కంప్యూటర్ కేస్
కంప్యూటర్ కేస్ అనగా కంప్యూటర్ యొక్క అత్యధిక భాగాలు (సాధారణంగా డిస్‌ప్లే, కీబోర్డు, మౌస్ మినహాయించి) ఉండే ఆవరణము. కంప్యూటర్ కేసును కంప్యూటర్ చట్రం, టవర్, సిస్టమ్ యూనిట్, కేబినెట్, బేస్ యూనిట్ లేదా సింపుల్‌గా కేస్ అని కూడా పిలుస్తారు. కేసులను సాధారణంగా స్టీల్ (తరచుగా ఎస్ఇసిసి - స్టీల్, ఎలక్ట్రోగాల్వనైజ్డ్, కోల్డ్-రోల్లెడ్, కాయిల్) లేదా అల్యూమినియం నుంచి తయారు చేస్తారు. ప్లాస్టిక్ కొన్నిసార్లు ఉపయోగిస్తారు,, గ్లాస్, చెక్క, ఇంకా లెగో బ్లాక్స్ వంటి ఇతర మెటీరియల్స్ ఇంటిలో తయారు చేసుకొనే వాటిలో కనిపిస్తుంటాయి.
పరిమాణాలు[మార్చు]
కేసులు వేర్వేరు పరిమాణాలలో తయారు చేయబడుతుంటాయి. కంప్యూటర్ కేసు పరిమాణం, ఆకారం సాధారణంగా అధిక కంప్యూటర్లలో అతిపెద్ద విభాగమైన మదర్‌బోర్డు యొక్క ఫారమ్ ఫ్యాక్టర్ ద్వారా నిర్ణయించబడుతుంది.
కేసులో బిగించే కంప్యూటర్ భాగాలు[మార్చు]
- సిపియు/ప్రాసెసర్
- మదర్‌బోర్డు
- పవర్ సరఫరా యూనిట్
- RAM (రాండమ్ యాక్సెస్ మెమరీ)
- హార్డు డ్రైవు
- ఎక్స్‌పెన్షన్ కార్డులు (వీడియో కార్డ్, సౌండ్ కార్డ్, నెట్వర్క్ కార్డు, బ్లూటూత్ కార్డ్ మొదలైనవి)
- సిడి డ్రైవ్
- ఫ్లాపీ డిస్క్
- హీట్ సింక్, కంప్యూటర్ ఫ్యాన్
చిత్రమాలిక[మార్చు]
- కంప్యూటర్ కేసులు
SWTPC 6800 case with SS-50 and SS-30 buses—an early hobbyist machine
Enthusiast case featuring translucent panel casemod
8-slot Baby AT form factor case