తెంగ్‌నౌపల్ జిల్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తెంగ్‌నౌపల్ జిల్లా
మణిపూర్ రాష్ట్ర జిల్లా
దేశం భారతదేశం
రాష్ట్రంమణిపూర్
ముఖ్య పట్టణంతెంగ్‌నౌపల్
విస్తీర్ణం
 • మొత్తం3,375 కి.మీ2 (1,303 చ. మై)
భాషలు
 • అధికారికమీటిలాన్ (మణిపురి)
కాలమానంUTC+5:30 (భారత కాలమానం)
వాహనాల నమోదు కోడ్ఎంఎన్

తెంగ్‌నౌపల్ జిల్లా, భారతదేశంలోని మణిపూర్‌ రాష్ట్ర కొత్త జిల్లా. ఇది చందేల్ జిల్లా నుండి విభజించబడింది.[1][2][3] ఇది రాజధాని నగరం ఇంఫాల్ నుండి 69 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇండో-మయన్మార్ రోడ్డులో ఎత్తైన ప్రదేశంలో ఉన్న ఈ జిల్లాలో లోయలు ఉన్నాయి. ఇది ప్రశాంతమైన, అందమైన పర్యాటక కేంద్రం. ఈ ప్రదేశం గుండా వెళుతున్నప్పుడు, మేఘాలు వెలుపలికి రావడాన్ని గమనించవచ్చు.[4]

భౌగోళికం[మార్చు]

తెంగ్‌నౌపల్ పట్టణం జిల్లా ప్రధాన కేంద్రంగా ఉంది. ఇది 24°19′41″N 93°59′10″E / 24.328°N 93.986°E / 24.328; 93.986Coordinates: 24°19′41″N 93°59′10″E / 24.328°N 93.986°E / 24.328; 93.986 అక్షాంశరేఖాంశాల మధ్య ఉంది.[5][6] దీని విస్తీర్ణం 3,375 కి.మీ2 (1,303 చ.మై) గా ఉంది. ఇది సముద్రమట్టానికి 2,500 నుండి 10,000 అడుగుల ఎత్తులో ఉంది.[4]

చరిత్ర[మార్చు]

ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని పఖాంఘా వంశీయులు పాలించారు. 1631లో చైనీయులు దీనిని స్వాధీనం చేసుకున్నారు. 1942లో రెండవ ప్రపంచ యుద్ధంలో జపనీయులు దీనిపై బాంబు దాడి చేశారు. ఈ జిల్లాలో మణిపూర్, బరాక్ అనే రెండు నదులు ఉన్నాయి. ఇవి ఉత్తరం నుండి దక్షిణానికి ప్రవహిస్తున్నాయి. చేపలతో నిండిన వివిధ సరస్సులు కూడా ఉన్నాయి. ఈ జిల్లాకు సమీపంలో ఉన్న మోరే, బర్మాతో సరిహద్దును పంచుకుంటుంది. ఇది ఈశాన్య భారత ముఖ్యమైన వాణిజ్య కేంద్రం.[4]

ఉప విభాగాలు[మార్చు]

తెంగ్‌నౌపల్ జిల్లాలో 3 ఉప విభాగాలు ఉన్నాయి.[7]

  • తెంగ్‌నౌపల్
  • మోరే
  • మాచి

మూలాలు[మార్చు]

  1. "7 new districts formed in Manipur amid opposition by Nagas". indiatoday.intoday.in. Retrieved 10 January 2021.
  2. "Manipur Creates 7 New Districts". NDTV.com. Retrieved 10 January 2021. CS1 maint: discouraged parameter (link)
  3. Laithangbam, Iboyaima. "New districts to stay, says Manipur CM". The Hindu. Retrieved 10 January 2021. CS1 maint: discouraged parameter (link)
  4. 4.0 4.1 4.2 "Tengnoupal Tourist Attractions, Tengnoupal Hill Station Manipur". www.incredible-northeastindia.com. Retrieved 10 January 2021.
  5. "Manipur Chief Minsiter [sic] inaugurates two new districts amid Naga protests - Times of India". The Times of India. Retrieved 10 January 2021. CS1 maint: discouraged parameter (link)
  6. "Simply put: Seven new districts that set Manipur ablaze". The Indian Express. 20 December 2016. Retrieved 10 January 2021. CS1 maint: discouraged parameter (link)
  7. "Creation of new districts could be game-changer in Manipur polls". www.hindustantimes.com/. 20 December 2016. Retrieved 10 January 2021. CS1 maint: discouraged parameter (link)