తౌబాల్ జిల్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తౌబాల్ జిల్లా
జిల్లా
తౌబాల్ జిల్లా
తౌబాల్ జిల్లా
దేశం భారతదేశం
రాష్ట్రంమణిపూర్
ముఖ్య పట్టణంతౌబాల్
Area
 • Total514 km2 (198 sq mi)
Population
 (2011)
 • Total4,20,517
 • Density820/km2 (2,100/sq mi)
భాషలు
 • అధికారికమీటిలాన్ (మణిపురి)
Time zoneUTC+5:30 (భారత కాలమానం)

తౌబాల్ జిల్లా, మణిపూర్ రాష్ట్ర జిల్లా. తౌబాల్ పట్టణం జిల్లా కేంద్రంగా ఉంది. ఇది 1891 ఏప్రిల్‌లో మణిపూర్ చివరి సారిగా బ్రిటిష్ సైన్యాలను ఎదిరించి స్వాతాంత్ర పోరాటంలో పాల్గొన్న ప్రదేశం.

సరిహద్దులు[మార్చు]

సరిహద్దు వివరణ జిల్లా
ఉత్తర సరిహద్దు సేనాపతి జిల్లా
తూర్పు సరిహద్దు ఉక్రుల్ - చండేల్
దక్షిణ సరిహద్దు చౌరచంద్పూర్, బిష్ణుపూర్
పశ్చిమ సరిహద్దు ఇంపాలా ఈస్ట్, ఇంపాలా వెస్ట్
జిల్లా వైశాల్యం 519 చ.కి.మీ
జనసంఖ్య 422,168 [1]

చరిత్ర[మార్చు]

1983లో తౌబాల్ జిల్లా రూపొందించబడింది. ముందు మణిపూర్ మద్య జిల్లా (ఇంపాలా జిల్లా) లో తౌబాల్ సబ్‌డివిషన్‌ తరువాత 1983 నవంబరులో జిల్లాగా మార్చబడింది. తరువాత జిల్లా తౌబాల్, కాక్చింగ్ ఉపవిభాగంగా విభజించబడింది. ఇందులో కాక్చంగ్, వైకాంగ్ తాలూకాలు భాగంగా ఉన్నాయి. ప్రస్తుతం జిల్లాలో 3 ఉపవిభాగాలు (తౌబాల్, లిలాంగ్, కాక్చంగ్ ) ఉన్నాయి.

భౌగోళికం[మార్చు]

జిల్లా మణిపూర్ లోయలలో అధికప్రాంతాన్ని ఆక్రమించి ఉంది. జిల్లా ఆకారం క్రమరహిత త్రిభుజాకారంగా ఉంటుంది. ఇది 23° - 45' నుండి 24°- 45' డిగ్రీల ఉత్తర అక్షాంశం, 93° -45' నుండి 94°-15 డిగ్రీల తూర్పు రేఖాంశంలో ఉంది. జిల్లా సముద్రమట్టానికి సరాసరి 790 మీ ఎత్తులో ఉంటుంది. జిల్లలో అక్కడక్కడా కొండలు, గుట్టలు ఉన్నాయి. వీటిలో పునం కొండ సముద్రమట్టానికి 1009 మీ ఎత్తు ఉంటుంది.

రిజర్వాయర్లు, సరోవరాలు[మార్చు]

జిల్లాలో ప్రధానంగా ఇంపాలా, తౌబాల్ నదులు ప్రవహిస్తున్నాయి.

తౌబాల్ నది[మార్చు]

తౌబాల్ నది ఉత్కల్ పర్వతశ్రేణిలో జన్మించింది. ఇది ఇంపాలా నదిలో సంగమిస్తుంది. ఇది యయిరిపొక్, తౌబాల్ మీదుగా ప్రవహించి మయాంగ్ ఇంపాలా సమీపంలో ఉన్న ఐరంగ్ వద్ద ఇంపాలానదిలో సంగమిస్తుంది.

ఇంపాలా నది[మార్చు]

ఇంపాలా నది సేనాపతి జిల్లాలోని పర్వతశ్రేణిలో ప్రవహించి దక్షిణదిశగా ప్రవహిస్తుంది. ఇది తౌబాల్ జిల్లా ఉత్తర, పశ్చిమ సరిహద్దులను ఏర్పరుస్తుంది.

