ఒంటిమామిడి లొద్ది జలపాతం
ఒంటిమామిడి లొద్ది జలపాతం | |
---|---|
ప్రదేశం | మంగవాయిగూడెం, వెంకటాపురం మండలం, ములుగు జిల్లా, తెలంగాణ |
రకం | జలపాతం |
మొత్తం ఎత్తు | 350 నుంచి 400 అడుగుల |
ఒంటిమామిడి లొద్ది జలపాతం, తెలంగాణ రాష్ట్రం, ములుగు జిల్లా, వెంకటాపురం మండలంలోని కోయస్ అనే చిన్న గ్రామమైన మంగవాయిగూడెం సమీపంలో ఉన్న జలపాతం. ఈ జలపాతంలో దాదాపు 350 నుంచి 400 అడుగుల ఎత్తునుండి నీరు పడతున్నాయి.[1]
జలపాతం వివరాలు
[మార్చు]దట్టమైన అడవిలో, పచ్చటి ప్రకృతి అందాలతో, ప్రశాంతమైన వాతావరణంలో ఈ జలపాతం ఉంది. పాత్రపురం గ్రామంనుండి కాలినడకన ఏడు కిలోమీటర్ల దూరం వెళ్ళాలి. ఈ జలపాతాన్ని సందర్శించాలంటే అడవిలోని మార్గాల గురించి తెలిసిన స్థానిక గిరిజనుల సహాయం తీసుకోవలసివుంటుంది. ఇక్కడికి వెళ్ళేదారిలో మోకాళ్ల లోతు బురదలో, జారే బండరాళ్ళు ఉంటాయి.
ఈ జలపాతం వెంకటాపురం నుండి 12 కి.మీ., ఏటూరునాగారం నుండి 42 కి.మీ., వరంగల్ నుండి 156 కి.మీ.ల దూరంలో ఉంది.
ఇతర వివరాలు
[మార్చు]ఇక్కడికి 35 కిలోమీటర్ల దూరంలో బొగత జలపాతం ఉంది. ఈ జలపాతం సమీపంలో మరో మూడు జలపాతాలు (కొంగల జలపాతం, గద్దలసరి జలపాతం) కూడా ఉన్నాయి.
మూలాలు
[మార్చు]- ↑ Telangana Today, Telangana (21 August 2021). "One more stunning waterfall comes to light in Mulugu district". Archived from the original on 21 August 2021. Retrieved 28 October 2021.