ఓం ప్రకాష్ జిందాల్
ఓ. పి. జిందాల్ | |
---|---|
మినిస్టర్ ఆఫ్ పవర్, హర్యానా ప్రభుత్వం | |
In office 2005–2005 | |
నియోజకవర్గం | హిసార్ లెజిస్లేటివ్ అసెంబ్లీ స్థానం |
వ్యక్తిగత వివరాలు | |
జననం | 1930 ఆగస్టు 7 హిస్సార్, పంజాబ్ ప్రావిన్స్, బ్రిటిష్ ఇండియా |
మరణం | 2005 మార్చి 31 సహారన్‌పూర్, ఉత్తర ప్రదేశ్, భారతదేశం | (వయసు 74)
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ |
జీవిత భాగస్వామి | సావిత్రీ జిందాల్ |
సంతానం | 4, ( పృథ్వీరాజ్ జిందాల్, నవీన్ జిందాల్, సజ్జన్ జిందాల్, రతన్ జిందాల్) |
నివాసం | హిసార్ |
ఓం ప్రకాష్ జిందాల్ (1930 ఆగస్టు 7 - 2005 మార్చి 31), హర్యానాలోని హిసార్ లో జన్మించిన ఆయన ఓ. పి. జిందాల్ గా ప్రసిద్ధి చెందాడు. జిందాల్ ఆర్గనైజేషన్ ఫ్లాగ్షిప్ కింద జిందాల్ స్టీల్ అండ్ పవర్, జెఎస్‌డబ్ల్యూ గ్రూప్, జిందాల్ స్టెయిన్లెస్ లిమిటెడ్ సహా విజయవంతమైన వ్యాపార సంస్థలను ఆయన స్థాపించాడు. నవంబరు 2004లో, జిందాల్ కు బెంగాల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ద్వారా భారతీయ ఉక్కు పరిశ్రమ ఆయన చేసిన అద్భుతమైన కృషికి "లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు" లభించింది. ఫోర్బ్స్ జాబితా ప్రకారం, అతను అత్యంత ధనవంతులైన భారతీయులలో 13వ స్థానంలో, ప్రపంచంలోని అత్యంత ధనవంతులలో 548వ స్థానంలో ఉన్నాడు.[1] 2005 మార్చి 31న హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన మరణించాడు.[2]
కెరీర్
[మార్చు]ఆయన హర్యానా ప్రభుత్వంలో విద్యుత్ మంత్రిగా వ్యవహరించాడు. ఆయన వరుసగా మూడు సార్లు హర్యానాలోని హిసార్ శాసనసభ నియోజకవర్గం నుండి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. 1996 నుండి 1997 వరకు ఆహార, పౌర సరఫరాలు; ప్రజా పంపిణీ కమిటీలో సభ్యుడిగా కూడా పనిచేసాడు.
ఆయన ఫిబ్రవరి 2005లో హర్యానా విధాన సభకు (హర్యానా రాష్ట్ర శాసనసభ) ఎన్నికయ్యాడు, ఆయన మరణించే సమయానికి హర్యానా ప్రభుత్వంలో విద్యుత్ మంత్రిగా ఉన్నాడు. ఆయన ఎన్. సి. జిందాల్ ఛారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్, అగ్రోహా వికాస్ ట్రస్ట్, అగ్రోహ మెడికల్ కాలేజీలకు ట్రస్టీగా ఉన్నాడు.
ఆయన నలుగురు కుమారులు పృథ్వీరాజ్ జిందాల్, సజ్జన్ జిందాల్, రతన్ జిందాల్, నవీన్ జిందాల్. ఆయన భార్య సావిత్రి జిందాల్ హర్యానా రాష్ట్ర ప్రభుత్వంలో రెవెన్యూ, విపత్తు నిర్వహణ, పునరావాసం, గృహనిర్మాణ శాఖ సహాయ మంత్రిగా ఉంది, ఆయన కుమారుడు నవీన్ భారత పార్లమెంటు సభ్యుడిగా ఉన్నాడు.[3] ఆయన మనవరాలు స్మిను జిందాల్ జిందాల్ ఎస్. ఏ. డబ్ల్యూ మేనేజింగ్ డైరెక్టర్, అలాగే, స్వయం (Svayam) వ్యవస్థాపకురాలు.
మూలాలు
[మార్చు]- ↑ "From farmer's son to billionaire industrialist". www.rediff.com. 2005-03-31. Retrieved 2021-12-30.
- ↑ "O P Jindal: Man Who Could Talk To Machines, The Inspiring Story Of India's Original Steel Tycoon". IndiaTimes (in Indian English). 2021-10-09. Retrieved 2021-12-30.
- ↑ Savitri Jindal, A Jain Devotee From Terapanth Sector Declared the Richest Woman in India "Archived copy". Archived from the original on 20 February 2009. Retrieved 2009-02-06.
{{cite web}}
: CS1 maint: archived copy as title (link)