Jump to content

మంత్రల్

వికీపీడియా నుండి

మంత్రల్ అమ్మ లంబాడీ గిరిజన ప్రజల దేవత. లంబాడీలు తరతరాలుగా ఏడుగురు దేవతలను పూజిస్తారు. వారిలో త్వళ్జ ఒకరు.[1]

లంబాడీ సంస్కృతిలో మంత్రల్ అమ్మ

[మార్చు]

తండాలో ఏ కార్యం జరిగినా పెళ్ళి, పుట్టుకలు, చావులు, పండుగలు అయినా సామూహికంగా తండా పెద్దలే జరిపించేవారు. పెళ్ళి అయితే ఆ తండాలో ఉన్న ప్రతి ఒక్కరూ కలిసిపోయేవారు. ఇంటిల్లిపాదీ భోజనంచేసేవారు. ప్రతి మనిషి తంతులో పాల్గొనాల్సిందే. పాటలతో లంబాడీలు తరతరాలుగా ఏడుగురు దేవతలను కొలుస్తారు. వారు మేరమ్మ, త్వళ్జ, సీత్ల, మంత్రల్, హింగ్ల, ధ్వాళ్ ఆంగళ్, కంకాళీ.

ఇతర ఊర్లలో ఉండే రోగాలు, కష్టాలు, జబ్బులు, గత్తెరలాంటివి తండాల పొలిమేర వరకు రాకూడదని శుభ్రం చేసుకుంటూ మంత్రల్ దేవతను పూజిస్తారు.

మేరమ్మ, తీజ్, మంత్రల్, సీత్ల అనేవి బంజారాలకు ప్రధానమైన పండుగలు. మేరమ్మ దేవత తండాను రక్షిస్తే, తీజ్ పంటలను కాపాడుతుంది. సీత్ల పశు సంపదను వృద్ధి చేస్తుంది. మంత్రల్ పిల్లలకు ఎటువంటి రోగాలు రాకుండా చేస్తుంది.[2] ఈ దేవతలు నిర్వర్తించే పాత్రలు బంజారా దేవతలు తండాను రక్షించడంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నవి.[3]

మూలాలు

[మార్చు]
  1. "బంజారా సంస్కృతి-సీత్లా భవాని పండుగ | జాతర". NavaTelangana. Archived from the original on 2019-12-27. Retrieved 2020-07-09.
  2. "కనె్నపిల్లల వేడుక.. 'తీజ్' వేదిక | Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi". andhrabhoomi.net. Archived from the original on 2020-07-11. Retrieved 2020-07-09.
  3. "కనె్నపిల్లల వేడుక.. 'తీజ్' వేదిక - Telangana". Dailyhunt (in ఇంగ్లీష్). Retrieved 2020-07-09.
"https://te.wikipedia.org/w/index.php?title=మంత్రల్&oldid=3907293" నుండి వెలికితీశారు