కందుకూరి బాలసూర్య ప్రసాదరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కందుకూరి బాలసూర్య ప్రసాదరావు పండితులు, రచయిత, విజ్ఞాన సర్వస్వ సంకలన కర్త.

వీరు గంజాం జిల్లాలోని ఒక జమీందారు, వీరి జమీందారీలోని ప్రముఖ గ్రామాన్ని బట్టి వీరికి 'దేవిడి జమీందారు' అనే వ్యవహార నామం ఏర్పడింది. వీరి పూర్వులు హైదరాబాదు నిజాం దగ్గర ఉన్నత పదవులలో ఉన్నవారు.

వీరు సర్వతోముఖమైన విజ్ఞానాన్ని పొంది, తెలుగులో రచనా కౌశలం, కవితా శక్తి అలవరచుకున్నారు. తన ఆస్థాన పండితుల సహాయంతో వీరు ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం అనే పేరుగల ఏడు సంపుటాల విజ్ఞాన సర్వస్వాన్ని స్వయంగా రచించి ముద్రించారు. వీరు ఇదికాక సీమంతినీ పరిణయం అనే ప్రబంధం, వీధి నాటకం అనే పద్యకావ్యం, మాతుల సుతోద్వాహం అనే పద్య కావ్యం, ప్రబోధ అనే ప్రహసనం రచించారు.

వీరు మరికొందరితో కలిసి విశాఖపట్నం సముద్ర తీరంలో 1934 సంవత్సరంలో భారతీయుల కోసం సెంచరీ క్లబ్ (Centuary Club) ప్రారంభించారు.[1]

మూలాలు[మార్చు]