కంకాళీ
కంకాళీ లంబాడీ గిరిజన ప్రజల దేవత. లంబాడీలు తరతరాలుగా ఏడుగురు దేవతలను పూజిస్తారు. వారిలో త్వళ్జ ఒకరు.[1]
లంబాడీ సంస్కృతిలో మేరమ్మ
[మార్చు]తండాలో ఏ కార్యం జరిగినా పెళ్ళి, పుట్టుకలు, చావులు, పండుగలు అయినా సామూహికంగా తండా పెద్దలే జరిపించేవారు. పెళ్ళి అయితే ఆ తండాలో ఉన్న ప్రతి ఒక్కరూ కలిసిపోయేవారు. ఇంటిల్లిపాదీ భోజనంచేసేవారు. ప్రతి మనిషి తంతులో పాల్గొనాల్సిందే. పాటలతో లంబాడీలు తరతరాలుగా ఏడుగురు దేవతలను కొలుస్తారు. వారు మేరమ్మ, త్వళ్జ, సీత్ల, మంత్రల్, హింగ్ల, ధ్వాళ్ ఆంగళ్, కంకాళీ.
మానవునిపై ధాన్యాలపై పశు సంపదలపై ఎటువంటి శత్రువుల దాడి కుట్రలు జరగకుండా దరిచేరకుండా ఉండేందుకు బాధ్యతగా చూసుకోవాలని కంకాళీ అమ్మను మొక్కుకుంటారు లంబాడీలు. పెళ్ళి అయిన అమ్మాయిలకు ఒక తులం బంగారం ఒక కిలో వెండి 12 రూపాయి నాణేలతో దండ, కొంకుణాలు, చేతివేళ్ళకు మేరికలు, రైకలు, లంగాల నిండా అద్దాలు, గవ్వలు, తెల్లటి గాజులు చేతినిండా ఉండేవి. పెళ్ళి అయిన అమ్మాయి ఇంట్లోకి వస్తే లక్ష్మి వచ్చింది అనేది అనాడు లంబాడీల విశ్వాసం.
మూలాలు
[మార్చు]- ↑ "బంజారా సంస్కృతి-సీత్లా భవాని పండుగ | జాతర | www.NavaTelangana.com". NavaTelangana. Archived from the original on 2019-12-27. Retrieved 2020-07-09.