ఇతర నదులు[మార్చు]

జిల్లాలో వాంగ్జింగ్, అరాంగ్, సెక్మై నదులు ప్రవహిస్తున్నాయి. ఇవి ఉత్కల్ పర్వతశ్రేణిలో జన్మిస్తున్నాయి. ఇవి ఖరంగ్ పాత్‌లో సంగమిస్తున్నాయి.

view of small hillock in Thoubal

సరోవరాలు[మార్చు]

జిల్లా నైరుతీ ప్రాంతంలో లోక్తక్ లేక్ ప్రాంతం ఉంది. ఇక్కడ వర్షాధార సరసులు, పలు నీటి మడుగులు ఉన్నాయి. వీటిలో ఖరంగ్, ఐకాప్, పుమ్లెన్, లౌసి, న్గంగౌ ప్రధానమైనవి. జిల్లా ఉత్తర ప్రాంతంలో ఉన్న వైతౌ సరసు వరిపొలాలు, వైతౌ కొండలు, గ్రామాల నుండి వస్తున్న నీటితో ఏర్పడిన మురికినీటి వలన ఏర్పడింది.

Pumlen lake

వాతావరణం[మార్చు]

విషయ వివరణ వాతావరణ వివరణ
శీతాకాలం గరిష్ఠ ఉష్ణోగ్రత ° సెల్షియస్
శీతాకాలం కనిష్ఠ ఉష్ణోగ్రత ° సెల్షియస్
అత్యంత శీతల మాసం
వాతావరణ విధానం
వేసవి కాలం గరిష్ఠ ఉష్ణోగ్రత ° సెల్షియస్
వేసవి కాలం కనిష్ఠ ఉష్ణోగ్రత ° సెల్షియస్
అత్యంత ఉష్ణ మాసం
వర్షపాతం మి.మీ
అత్యధిక వర్షపాతం
అక్షాంశం ఉత్తరం
రేఖాంశం తూర్పు

వాతావరణం[మార్చు]

విషయ వివరణ వాతావరణ వివరణ
వాతావరణ విధానం ఆహ్లాదకరం
వేసవి ఏప్రిల్ - మే
వర్షాకాలం జూన్- సెప్టెంబరు
శీతాకాలం డిసెంబరు- ఫిబ్రవరి
గరిష్ఠ ఉష్ణోగ్రత 32–35° సెల్షియస్
కనిష్ఠ ఉష్ణోగ్రత 4-6 ° సెల్షియస్
వర్షపాతం 1318.39 మి.మీ (1983-89)

ఆర్ధికం[మార్చు]

Green paddy field in Thoubal district

జిల్లా ప్రజలకు వ్యవసాయం ప్రధాన ఉపాధిగా ఉంది. జిల్లాలో 70% ప్రజలు నేరుగానూ పరోక్షంగాను వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారు. జిల్లాలోని సారవంతమైన భూమి, నీటి పారుదల సౌకర్యాలు, జిల్లా భౌగోళిక స్థితి వ్యవసాయానికి చక్కగా సహకరిస్తున్నాయి. మొత్తం వ్యవసాయ భూమిలో 90% వరిపంట కొరకు వినియోగించబడుతుంది. జిల్లా సారవంతమైన భూమి, ఇంపాలా వంతెన అందిస్తున్న జలం పంటలను పుష్కలంగా అందిస్తుంది.

వరి పంట[మార్చు]

జిల్లాలోని కొన్ని ప్రాంతంలో మూడింతల పంట చేతికి అందుతుంది. ఫిబ్రవరి చివర లేక మార్చి మొదటి వారంలో మొదటి వరిపంట చేతికి వస్తుంది, రెండవ వరిపంట జూలై, ఆగస్టు మాసాలలో చేతికివస్తుంది, మూడవసారి ఆవాలు, పప్పుధాన్యాలు మొదలైనవి నవంబరు మాసలో చేతికి అందుతుంది. జిల్లాలో అదనంగా చెరకు, నూనెగింజలు, ఉర్లగడ్డలు, పప్పుధాన్యాలు, మిరపకాయలు మొదలైనవి పండించబడుతున్నాయి. జిల్లాలో చెరకు అత్యధికంగా పండుతుంది. చెరకు ఉత్పత్తిలో జిల్లా మణిపూర్ రాష్ట్రం ప్రథమస్థానంలో ఉంది. చెరకు పంట ప్రధానంగా వాంగ్జింగ్, కాక్చింగ్ బెల్ట్, కాక్చింగ్ కునౌ, వబగై ప్రాంతాలలో పండించబడుతుంది.

