Jump to content

చురచంద్‌పూర్ జిల్లా

వికీపీడియా నుండి
చురచంద్‌పూర్ జిల్లా
జిల్లా
చురచంద్‌పూర్ జిల్లా
చురచంద్‌పూర్ జిల్లా
దేశం భారతదేశం
రాష్ట్రంమణిపూర్
Elevation
914.4 మీ (3,000.0 అ.)
జనాభా
 (2011)[1]
 • Total2,71,274
 • జనసాంద్రత59/కి.మీ2 (150/చ. మై.)
భాషలు
 • అధికారికతడౌ-కుకి (మెజారిటీ), హమర్, జూ, వైఫీ, గాంగ్టే, సిమ్టే, తడౌ, మిజో, కోమ్, ఇతర గిరిజన భాషలు
Time zoneUTC+5:30 (భారత కాలమానం)
పిన్‌కోడ్
795128
టెలిఫోన్ కోడ్3874
స్త్రీ పురుష నిష్పత్తి969 స్త్రీలు - 1000 పురుషులు[1] /

చురచంద్‌పూర్ జిల్లా, మణిపూర్ రాష్ట్ర జిల్లా.

చరిత్ర

[మార్చు]

చురచంద్‌పూర్ జిల్లా కేంద్రంగా చురచంద్‌పూర్ లేక లంక పట్టణం ఉంది. ఈ జిల్లా మణిపూర్ రాష్ట్రానికి నైరుతీ సరిహద్దులో ఉంది. ఈ జిల్లా వైశాల్యం 4570 చ.కి.మీ ఉంటుంది. రాష్ట్ర రాజధాని ఇంపాల్ తరువాత మణిపూర్ రాష్ట్ర జిల్లాలలో వైశాల్యంలో 2 వస్థానంలో ఉంది. రాష్ట్రభూభాగం సాధారణంగా కొండలతో, ఇరుకైన లోయలతోనిండి తడి భూములతో వరిపంటకు అనుకూలంగా ఉంటుంది. జిల్లా కేంద్రగా ఇది వాణిజ్య, సాంస్కృతిక కేంద్రగా కూడా ఉంది. ఇక్కడి స్థానికులు ఈ ప్రాంతానికి లంకా అని నామకరణం చేసారు. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత మెయితియాలు ఈ ప్రాంతానికి చురచందపూర్ అని నామాంతరం చేసారు. తరువాత ఈ ప్రాంతంలో జనసంఖ్య అభివృద్ధి చెందింది. పట్టణజనసంఖ్య జోమిసలు, కుకీలు, మిజోలు, హ్మర్లు మొదలైన ప్రజలతో అభివృద్ధి చెందింది. ఈ ప్రజలు అధికంగా " టిబెటో- బర్మన్ " కుటుంబానికి చెందినవారై ఉన్నారు. మైదాననివాసులైన మెయిటియన్ల సంఖ్య జిల్లాలో గుర్తించతగినంతగా ఉన్నారు. ఒకే గిరిజన తెగకు చెంది ఉండడం వలన ఒకరి భాష ఒకరికి అర్ధం ఔతూ ఉంటుంది.

పంటభూములను

[మార్చు]

రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు చురచందపూర్ లోయ దోమలతో బాధపడే చిన్న గ్రామంగా తుయితా నదికి పడమర తీరంలో ఉంటూ ఉండేది. స్థానిక గిరిజనులు జుం, షిఫ్టింగ్ కల్టివేషన్ ఆధారంగా జీవితం సాహిస్తూ వచ్చారు. తరువాత ఇది వరిపంట పండించే భూమిగా మార్చబడింది.1930 హరిత విప్లవం తరువతా జుం నుండి వడ్లు పంటకు మార్చబడింది. ఆహారధాన్యం విరివిగా లభించడం మొదలైన తరువాత ఈ ప్రాంతం ఇతరసేవలు అభివృద్ధి చెంది చిన్నతరహా పట్టణంగా అవతరుంచింది. శ్రామికజీవితం మీద శ్రద్ధ పెరగడం కారణంగా కొత్తగా మద్యతరగతి వ్యాపార, దుకాణుదార్లు, వైద్యులు, గుమస్తా, ఒప్పందదార్లు, ఉపాధ్యాయులు, రుణదాతలు అలాగే సేవకులు గిరిజనతెగలు అవతరించాయి. ప్రజలసంఖ్య అధికం కావడంతో ఈ ప్రాంతం చురచంద్‌పుర్‌గా పిలువబడుతూ తుయితా నదికి పడమర తీరంలో విస్తరించింది. తుయితా నది అంటే మంచి నది అని అర్ధం. ఒకప్పుడీ ప్రాంతం మలేరియా వంటి మరణాంతక వ్యాధులకు మూలంగా ఉండేది. భూముల ధరలు పెరగడం కారణంగా వ్యవసాయ భూములకు నివాసగృహాలకు కొరత ఏర్పడి కొత్తగా నగరప్రాంతానికి వచ్చేవారికి నివాసగృహాల కొరత సమస్యగా మారడమేగాక ఈ ప్రాంతం ఆహారానికి ఇతర ప్రాంతాలమీద ఆధారపడవలసిన అవసరం ఏర్పడింది.

విస్తరణ

[మార్చు]

రెండవ ప్రపంచ యుద్ధం తరువాత చురచంద్‌పూర్ గ్రామం త్వరుతగతిలో లంకా ప్రాంతాన్ని తాకే వరకు అభివృద్ధిచెందింది. సౌంగపికి 15 కి.మీ దూరంలో ప్రత్యేకంగా ఉన్న ప్రాంతమే లంకా. లంకా పడమటిప్రాంత స్థానికులు, సౌంగపి ఉత్తరప్రాంత స్థానికులు వేరువేరుగా ఉంటూ సమీపకాలంలో ఒకటిగా మిశ్రితమయ్యారు. జిల్లాలో ఇతరగ్రామాలకంటే లంకా ప్రాంతానికి చాలాకాలం అధిక ప్రాధాన్యత ఉంటూ వచ్చింది.

స్థానికులు

[మార్చు]

1970 నాటికి లంకా వాణిజ్య సరిహద్దు, సౌంగపి మిషనరీ సరిహద్దు ఒకటిగా మిశ్రితమయ్యింది.చురచంద్‌పూర్ నిర్వహణాకేంద్రగానూ తరువాతి కాలంలో జిల్లా కేంద్రంగానూ మారింది. అలాగే భారతదేశ సరిహాద్దుగానూ అయింది. కొత్తగా నగరంలో స్థిరపడేవారికి ప్రస్తుతం లంకా దక్షిణ సరిహద్దుగా మారింది. కొత్త లంకా ప్రాంతం అత్యధిక జనసాంధ్రత కలిగినదిగా మారింది. అనేకాక ఈ జిల్లకు చెందిన పలువురు ప్రముఖులు జాతీయస్థాయిలో చరిత్రను సృష్టించారు. సమీపకాలంగా చురచంద్‌పూర్ నుండి నిపుణత కలిగిన శ్రామికులు ఇతర మహాబగరాలకు వలసపోవడం ప్రారంభించారు. అయినప్పటికీ సుదూర ప్రాంత గ్రామాల నుండి వలసవచ్చి చేరుతున్న ప్రజల వలన జనసంఖ్య క్రమంగా అభివృద్ధిచెందుతూనే ఉంది. ఇతర భారతీయ నగరాల వలెనే నగర నిర్మాణ ప్రణాళికా లోపం, పెట్టుబడుల కొరత, నిర్వహణా లోపం వంటి సమస్యలను చురచంద్‌పూర్ కూడా ఎదుర్కొంటున్నది. నగర మౌలిక వసతులు అభివృద్ధి చెందకుండానే నగరం అభివృద్ధి చెందుతూనే ఉంది. చురచంద్‌పూర్ ప్రస్తుతం విషయాలలో పేరుకుపోతున్న చెత్త, వాయు కాలుష్యం, వాహన రద్దీ వంటి సమస్యలను ఎదుర్కొంటున్నది.

