నీరసం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నీరసం
ICD-10R53
ICD-9780.7
DiseasesDB30079
MedlinePlus003088
MeSHD005221

దైనందిక జీవితంలో చురుకుదనం తగ్గిపోవడాన్ని నీరసం అంటాము.

కారణాలు[మార్చు]

వైద్య కారణాలు[మార్చు]

జీవనశైలికి సంబంధించిన కారణాలు[మార్చు]

  • సరైన నిద్ర లేకపోవడం లేదా ఎక్కువగా నిద్రపోవడం లేదా నిద్రలో అవరోధాలు.
  • వ్యాయామం లేకపోవడం
  • వ్యక్తిగత కారణాలు
  • మద్యపానం, మత్తు పదార్ధాలు సేవించడం.

మానసిక కారణాలు[మార్చు]

  • డిప్రెషన్ తో ఎక్కువకాలం విషాద భావన లేదా నిస్సహాయత అనుభవించడం.
  • ఒత్తిడి ఎక్కువగా ఉండి కూడా బాగా నీరసం వస్తుంది.
  • బాగా సన్నిహితులను కోల్పోవడం, ఒంటరితనం.

పిల్లలలో చురుకుదనం తగ్గుదల[మార్చు]

పిల్లలు డల్ గా ఉంటూ, తమ చుట్టూ ప్రక్కల్ జరిగే విషయాల మీద ఆసక్తి ప్రదర్శించకుండా ఉంటుంటే… అది తప్పకుండా పట్టించుకోవలసిన విషయమే. ఇలా పిల్లలు అనాసక్తికరంగా ప్రవర్తించడాన్ని. ఎటెన్షన్ డిఫిసిట్ హైపర్ ఆక్టివిటీ డిజార్డర్ (ఎ.డి. హెచ్ . డి.) ( Attention Deficit Hyper Activity Disorder) అంటారు.

ఎ.డి. హెచ్ . డి. అంటే…[మార్చు]

పిల్లల్లో మొదట్లో చాలా చురుగ్గా అంటే ఆక్టివ్ గా ఉంటారు. కాలక్రమేణా చప్పబడిపోతారు. ఇలా ఒక్కసారిగా వారి ప్రవర్తనలో విపరీతమయిన మార్పు సంభావిస్తుందన్న మాట. మెదడు ఎదుగుదల సక్రమంగా లేనప్పుడే ఈ పరిస్థితి సంభవిస్తుందని శాస్త్రవేత్తలు స్పష్టీకరిస్తున్నారు. మెదడు మొదటి అయిదేళ్ళలో అత్యధిక ఎదుగుదల రికార్డు చేస్తుంది. శరీరంలోని హార్మోన్లు, తినే ఆహారంలోని విటమిన్లు ఈ విషయంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. జన్యు సంబంధం అంటే తల్లిదండ్రులతో ఎవరికైనా మెదడు సరిగా లేకపోతే పిల్లలకు ఈ పరిస్థితి రావచ్చు. మేనరిక వివాహలలో జన్మించిన పిల్లలు సాధారణంగా ఇవి తక్కువగా ఉండటానికి కారణం ఈ రకమైన జన్యు సంబంధమైన లోపాలే…

పసికట్టడమెలా..[మార్చు]

క్లాస్ రూమ్ లో తోటి పిల్లలతో వీరి ప్రవర్తన ఎలా వుందో తెలుసుకుంటూ వుండాలి. పిల్లల స్నేహితులేవరు.. వాళ్ళు మన పిల్లలతో ఎలా ఉంటున్నారు? ఈ విషయాలు తెలిస్తే పిల్లాడి ప్రవర్తన అంచనా వేయవచ్చు.

జాగ్రత్తలు[మార్చు]

ఆరోగ్యకరమైన ప్రశాంత వాతావరణాన్ని పిల్లలచుట్టూ ఏర్పరచాలి. క్రియేటివిటీకి స్థానం ఉండేటట్లు చేయాలి. సంగీతం నేర్పడం… పెయింటింగ్ వేయడం… డ్యాన్స్ అంటే నృత్యం… మ్యూజిక్ అనుగుణంగా చిందులు వేయడం నేర్పితే వాళ్ళల్లో ఆహ్లాదకర భావాలు మొదలవుతాయి. కొంత వారి మానసిక పరిస్థితిని అదుపు చేయడానికి, ఎదుగుదలకు తోడ్పడుతుంది.

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=నీరసం&oldid=3878946" నుండి వెలికితీశారు