Jump to content

ఒక్రామ్ ఇబోబి సింగ్

వికీపీడియా నుండి
(ఒక్రామ్‌ ఇబోబి సింగ్‌ నుండి దారిమార్పు చెందింది)
ఒక్రామ్ ఇబోబి సింగ్
2022 లో ఒక్రామ్ ఇబోబి సింగ్
మణిపూర్ శాసనసభ ప్రతిపక్ష నాయకుడు
In office
2017 మార్చి 15 – 2022 మార్చి 30
అంతకు ముందు వారుప్రారంభకుడు
తరువాత వారుఖాళీ
11వ మణిపూర్ ముఖ్యమంత్రి
In office
2002 మార్చి 7 – 2017 మార్చి 15
అంతకు ముందు వారురాధాబినోద్ కోయిజం
తరువాత వారు నొంగ్తోంబమ్ బీరెన్ సింగ్
మణిపూర్ శాసనసభ సభ్యుడు
Assumed office
2007
నియోజకవర్గంతౌబల్
In office
2002–2007
నియోజకవర్గంఖంగాబోక్
In office
1984–1995
నియోజకవర్గంఖంగాబోక్
వ్యక్తిగత వివరాలు
జననం (1948-06-19) 1948 జూన్ 19 (వయసు 76)
అథోక్పం, మణిపూర్, భారతదేశం
రాజకీయ పార్టీభారత జాతీయ కాంగ్రెస్
జీవిత భాగస్వామిలంధోని దేవి
బంధువులుఓక్రమ్ హెన్రీ సింగ్ (మేనల్లుడు), సూరజ్‌కుమార్ ఓక్రం (కొడుకు)
వృత్తిరాజకీయ నాయకుడు

ఒక్రామ్‌ ఇబోబి సింగ్‌ మణిపూర్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. అతను మూడుసార్లు మణిపూర్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పని చేశాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

ఒక్రామ్‌ ఇబోబి సింగ్‌ 1981లో కోఆపరేటివ్‌ సొసైటీకి కార్యదర్శిగా తన రాజకీయ జీవితం ప్రారంభించి, 1984లో మణిపూర్‌ అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా ఖంగాబాక్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికై, ఆ తర్వాత 1985లో కాంగ్రెస్ పార్టీలో చేరాడు. అతను 1990లో జరిగిన ఎన్నికల్లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచి గృహనిర్మాణం, పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా పని చేశాడు.

ఒక్రామ్ ఇబోబి సింగ్ 1995, 2000లో జరిగిన ఎన్నికల్లో ఖంగాబాక్‌ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయాడు. అతను 1999లో మణిపూర్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు. ఇబోబి సింగ్ 2002లో జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి తొలిసారి ముఖ్యమంత్రిగా భాద్యతలు చేపట్టాడు. 2002 నుండి 2017 వరకు వరసగా మూడుసార్లు రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని చేపట్టి హ్యాట్రిక్‌ సీఎంగా రికార్డులకెక్కాడు.

2020లో మణిపూర్ ప్రోగ్రెసివ్ సెక్యులర్ అలయన్స్ చైర్మన్ గా ఉన్నాడు.

మూలాలు

[మార్చు]
  1. Sakshi (27 January 2022). "ఈశాన్యంలో పెద్దన్న.. ఆ పార్టీకి బలమూ ఆయనే.. బలహీనత ఆయనే". Archived from the original on 2 February 2022. Retrieved 2 February 2022.