మొక్కజొన్న, ఇతర పంటలు[మార్చు]

మొక్కజొన్న జిల్లా అంతటా పండించబడుతున్నా సెరౌ, పల్లెల్, కాక్చింగ్ బెల్ట్ ప్రాంతాలలో వాణిజ్యపంటగా పండించబడుతుంది. నూనె గింజలు జిల్లా అంతటా పండించబడుతున్నాయి. సమీపకాలంగా పొద్దుతిరుగుడు గింజలు కూడా పండించబడుతున్నాయి. క్యాబేజి, కాలీఫ్లవర్, వివిధరకాల బఠాణీ, పొట్ల, సొర, గుమ్మడి మొదలైన కూరగాయలు పండించబడుతున్నాయి. ప్లాంటేషన్ పంటలలో అనాస పండుంచబడుతుంది. ఇది దిగువభూములు, చిన్న కొండలలో పండించబడుతుంది. వైతౌహిల్ పర్వతశ్రేణి, షరం కొండలో అనాస పండించబడుతుంది.

పశుపోషణ[మార్చు]

తౌబాల్ జిల్లాలో ప్రధాన ఆర్థికవనరులలో పశుపోషణ ఒకటి. జిల్లాలో బర్రెలు, మేకలు, గుర్రాలు, పోనీలు, పందులు, కుక్కలు పెంచబడుతున్నాయి. జిల్లాలో గుర్తించతగినంతగా పాల ఉత్పత్తి అభివృద్ధి చెందింది. నాణ్యమైన పశువులను ఉత్పత్తి చేయడం, పండుల పెంపకం, కోళ్ళ ఫాం ఉపాధికల్పనకు సహకరిస్తున్నాయి. .[2]

మత్స్యపరిశ్రమ[మార్చు]

జిల్లా ఆర్థికరంగానికి మత్స్యపరిశ్రమ తగినంత చేయూత ఇస్తుంది. మత్స్యపరిశ్రమ జిల్లాప్రజలకు ఉపాధికల్పించడంలో ప్రధానపాత్ర వహిస్తుంది. జిల్లాలో తెంథా, లెయిషంగ్థెం, వాబ్గై, ఖంగబొక్, కాక్చింగ్ - ఖునౌ, వాంగూ.

విభాగాలు[మార్చు]

విషయాలు వివరణలు
ఉపవిభాగాలు 3 తౌబాల్, కాంచంగ్, లౌలాంగ్.
మునిసిపాలిటీలు తౌబాల్, కాక్చంగ్.
చిన్న పట్టణాలు వాంగ్జింగ్, సుగ్ను, లైలాంగ్, యయిరిపొక్
అసెంబ్లీ నియోజక వర్గం 10 తౌబాల్, కాక్చంగ్, లైలాంగ్, వాంగ్ఖెం, హెయిరాక్, వాంగ్జింగ్ - తెంథ, ఖంగబొక్, వబగై, హియాంగ్లం, సుగ్ను.
పార్లమెంటు నియోజక వర్గం

2001 లో గణాంకాలు[మార్చు]

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 420,517, [3]
ఇది దాదాపు. మాల్టా దేశ జనసంఖ్యకు సమానం.[4]
అమెరికాలోని. నగర జనసంఖ్యకు సమం.
640 భారతదేశ జిల్లాలలో. 555 వ స్థానంలో ఉంది.[3]
1చ.కి.మీ జనసాంద్రత. 818 [3]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 15.48%.[3]
స్త్రీ పురుష నిష్పత్తి. 1006:1000 [3]
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం. 76.66%.[3]
జాతియ సరాసరి (72%) కంటే.

ప్రయాణసౌకర్యాలు[మార్చు]

జిల్లాలో చక్కని ప్రయాణసౌకర్యాలు ఉన్నాయి. జిల్లాలోని పట్టణాలు, గ్రామాలు అన్ని చక్కగా జిల్లాకేంద్రం, ఇతర ఉప డివిషనల్ ప్రధాన కేంద్రాలతో అనుసంధానించబడి ఉన్నాయి. తౌబాల్ నుండి జిల్లాలోని ఇతర ప్రాంతాలకు టాక్సీ సౌకర్యాలు ఉన్నాయి.

రహదార్లు[మార్చు]

జిల్లా మద్య నుండి ఎ.హెచ్-1 దాటి పోతుంది. జిల్లాలోని ప్రధాన పట్టణాలలో అధికభాగం రహదారి మార్గంతో అనుసంధానుంచబడి ఉన్నాయి. జిల్లాలో మయాయి- లంబి రోడ్డు, ఇండో- బర్మా రోడ్డు, తౌబాల్ - యయిరిపొక్ - సెఖాంగ్ సెక్మై రోడ్డు, సుగ్ను- సెరౌ- కరంగ్ రోడ్డు.

