మేరమ్మ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మేరమ్మ లంబాడీ గిరిజన ప్రజల దేవత

లంబాడీ సంస్కృతిలో మేరమ్మ[మార్చు]

తండాలో ఏ కార్యం జరిగినా పెళ్ళి, పుట్టుకలు, చావులు, పండుగలు అయినా సామూహికంగా తండా పెద్దలే జరిపించేవారు. పెళ్ళి అయితే ఆ తండాలో ఉన్న ప్రతి ఒక్కరూ కలిసిపోయేవారు. ఇంటిల్లిపాదీ భోజనంచేసేవారు. ప్రతి మనిషి తంతులో పాల్గొనాల్సిందే. పాటలతో లంబాడీలు తరతరాలుగా ఏడుగురు దేవతలను కొలుస్తారు. వారు మేరమ్మ, త్వళ్జ, సీత్ల, మంత్రల్, హింగ్ల, ధ్వాళ్ ఆంగళ్, కంకాళీ.

వర్షాలు కురవాలి, పంటలు బాగా పండాలి, పెళ్ళికాని అమ్మాయిలకు మంచి కాపురం దొరకాలి. సుఖ సంతోషాలతో అత్తగారి ఇంటికి వెళ్ళాలి, పంటలు పండేవిధంగా పచ్చగా కాపురం ఉండాలని మేరమ్మను కోరుకుంటారు. తీజ్ 9 రోజులు జరుపుకుంటారు. నవధాన్యాలు బుట్టలో వేసి మొలకతీస్తారు. ఏ మొలక బాగా వస్తుందో ఆ పంట వేసుకోవాలని తండాలో పెద్దలు నిర్ణయిస్తారు. శాస్త్రీయంగా విత్తనాలు వేసుకుంటారు. పంటలు పండిస్తారు.

మూలాలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=మేరమ్మ&oldid=3888166" నుండి వెలికితీశారు