Jump to content

కటాసరాజ ఆలయం

వికీపీడియా నుండి
పైనుండి చూసినపుడు ఆలయం ఈ విధంగా కనిపిస్తుంది

కటాసరాజ ఆలయం, పాకిస్తాన్‌లోని పంజాబురాష్ట్రానికి చెందిన ఒక ప్రముఖ దేవాలయం. ఇది చక్వాల్ జిల్లాలోని కటాస్ గ్రామంలో ఉంది. ఇది ఒక శివాలయం. మహాభారతకాలంలో పాండవులు తమ అరణ్యవాసంలో కొంతకాలాన్ని ఈ ప్రదేశంలో గడిపినట్టు భావిస్తారు. పాకిస్తాన్ ప్రభుత్వం, ఈ ప్రాంతానికి ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు తేవాలని భావిస్తోంది. మూడు దశల్లో, దీని పునరుద్ధరణకు 20 మిలియన్లు కేటాయించాలని కూడా ప్రతిపాదించింది.

స్థల పురాణం

[మార్చు]

దక్షయజ్ఞసమయంలో, సతీదేవి ప్రాయోప్రవేశం చేసినదన్న వార్త తెలిసినపుడు శివుని కంటి నుండి రెండు కన్నీటిబొట్లు రాలాయి. అవి భూమి మీద పడినపుడు, ఒకటి ఇక్కడి కటాసక్షేత్రంలోని అమృతకుండ్ తీర్థంగానూ, రెండవది భారతదేశం, రాజస్థాన్ రాష్ట్రంలోని అజమేరు (అజ్మీర్) లోని పుష్కరరాజ్ తీర్థంగానూ మారాయి.

మహాభారత అరణ్య పర్వంలో పాండవులు అరణ్య వాసంలో ఉన్నప్పుడు ఒక బ్రాహ్మణుడు పాండవుల వద్దకు వచ్చి తర ఆరణి లేడికొమ్ములలో యిరుకుకొని పోయినదని దానిని తెచ్చి యివ్వవలసినదిగా ఆ బ్రాహ్మణుడు కోరగా ధర్మరాజు నలుగురు తమ్ములతో లేడిని పట్టుటకు బయలుదేరినారు. కొంతసేపటికి ఆ లేడి మాయమైనది. వెతికి వెతికి అలసట చెంది మంచి నీరు తెమ్మని నకులుని పంపినారు. నకులుడు ఎంతకూ రాకుండుటచే సహదేవుని పంపారు. అదే విధంగా అర్జునుడు, భీముడు ఎవరు తిరిగిరాలేదు. చివరకు ధర్మరాజు బయలు దేరాడు. మంచినీటి కొలను ప్రక్కనే నలుగురు తమ్ములను చూసి, దు:ఖంతో భీతిల్లసాగాడు. అంతలో అదృష్యవాణి పలికినది... ధర్మనందనా నేను యక్షుడను. ఈ సరస్సు నా ఆధీనంలో ఉంది. నేనడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పక, నీ తమ్ములు అహంభావంతో దాహం తీర్చుకోబోయి నందుననే ఈ గతి పట్టినది. నీవయిననూ, నా ప్రశ్నలకు సమాధానం చెప్పి నీ దాహం తీర్చుకో అన్నాడు యక్షుడు. సరే అన్నాడు ధర్మరాజు. వీటినే, యక్షప్రశ్నలుగా హిందువులు చెప్పుకుంటూ ఉంటారు. ఇది కటాసక్షేత్రంలోని అమృతకుండ్ వద్దనే జరిగింది.

చరిత్ర

[మార్చు]
కటాస్ గ్రామం, అక్కడి ఆలయాల 1857నాటి చిత్రం.

ఇక్కడ100కి పైగా ఉన్న ఆలయాల్లో ఎక్కువ శాతం 900 సంవత్సరాలు లేదా అంతకన్నా పూర్వానివేనని చరిత్రకారుల ఉద్దేశం. కటాసక్షేత్రం ఉచ్ఛస్థితిలో ఉన్నపుడు విశ్వవిద్యాలయంగా కూడా భాసిల్లినది. ఎందరో దేశీ, విదేశీ విద్యార్థులు ఇక్కడ విద్యనభ్యసిస్తూ ఉండేవారు. ప్రముఖ గణితజ్ఞుడు అల్ బెరూని ఈ విశ్వవిద్యాలయంలో సంస్కృత అధ్యయనం చేస్తూ, భూమి చుట్టుకొలతను లెక్కించాడు. 1947 కాలంలో ఇక్కడి హిందువులందరూ భారతదేశంలోని పంజాబుకు వెళ్లిపోయారు.

