ఏనుగుదంత
ఏనుగుదంత | |
---|---|
Scientific classification | |
Kingdom: | |
(unranked): | |
(unranked): | |
(unranked): | |
Order: | |
Family: | |
Genus: | |
Species: | C. decidua
|
Binomial name | |
Capparis decidua | |
Synonyms | |
Capparis aphylla |
ఏనుగుదంత ఒక చెట్టు పేరు. దీని శాస్త్రీయ నామం కెప్పారిస్ డెసిడ్వా (Capparis decidua). ఇది చాలా కొమ్మలు ఉండే చిన్న చెట్టు. ఇది దాదాపు 5 మీటర్ల ఎత్తు పెరుగుతుంది. ఈ చెట్టును భారతీయ భాషలలో సాధారణంగా కెర్డా, కైర్, కరీర్, కిరిర్, కరీల్ మొదలైన పేర్లతో పిలుస్తారు ఉదాహరణకు (హిందీలో: करीर లేదా कैर సింధీలో: ڪِرڙ).
వృక్షపు లక్షణాలు
[మార్చు]ఏనుగుదంత చెట్టు ఆఫ్రికా, మధ్యప్రాచ్యం, దక్షిణాసియాలోని పొడి ప్రాంతాలలో కనిపించే గుబురైన చిన్న పొదలాగా ఉండే చెట్టు. ఇది థార్ ఎడారి ప్రాంతాల్లో కూడా కనిపిస్తుంది. చెట్టు కురుచని, ఆకులు లేని పొడవాటి కొమ్మలతో ఉంటుంది. లేత కొమ్మలపై కొన్ని చిన్న ఆకులు కనిపిస్తాయి. ఈ చెట్టు ఐదు మీటర్ల (15 అడుగులు) కంటే ఎత్తుకు పెరగటం చాలా అరుదు.[1]
కొత్త ఆకులు నవంబరు నుండి జనవరి మధ్యకాలంలో చిగురిస్తాయి. మార్చి - ఏప్రిల్ నెలల్లో, మరలా ఆగస్టు-సెప్టెంబరు నెలల్లో ప్రస్ఫుటంగా కనిపించే ఎర్రని పూలు పూస్తాయి. ఈ పూలు ఫలదీకరణం చెంది మే, అక్టోబరు నెలల్లో పండ్లు కాస్తాయి. ఈ చెట్టుకు కాసే గులాబీ రంగు బెర్రీ ఫలాలను పక్షులు బాగా తింటాయి. ఈ చెట్టు మొదలును నరికినా తిరిగి వేళ్లనుండి ఊడలతో కొత్త కొమ్మను అవలీలగా ఏర్పరచుకోగలదు. ఏనుగుదంత చెట్టు అత్యంత దుర్భరమైన కరువు పరిస్థితులను కూడా తట్టుకోగలదు. కొంతవరకు చలిని భరించగలదు.[1]
ఉపయోగాలు
[మార్చు]తీవ్రమైన ఎడారి ప్రాంతాలలో మనగలిగే ఈ చెట్టుకు ఆయా ప్రాంతాల్లో చాలా విలువైనది. తీక్షణమైన రుచిగల పండ్లను కూరలలోనూ, ఊరగాయలలోనూ ఉపయోగిస్తారు. పండ్లు కీటకనాశకమైన పక్షులను ఆకట్టుకోవటానికి సహాయపడతాయి. ఈ చెట్టును సాంప్రదాయక వైద్యంలోనూ, మూలికా వైద్యంలోనూ ఉపయోగిస్తారు. అంతేకాక ఎడారి, పొడి ప్రాంతాలలో ఈ చెట్టును, లాండ్‌స్కేప్ గార్డెనింగుకు, వనపునరుద్ధరణకు ఉపయోగిస్తారు. ఇది భూమికోతను అరికడుతుంది[2]
మహాభారతంలో ఏనుగుదంత
[మార్చు]మహాభారతంలోని కర్ణపర్వం, 30వ అధ్యాయం, 24వ శ్లోకంలో శమీ, పీలువృక్షాలతో పాటు ఏనుగుదంత యొక్క ప్రస్తావన ఉంది. ఈ ప్రస్తావన దిగువ సంస్కృతంలో చూడవచ్చు:
- शमी पीलु करीराणां वनेषु सुखवर्त्मसु (శమీ పీలు కరీరాణామ్ వనేశు సుఖవర్తమసు)
- अपूपान सक्तु पिण्डीश च खाथन्तॊ मदितान्विताः (అపూపాన్ సక్తు పిండీశ చ ఖాథన్తో మదితాన్వితాః)
చిత్రమాలిక
[మార్చు]-
ఏనుగుదంత చెట్టు
-
ఏనుగుదంత చెట్టు
-
ఏనుగుదంతపు పచ్చి పండ్లు
-
ఏనుగుదంతపు మాగిన పండ్లు
-
ఏనుగుదంతపు మాగిన పండు