Jump to content

త్వళ్జ

వికీపీడియా నుండి

త్వళ్జ లంబాడీ గిరిజన ప్రజల దేవత. లంబాడీలు తరతరాలుగా ఏడుగురు దేవతలను పూజిస్తారు. వారిలో త్వళ్జ ఒకరు.[1]

లంబాడీ సంస్కృతిలో త్వళ్జ అమ్మ దేవత

[మార్చు]

లంబాడీ తండాలలో ఏ కార్యం జరిగినా, పెళ్ళి, పుట్టుకలు, చావులు, పండుగలు అయినా సామూహికంగా తండా పెద్దలే జరిపించేవారు. పెళ్ళి అయితే ఆ తండాలో ఉన్న ప్రతి ఒక్కరూ కలిసిపోయేవారు. ఇంటిల్లిపాదీ భోజనంచేసేవారు. ప్రతి మనిషి తంతులో పాల్గొనాల్సిందే. పాటలతో లంబాడీలు తరతరాలుగా మేరమ్మ, త్వళ్జ, సీత్ల, మంత్రల్, హింగ్ల, ధ్వాళ్ ఆంగళ్, కంకాళీ. అనే దేవతలను పూజిస్తున్నారు.

త్వళ్జ అమ్మను పండిన పంట ఇంటికి తీసుకొస్తే నవధాన్యాలు గుమ్మాలు, గాదెలు నిండే ఉండే విధంగా ఉండాలని కష్టాలు రాకుండా కాచుకోవాలని పూజిస్తారు. అల్లుళ్లు, బిడ్డలు చుట్టాలంతా రావాలని, కలుసుకోవాలని, కొడుకులకు, కోడళ్లకు పిల్లలు పుట్టాలని కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటారు.

వర్షాలు కురవాలి, పంటలు బాగా పండాలి, పెండ్లికాని అమ్మాయిలకు మంచి కాపురం దొరకాలని తొమ్మిది రోజులపాటు మేరమ్మ, త్వల్జ, సీత్ల, మత్రల్, హింగళ, ధ్వాళ్ దేవతలకు మొక్కుతారు. నవధాన్యాలను బుట్టలో వేసుకుని శాస్త్రీయంగా నృత్యం చేస్తారు.

మూలాలు

[మార్చు]
  1. "బంజారా సంస్కృతి-సీత్లా భవాని పండుగ | జాతర | www.NavaTelangana.com". NavaTelangana. Archived from the original on 2019-12-27. Retrieved 2020-07-09.
"https://te.wikipedia.org/w/index.php?title=త్వళ్జ&oldid=3909896" నుండి వెలికితీశారు