భౌగోళికం

[మార్చు]

ఖుగా ఆనకట్ట

[మార్చు]

ఖుగ ఆనకట్ట నిర్మాణం మొదలైంది. ఖుగా ఆనకట్ట ఇప్పటికే లంకా దక్షిణ సరిహద్దులో మాతా గ్రామం వద్ద అందమైన కృత్రిమసరసును తయారుచేసింది. 20 చ.కి.మీ విస్తీర్ణంలో నిర్మించబడిన ఆనకట్ట నుండి 150 చ.కి.మీ వ్యవసాయ భూములకు సాగినీటిని అందించడానికి వీలు కలుగుతుంది. అంతేకాక 50 లక్షల గాలన్ల త్రాగునీటిని (23,000 క్యూ.మీ), 1.75 మె.వా విద్యుత్తును అందిస్తుంది. ఆనకట్ట ప్రణాళిక 1983లో ప్రారంభించబడింది. 4 సంవత్సరాలలో పూర్తిచేయాలని నిర్ణయించిన ఈ ప్రణాళిక నిధుల కొరత కారణంగా 2002 నాటికి పూర్తిగా రూపుదిద్దుకున్నది. ప్రస్తుత తేదీ వరకు ఈ ప్రణాళిక మణిపూర్ రాష్ట్రప్రభుత్వం చురచంద్‌పూర్ జిల్లాలో నిర్వహించిన అత్యధిక పెట్టుబడిగా గుర్తించబడుతుంది. ఆనకట్టలో కొంతభాగం రూపుదిద్దుకున్నప్పటికీ ఇంకా కొన్ని పనులు నిలువలో ఉంటూ వచ్చాయి. 2007 ఆనకట్టపనులు తిరిగి కార్యరూపంలోకి తీసుకురావాలని నిర్ణయించినప్పటికీ ఆనకట్టకు అవసరమైన భూమిని స్వాధీనం చేసుకోవడం భూమిని కోల్పోయే వారికి తగిన నష్టపరిహారం ఇచ్చే విషయంలో పులువివాదాకు తలెత్తున కారణంగా ప్రచారమాధ్యమాల నుండి తీవ్రమైన విమర్శలను ఎదుర్కొనడానికి కారణమైంది. చురచంద్‌పుర్ మణిపూర్ రాష్ట్రంలో విశాలమైన ప్రాంతం అయినప్పటికీ అధికారికంగా దీనికి ఇంకా నగరహోదా కలుగలేదు.

ఆర్ధికం

[మార్చు]

2011 గణాంకాలను అనుసరించి పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో చురచంద్‌పూర్ జిల్లా ఒకటి అని గుర్తించింది. బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న మణిపూర్ రాష్ట్రజిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[2] It is one of the three districts in Manipur currently receiving funds from the Backward Regions Grant Fund Programme (BRGF).[2]

చురచంద్‌పూర్ పట్టణంలో బి.ఎస్.ఎన్.ఎల్, ఎయిర్‌టెల్, ఎయిర్‌సెల్ చక్కని దూరవాణి సేవలను అందిస్తుంది. అయినప్పటికీ బి.ఎస్.ఎన్.ఎల్ సేవలు నగరంలో ప్రథమస్థానంలో ఉన్నాయి. ప్రస్తుతం టాటా ఇండికాం, వొడాఫోన్, ఐడియా, పైట్‌సెల్ మొదలైన ప్రైవేట్ యాజమాన్యం సేవలు కూడా లభిస్తున్నాయి.

