ఐమీ బారువా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఐమీ బారువా
జననం
జాతీయతభారతీయురాలు
వృత్తినటి
దర్శకురాలు
జీవిత భాగస్వామిపిజూష్ హజారికా (2011 అక్టోబరు 1)

ఐమీ బారువా, అస్సామీ సినిమా నటి, దర్శకురాలు. టొరంటో ఇంటర్నేషనల్ ఉమెన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో సెమ్‌ఖోర్‌లో తన పాత్రకు ఉత్తమ నటి అవార్డును కూడా అందుకుంది.[1]

ఐమీ తొలిసారిగా సెమ్‌ఖోర్ అనే దిమాసా భాషాలో సినిమాకు దర్శకత్వం వహించింది. 2021 నవంబరు 20 నుండి[2] 28 వరకు జరిగిన 12వ భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో 'ఇండియన్ పనోరమా' విభాగంలో ప్రారంభ చిత్రంగా ప్రదర్శించబడింది. ఈ సినిమా వివిధ అవార్డుల కోసం 'గోల్డెన్ పీకాక్' విభాగంలో కూడా పోటీపడింది.[3]

తొలి జీవితం[మార్చు]

ఐమీ బారువా, పూర్ణా బారువా- మాలా బారువా దంపతులకు అస్సాం రాష్ట్రం, నాగాన్‌లో జన్మించింది. తండ్రి పోలీస్ సూపరింటెండెంట్. ఐమీ అంటే ఫ్రెంచ్‌ భాషలో ప్రేమించినది అని అర్థం. ఐమీ ఎకనామిక్స్‌లో బ్యాచిలర్స్, సోషల్ వర్క్‌లో మాస్టర్స్ ఆఫ్ ఆర్ట్స్ పూర్తిచేసింది.[4]

వృత్తిరంగం[మార్చు]

6వ తరగతి చదువుతున్నప్పుడు ఆక్సోమోర్ సాధు కోతా సినిమాలో తేజిమోలా పాత్రతో అరంగేట్రం చేసిన ఐమీ బారువా, తన 9వ తరగతిలో ప్రేమ్ అరు ప్రేమ్ సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది.

వ్యక్తిగత జీవితం[మార్చు]

ఐమీ బారువా 2011 అక్టోబరు 1న రాజకీయ నాయకుడు పిజూష్ హజారికాను వివాహం చేసుకుంది.[5][6] వారికి ఇద్దరు పిల్లలు.

సినిమాలు[మార్చు]

 • ప్రేమ్ అరు ప్రేమ్ (2002)
 • మోనే బిసారే తుమక్ (2002)
 • ప్రేమ్ భార చాకలు (2003)
 • సోరు బువారి (2004)
 • కడతోలే కృష్ణ నాచే (2005)
 • అఘోరి ఆత్మ (2005)
 • ప్యార్ కర్ ఖతీర్ (జార్ఖండి) (2005)
 • ప్రేమ్ పహారే భోయామే (2008)
 • జెతుకా పాటర్ డోర్ (2011)
 • డోని పోల్ (తప్పిపోయిన) (2011)
 • బాకోర్ పుటెక్ (2012)
 • కర్మ కే రాతి (2013)
 • మహాసమర్ (2013)
 • మోనే ముర్ కోయినా బిచారే (2016)
 • బిర్ చిలరాయ్ (2016)
 • పానీ (2018)
 • నిజనోర్ గాన్ (2019)
 • ప్రతిఘాట్ (2019)
 • సెమ్‌ఖోర్ (2021)

అవార్డులు[మార్చు]

 • ఉత్తమ నటి - టొరంటో ఇంటర్నేషనల్ ఉమెన్ ఫిల్మ్ ఫెస్టివల్‌[7]

మూలాలు[మార్చు]

 1. "Aimee Baruah Bags Best Actress Award at TIWFF for 'Semkhor'". Pratidin Time. 19 August 2021. Retrieved 2022-02-09.
 2. "First Dimasa language movie to open Indian Panorama at IFFI". Express News Service (in ఇంగ్లీష్). The New Indian Express. 6 November 2021. Retrieved 2022-02-09.
 3. Shemin Joy (11 November 2021). "Three Indian films in IFFI's international competition section". Deccan Herald. Retrieved 2022-02-09 – via Press release.
 4. channel, Ramdhenu (23 November 2018). ON Camera: UD interview with Aimee Boruah.
 5. "Who's Who". assamassembly.gov.in. Retrieved 2022-02-09.
 6. "Assam Panchayat Polls, Actor Aimee Baruah develops back pain!". time8.in. Archived from the original on 2019-08-02. Retrieved 2022-02-09.
 7. "Actress Aimee Baruah Conferred' Best Actress' award in Toronto International Women Film Festival". 19 August 2021.

బయటి లింకులు[మార్చు]