పర్యాటకం[మార్చు]

ఖొంగ్జొం[మార్చు]

ఇది తౌబాల్ నగరానికి దక్షిణంలో 10 కి.మీ దూరంలో ఉంది. జిల్లా కేంద్రం ఇంపాలాకు 32 కి.మీ దూరంలో ఉంది. మణిపూర్ - బ్రిటిష్ ప్రభుత్వం మద్య చివరిసారిగా స్వతంత్ర యుద్ధం జరిగిన ప్రదేశం ఇది. ఖెబా కొండ శిఖరం మీద యుద్ధ స్మారకచిహ్నం నిర్మించబడింది. పయోనా బ్రజభాషి శిల్పం స్థాపించబడింది. ఏప్రిల్ 23న ప్రతిసంవత్సరం ఖొంగ్జొం దినం నిర్వహించబడుతుంది.

సుగ్ను[మార్చు]

సుగ్ను తౌబాల్ నుండి 51 కి.మీ దూరంలో 4 జిల్లాల కూడలిలో ఉంది. ఇది తౌబాల్, బిష్ణుపూర్, చురచంద్పూర్, చందేల్ మద్య ఉంది. ఇది ప్రముఖ వ్యాపారకేంద్రంగా ఉంది. ఇక్కడ నుండి ఇంపాల్ నదీ దృశ్యాలను చూడవచ్చు. సుగ్ను సమీపంలో సెరౌ ఆలయం ఉంది. ఇది రాష్ట్రంలో ప్రముఖయాత్రా ప్రదేశంగా ఉంది.

వైతౌ[మార్చు]

ఇది ప్రకృతి సౌదర్యానికి నిలయం. హిల్- సైడ్ సమీపంలో వైతౌ సరోవరం సమీపంలో ఒక ఇంస్పెక్షన్ బంగ్లా ఉంది. ఇది రుచికరమైన అనాస పండ్లకు ప్రసిద్ధి. ఇక్కడ ప్రాంతీయంగా లభించే రుచికరమైన "న్గాటన్ " అనే చేపలకు ఇక్కడ ప్రసిద్ధి.

Waithou lake

.

కాక్చింగ్[మార్చు]

ఇది కాక్చంగ్ ఉపవిభాగం కేంద్రం. అలాగే ప్రముఖ వైవిధ్యమైన కూరగాయలు, చేపలు, బియ్యం వ్యాపార కేంద్రం. జాతీయరహదారి మార్గంలో ప్రయాణించి ఇక్కడకు సులువుగా చేరుకోవచ్చు. కాక్చంగ్ కొండ మీద " కాక్చంగ్ ఎకో పార్క్ " ఉంది.

Kakching Garden

తౌబాల్[మార్చు]

ఇది తౌబాల్ జిల్లా కేంద్రంగా అలాగే తౌబాల్ ఉపవిభాగానికి కేంద్రంగా ఉంది. ఇది జిల్లాలో అతిపెద్ద నగరం. ఇది ఇంపాల్ నుండి 22 కి.మీ దూరంలో ఉంది. జాతీయరహదారి 39 నగరాన్ని ఉత్తర దక్షిణాలుగా విభజిస్తుంది. నగరం మద్య నుండి తూర్పు, పడమరలుగా తౌబాల్ నది ప్రవహిస్తుంది. ఇది జిల్లాలో ప్రముఖ వ్యాపారకేంద్రంగా ఉంది. అన్ని మౌలిక వసతులతో శిఘ్రగతిలో అభివృద్ధి చెందుతున్న నగరమిది. జిల్లాలోని అధికార కార్యాలయాలు, బ్యాంకులు, ఇంస్టిట్యూషన్లు ఇక్కడ ఉపస్థితమై ఉన్నాయి.

విద్య[మార్చు]

Thoubal College

తౌబాల్, కాక్చంగ్ జిల్లాలో ప్రముఖ విద్యాకేంద్రాలుగా ఉన్నాయి. జిల్లాలోతౌబాల్ కాలేజ్, ఖా- మణిపూర్ కాలేజ్ డిగ్రీకాలేజీలు ఉన్నాయి. వీటితో పలు ఇతర కాలేజీలు ఉన్నాయి. జిల్లా హాస్పిటల్ మద్య ఒక నర్సింగ్ కాలేజ్ నిర్మాణదశలో ఉంది. జిల్లాలో కేంద్రప్రభుత్వానికి చెందిన జవహర్లాల్ నవోదయ విద్యాలయ (కాక్చంగ్- ఖునౌ) పాఠశాల ఉంది. పద్మా - రత్నా స్కూల్ (కాక్చంగ్), కె.ఎం.ఇంజనీరింగ్ స్కూల్ (ఖాంగ్చంగ్), ఎవర్ గ్రీన్ ఫ్లవర్ ఇంజనీరింగ్, స్కూల్ (తౌబాల్) ఉన్నాయి.

