవడం కష్టంగా ఉన్నా, ప్లేట్‌లెట్ల సంఖ్య 50 వేల కన్నా తక్కువ స్థాయికి పడిపోయినా ఆసుపత్రిలో చేర్చాల్సి వస్తుంది. జ్వరం తగ్గిన తరువాత 48 నుంచి 72 గంటలు రోగిని పరిశీలనలో ఉంచి, రక్తంలో ప్లేట్‌లెట్స్ సంఖ్య క్రమంగా 50 వేలకు పెరిగేవరకు ఆసుపత్రిలోనే ఉండాలి. ప్లేట్‌లెట్ కౌంట్ 30 వేల కన్నా తగ్గినా, తీవ్రమైన రక్తస్రావం అవుతున్నా, ఏదైనా శరీర భాగం సరిగా పనిచేయకపోతున్నా రోగిని ఐసియులో చేర్చాల్సి వస్తుంది.
నివారణ ఎలా?
[మార్చు]పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుని దోమలు చేరకుండా చూసుకోవడం ద్వారా నివారించవచ్చు. దీనికి టీకామందు లేదు. జ్వర లక్షణాలు కనిపిస్తే వీలైనంత త్వరగా వైద్యపరీక్ష చేయించుకోవాలి. ద్రవపదార్థాలు అధికంగా తీసుకోవాలి. పళ్లరసాలు లేదా కొబ్బరినీళ్లలో గ్లూకోజ్ కలుపుకొని తాగాలి. పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలి. రాత్రిపూట బాగా నిద్ర పోవాలి. దోమతెరలు, దోమలను పారదోలే రసాయనాలను వాడాలి. నిలవనీరు లేకుండా చూసుకోవాలి.
మూలాలు
[మార్చు]- ↑ Le Goff, G.; Brengues, C.; Robert, V. (2013). "Stegomyia mosquitoes in Mayotte, taxonomic study and description of Stegomyia pia n. sp". Parasite. 20: 31. doi:10.1051/parasite/2013030. PMC 3770211. PMID 24025625.