ప్రయాణవసతులు

[మార్చు]

టేడిం రహదారి ద్వారా చురచంద్‌పూర్ రాష్ట్రరాజధాని నగరమైన ఇంఫాల్తో అనుసంధానించబడి ఉంది. ఈ రహదారిని బ్రిటిష్ ప్రభుత్వం సరుకు రవాణాకొరకు బర్మాలోని తెడియం నగరం వరకు నిర్మించింది. ఇంఫాల్ విమానాశ్రయం నుండి ఈ పట్టణం ఒకగంట మోటర్ వాహనప్రయాణం ద్వారా చేరుకోవచ్చు. మిజోరాం వరకు నిర్మించబడిన తిపియాముఖ్ రహదారి (జాతీయ రహదారి 150) కూడా ఈ పట్టణం మద్యగా పయనిస్తుంది. ఈ రహదారి కుడా ఈ పట్టణాన్ని ఇంఫాల్ నగరంతో అనుసంధానిస్తుంది. గుయితే రహదారి పట్టాణాన్ని తుయివై నది మీదుగా మిజోరాం రాష్ట్రంతో అనుసంధానిస్తుంది.

2001 లో గణాంకాలు

[మార్చు]
విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య 271,274, [3]
ఇది దాదాపు బార్బడోస్ దేశ జనసంఖ్యకు సమానం.[4]
అమెరికాలోని నగర జనసంఖ్యకు సమం
640 భారతదేశ జిల్లాలలో 575 వ స్థానంలో ఉంది [3]
1చ.కి.మీ జనసాంద్రత 59 [3]
2001-11 కుటుంబనియంత్రణ శాతం 19.03%.[3]
స్త్రీ పురుష నిష్పత్తి 969:1000, [3]
జాతియ సరాసరి (928) కంటే అధికం
అక్షరాస్యత శాతం 84.29%.[3]
జాతియ సరాసరి (72%) కంటే అధికం

చురచంద్‌పుర్ జిల్లాలో పైటే, హ్మర్, వైఫెయ్, జౌ, తడౌ గిరిజన తండాలకు చెందిన ప్రజలు నివసిస్తున్నారు. వీరే కాక గంటే, సింతే, మిజో గిరిజనులతో అల్పసంఖ్యలో మిల్హెయిం/మిరా, కొంతమంది మణిపురికి చెందిన మెయితియన్లు ఉన్నారు. జిల్లాలో తౌడీ ప్రజలు అధికసంఖ్యలో ఉన్నారు. అంతేకాక జిల్లాలో నివసిస్తున్న వారిలో మణిపురికి చెందని వారిలో నేపాలీలు, బిహారీలు, మార్వాడీలు, పంజాబీలు ఉన్నారు. నేపాలీలు పాలపరిశ్రమలో పనిచేస్తుండగా మార్వాడీలు వారి వంశపారంపర్య వృత్తి అయిన ౠణసహాయం చేస్తున్నారు. స్థానిక ప్రజలలో కొంతమంది వాణిజ్యం, ప్రభుత్వోద్యాగాలలో ఉన్నారు. ఈ జిల్లావాసులు అధికసంఖ్యలో జాతీయస్థాయిలో సివిల్ సర్వీసులలో పాల్గొంటున్నారు.

