కొంగల జలపాతం
కొంగల జలపాతం | |
---|---|
ప్రదేశం | కొంగల, వాజేడు మండలం, ములుగు జిల్లా, తెలంగాణ |
రకం | జలపాతం |
మొత్తం ఎత్తు | 70 అడుగులు |
కొంగల జలపాతం, తెలంగాణ రాష్ట్రం, ములుగు జిల్లా, వాజేడు మండలంలోని కొంగల గ్రామంలో ఉన్న జలపాతం.[1] హైదరాబాదు నగరానికి 275 కిలోమీటర్ల దూరంలో, వరంగల్ పట్టణం నుండి 2 గంటల దూరంలో ఈ జలపాతానికి వెళ్ళడానికి దట్టమైన అడవి గుండా కాలినడకన (రోడ్డు నుంచి 1.5 కి.మీ.), పొలాలు, రెండు వాగులు, గుట్టలు దాటుకుంటా వెళ్ళాలి. అప్పటికాలంలో ఈ జలపాతంలో పులులు వచ్చి నీరు తాగేవి. అందుచేత దీనిని పులిమడుగు జలపాతం అని కూడా అంటారు.
జలపాతం వివరాలు
[మార్చు]ఇక్కడి ప్రజలు ఈ జలపాతాన్ని 'వి-ఫాల్' అని పిలుస్తారు. 70 అడుగుల ఎత్తు ఉన్న జలపాతం నుండి కిందపడిన నీరు లొద్దిమడుగువాగు గ్రామంలోని కొంగల చెరువులో కలుస్తుంది. అక్కడికి చేరుకోవడానికి స్థానికుల సహాయం తీసుకోలసివుటుంది. ఎల్లప్పుడూ నీరు పడుతున్న ఈ జలపాతంలో వర్షాకాలంలో ఎక్కవ నీరు ప్రవహిస్తుంటుంది. ఈ జలపాతం సమీపంలో బోగత జలపాతం (10 నిమిషాల ప్రయాణం), గద్దలసరి జలపాతం, ఒంటిమామిడి లొద్ది జలపాతం ఉన్నాయి.
పర్యాటక ప్రాంతం
[మార్చు]రహదారికి ఇరువైపుల పచ్చని అడవితో ప్రకృతి రమణీయతతో కూడిన ఈ కొంగల జలపాతం ఒక చక్కని పర్యాటక ప్రాంతంగా ఉంది. సెలవు రోజులలో పర్యాటకులు వచ్చి ఇక్కడి అందాలను వీక్షిస్తారు, జలపాతం కింది ప్రాంతంలోని కొలనులో ఈతలు కొడుతారు.[2] జలపాతం ఎత్తు నుండి నీటిలోకి డైవ్ చేయవచ్చు. జలపాతం ఎడమ వైపు నుండి జలపాతానికి ఎక్కే దారి ఉంది, కుడి వైపున ఒక కొలనులా ఉంటుంది.
మూలాలు
[మార్చు]- ↑ telugu, 10tv (2021-09-10). "Waterfalls : తెలంగాణలో జలపాతాల అందాలు | The beauty of waterfalls in Telangana". 10TV (in telugu). Archived from the original on 2022-02-19. Retrieved 2022-02-19.
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link) - ↑ telugu, NT News. "హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ఈ ప్రదేశాలను మీరెప్పుడైనా చూశారా..?". www.ntnews.com. Archived from the original on 2022-02-01. Retrieved 2022-02-19.