ఆరోగ్యం[మార్చు]

 • హాస్పిటల్ జాబితా:-
Dist.Hptl.KBK
 • తౌబాల్ డిస్ట్రిక్ హాస్పిటల్ (ఖాంగబొక్)
 • జీవన్ హాస్పిటల్ (ప్రైవేట్ హాస్పిటల్) (ఖాంగబొక్)
 • యోగా & నేచుర్ క్యూర్ రీసెర్చ్ హాస్పిటల్ (కాక్చంగ్)

ప్రభుత్వ కార్యాలయాలు[మార్చు]

 • డెఫ్యూటీ కమీషనర్ ఆఫీస్ -తౌబల్ అథోక్పం
 • డిస్ట్రిక్ రోడ్డు ట్రాంస్పోర్ట్ ఆఫీస్ - తౌబల్ అథోక్పం
 • మిని సెక్రెటరేట్ కాంప్లెక్స్ - తౌబల్ అథోక్పం
 • డిస్ట్రిక్ హాస్పిటల్ ఖంగబొక్
 • టెలిఫోన్ ఎక్స్చేంజ్ బి.ఎస్.ఎన్.ఎల్ ఖంగబొక్
 • డిస్ట్రిక్ ఫిషరీ రీసెర్చ్ సెంటర్. ఖంగబొక్
 • డిస్ట్రిక్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ హెడ్క్వార్టర్స్ ఖంగబొక్
 • డిస్ట్రిక్ సివిల్ కోర్ట్ ఖంగ్బొక్
civil court KBK
 • డిస్ట్రిక్ రైస్ రీసెర్చ్ సెంటర్ ఖంగ్బొక్
 • డిస్ట్రిక్ సెరీకల్చర్ రీసెర్చ్ సెంటర్ ఖంగ్బొక్
 • ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఖంగ్బొక్
 • జోనల్ ఎజ్యుకేషన్ ఆఫీస్ తౌబాల్
 • పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంటు తౌబాల్
 • పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు తౌబాల్
 • బి.ఎస్.ఎన్.ఎల్. ఆఫీస్ కాక్చంగ్
 • ఎల్.ఐ.సి ఆఫీస్ కాక్చంగ్

బ్యాంకుల జాబితా[మార్చు]

 • ఎస్.బి.ఐ తౌబాల్ (అథోక్పం) .
 • ఎస్.బి.ఐ కక్చింగ్
 • యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (తౌబాల్)
 • యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (కాక్చంగ్)
 • ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ - తౌబాల్
 • హెచ్.డి.ఎఫ్.సి బ్యాంక్ తౌబాల్ (అథోక్పం)
 • ఐసిఐసిఐ బ్యాంక్, వాషింగ్టన్ ఆఫీసు సమీపంలో, తౌబాల్ (అథోక్పం)
 • ఎం.ఎస్.సి.డి. బ్యాంక్ తౌబాల్
 • బి.ఒ.ఐ. తౌబాల్ అచౌబా

క్రీడలు[మార్చు]

 • క్రీడల జాబితా:-
 • తౌబాల్ జిల్లా టేబుల్ టెన్నిస్ ఇండోర్ స్టేడియం తౌబాల్
 • బి.ఎ.ఎస్.యు. గ్రౌండ్ ఖాంగాబాక్
 • కొడొంపొక్పి ఫుట్‌ బాల్ స్టేడియం వాంగ్లింగ్
 • డిఎస్.ఎ గ్రౌండ్ కాక్పింగ్

మూలాలు[మార్చు]

 1. "Ranking of Districts by Population Size, 2001 and 2011" (XLS). The Registrar General & Census Commissioner, India, New Delhi-110011. 2010–2011. Retrieved 2011-09-18.
 2. http://www.ias.ac.in/currsci/sep252005/1018.pdf
 3. 3.0 3.1 3.2 3.3 3.4 3.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
 4. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Malta 408,333 July 2011 est.

వెలుపలి లింకులు[మార్చు]