ప్రాంతం: 4570 చ.కి.మీ వర్గీకరణ 1/9
అక్షరాస్యత (2001) 84.29%[1] వర్గీకరణ 2/9
అక్షరాస్యత స్త్రీపురుష పురుషులు 88.34%[1] స్త్రీలు 80.13%[1]
జనసంఖ్య (2011 గణాంకాలు) 271,274[1] వర్గీకరణ 5/9
జనసంఖ్య % రాష్ట్ర జనసంఖ్యలో 9.97%[1] (2011 గణాంకాలు)
స్త్రీ:పురుష 969 (2011 గణాంకాలు) [1] 993 (2001 గణాంకాలు), 1004 (1961 గణాంకాలు)
ఉష్ణోగ్రత 41oC గరిష్ఠ 0oC కనిష్ఠ
తేమ 89% గరిష్ఠ 20% కనిష్ఠ
అక్షాంశం 93.15oE 94.0oE
రేఖాంశం 24.0oN 24.3oN
సముద్రమట్టం నుండి ఎత్తు 914.4 మీటర్లు (జిల్లా కేంద్రం.)
జనసాంధ్రత 50 (2001 గణాంకాలు) Rank 6/9
టెలిఫోన్ కోడ్ + 3874
పోస్టల్ కోడ్ చురచంద్‌పూర్ 795128 చియంగ్కొంపాంగ్ 795158
డిజిటల్ మ్యాప్ ఆఫ్ చురచంద్‌పుర్ https://web.archive.org/web/20160304233645/http://www.mapmyindia.com/?cx=416826&cy=5710960&cz=8 మ్యాప్‌ఇండియా

భాషలు

[మార్చు]

చురచంద్‌పూర్ జిల్లాలో పైటే, హ్మర్, వైపెయి, జౌ, గంతే, తడౌ, తెడిమ్/సుక్తే, సింతే, మిజో, కొం, ఇతర గిరిజన భాషలు వాడుకలో ఉన్నాయి. అంతేకాక జిల్లాలో అయిమొ, సినో-టిబెటన్ భాష కూడా వాడుకలో ఉంది.[5]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 1.7 "Census of India: Provisional Population Totals and Data Products – Census 2011: Manipur". "Office of the Registrar General and Census Commissioner, Ministry of Home Affairs, Government of India". 2011. Retrieved 1 June 2011.
  2. 2.0 2.1 Ministry of Panchayati Raj (8 September 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Archived from the original (PDF) on 5 ఏప్రిల్ 2012. Retrieved 27 September 2011.
  3. 3.0 3.1 3.2 3.3 3.4 3.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 30 September 2011.
  4. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 27 సెప్టెంబరు 2011. Retrieved 1 October 2011. Barbados 286,705 July 2011 est.
  5. M. Paul Lewis, ed. (2009). "Aimol: A language of India". Ethnologue: Languages of the World (16th ed.). Dallas, Texas: SIL International. Retrieved 28 September 2011.
  1. Census of India 2001: Manipur Series 14 (Provisional Population Totals), Imphal: Directorate of Census Operations, Manipur.
  2. Chinkhopau (1995) Churachandpur District, Churachandpur: Published by Author.
  3. District Statistical Handbook – Churachandpur: District Statistical Officer.
  4. Gangte, Thangzam (undated) Churachandpur Chanchin (An Account of Churachandpur)
  5. Ginsum, H (undated) Lamka Vangkhua (Lamka Town).
  6. Kamkhenthang, Dr. H (1995) "Lamka Town vis-a-vis Churachandpur", Shan (daily), 21 December.
  7. Kamkhenthang (1998) "Lamka (Churachandpur)" in B.D. Ray, A.K. Neog & H.K. Mazhari (eds.) Urban Development in North-East India : Potentiality and Problems, New Delhi: Vedams Books.
  8. Manipur State Archives, Imphal: Manipur State Durbar 1907–1947 – Papers related to the Court of the President of Manipur State Durbar, Hill Misc. Case No. 28 of 1945–46, Phungkhothang Chief of Hiangtam Lamka; also Misc Case No. 504 of 1934 Phungkhothang Chief of Hiangtam Lamka.
  9. Neihsial, Dr. Tualchin (1996) This is Lamka: A Historical Account of the Fastest Growing Town of Manipur Hills, Churachandpur, India: Zogam Book Centre & Library.
  10. Nengzachin (1974) "North East India General Mission Tanchin" in Jubilee Thusuah 1974, Churachandpur: Evangelical Convention Church; pp. 1–18.

వెలుపలి లింకుకు

[మార్చు]

వెలుపలి లింకులు

[మార్చు]