ఒలింపిక్ చిహ్నం
Jump to navigation
Jump to search

ఒలింపిక్స్ చిహ్నం లోని ఐదు చక్రాలు ప్రపంచంలోని ఐదు భాగాలు పాల్గొని ప్రాతినిధ్యం వహిస్తున్నట్లుగా చూపే ఈ చిహ్నానాన్ని 1912లో రూపొందించారు, 1914 జూన్ లో స్వీకరించారు, 1920 సమ్మర్ ఒలింపిక్స్లో స్థానం పొందింది.
ఒకదానితో ఒకటి గొలుసువలె కలిసిన ఐదు రింగులు ఒలింపిక్ క్రీడల చిహ్నం. ఐదు రింగుల అర్థం ఐదు ఖండాలు : 1. యూరప్, 2. ఆసియా, 3. ఆఫ్రికా, 4. ఆస్ట్రేలియా, 5. అమెరికా. ఐదు రింగులు వరుసగా నీలం, పసుపుపచ్చ, నలుపు, ఆకుపచ్చ, ఎరుపు రంగుల్లో ఉంటాయి. ఈ ఐదు రింగులు ప్రజల క్రీడా స్ఫూర్తికి సౌభ్రాతృత్వానికి చిహ్నం.
ఒలింపిక్ పతాకం[మార్చు]
ఒలింపిక్ పతాకం క్రీస్తుశకం 1913లో బేరన్ పియరీ డీ కౌబర్టీన్ సలహాపై రూపొందించబడి, క్రీస్తుశకం 1914లో పారిస్లో ఆవిష్కరింపబడింది. అయితే సా.శ. 1920లో జరిగిన అంటెవెర్ప్ ఒలింపిక్ క్రీడలలో ప్రప్రథమంగా ఎగుర వేయబడింది. ఒలింపిక్ పతాకం తెల్లని పట్టుగుడ్డ మీద ఒకదానితో ఒకటి కలిసిన ఐదు రింగులు ఉంటాయి.