ప్రస్తుతం

[మార్చు]

ఈ ఆలయక్షేత్రాన్ని ప్రపంచవారసత్వ సంపదగా గుర్తింపజేయాలని పాకిస్తాన్ ప్రయత్నిస్తోంది. 2006-07లో ఇక్కడి ఏడు ఆలయాలలో విగ్రహాలను పునఃప్రతిష్ఠించేందుకు నిర్ణయించి 51.06 మిలియన్ రూపాయలను కేటాయించింది. భారతదేశంనుండి ఈ విగ్రహాలను దిగుమతి చేసుకోవాలని నిర్ణయించుకొంది.ఈ పని మీద, ముగ్గురు పురాతత్వవేత్తల జట్టు భారతదేశంతోపాటు, శ్రీలంక, నేపాల్‌లలో కూడా సందర్శించింది. 2005 సంవత్సరంలో భారత మాజీ ఉపప్రధాని లాల్ కృష్ణ అద్వానీ ఈ ఆలయాన్ని సందర్శించారు.

బయటి లంకెలు

[మార్చు]

Bottom of Form


పాకిస్తాన్‌లో శ్రీ కృష్ణుడు ప్రతిష్టించిన శివలింగం, అమృత కుండము .

దయచేసి పూర్తిగా చదవండి.  మీరు తెలుసుకుని అందరికీ తెలిసేలా దయచేసి షేర్ చేయండి

పాకిస్తాన్‌లో శ్రీ కృష్ణుడు ప్రతిష్టించిన శివలింగం , ఇక్కడే అమృత కుండము ఉన్నదీ , ఈ అమృత కుండము దగ్గరే ధర్మ రాజు యక్ష్ణుని ప్రశ్నలకు సమాధానం చెప్పారు. భారతదేశం నుంచి పాకిస్తాన్ విడిపోయిన తరువాత అక్కడి హైందవ ఆలయాలకి తీవ్ర నష్టం కలిగింది. పాలకుల నిర్లక్ష్యం కారణంగానో, స్థానికుల నిర్లిప్తం చేతనో అక్కడి దేవాలయాలన్నీ శిథిలమైపోయాయి. చాలా వరకు కాలగర్భంలో కలిసిపోయాయి. అదృష్టవశాత్తూ అక్కడి హైందవ క్షేత్రం ఒకటి కాలపరీక్షను తట్టుకొని నిలిచింది. చివరికి పాకిస్తాన్‌ ప్రభుత్వం దిగివచ్చి ఆ ఆలయాన్ని పరిరక్షించేందుకు నడుం కట్టింది. అదే కాటస్‌రాజ్‌!


మహాభారతం- కాటస్‌రాజ్‌: కాటస్‌రాజ్ ఈనాటిది కాదు. మహాభారత కాలంలో పాండవులు ఇక్కడే చాలా రోజులు అరణ్యవాసాన్ని గడిపారని స్థలపురాణం చెబుతోంది. ఆ సమయంలో పాండవులు ఇక్కడ కొన్ని ఆలయాలను నిర్మించారని చెబుతారు. ప్రాచీన కాలం నుంచే ఇక్కడ మనుషుల సంచారం ఉంది అనేందుకు రుజువుగా... ఇక్కడ దాదాపు 9 వేల సంవత్సరాల క్రితం వాడిన కత్తులు, గొడ్డళ్లు, గాజులు బయటపడ్డాయి.  సతీదేవి కన్నీరు: ఇస్లామాబాద్- లాహోరు రహదారి పక్కన, చాక్వాల్‌ అనే జిల్లాలో ఈ కాటస్‌రాజ్‌ క్షేత్రం ఉంది. దక్షయజ్ఞం సమయంలో సతీదేవి కన్నీటితో ఇక్కడ ఒక సరస్సు ఏర్పడిందనీ... ఆ సరస్సులోని నీరు మహిమాన్వితమైనదని చెబుతారు. అందుకనే ఆ సరస్సు చుట్టూ పాండవులు ఆలయాలు నిర్మించారట. ధర్మరాజు యక్షప్రశ్నలకు జవాబు చెప్పి తన సోదరులను బతికించుకుంది కూడా ఈ ప్రాంతంలోనే అని ఓ ఐతిహ్యం. ఇక్కడి శివాలయంలోని శివలింగాన్ని సాక్షాత్తూ ఆ కృష్ణుడే ప్రతిష్టించాడట. అందుకనే అనాదిగా ఈ క్షేత్రం హిందువులకు ఆరాధనీయంగా మారింది. ఈ ప్రాంతాన్ని పాలించే రాజులు సైతం ఇక్కడ రాజమందిరాలను నిర్మించుకున్నారు. 1947లో విభజన తరువాత ఇక్కడి హిందువులందరూ వెళ్లిపోయినా, కొందరు భక్తులు ఇప్పటికీ వ్యయప్రయాసలకు ఓర్చి ఈ క్షేత్రాన్ని చేరుకుంటూ ఉంటారు.  పాకిస్తాన్‌ భూభాగంలో ఉన్న కాటస్‌రాజ్‌ చాలాకాలం నిర్లక్ష్యానికి గురైంది. ఇక్కడి ముస్లింలు చాలా శాంతస్వభావులు అని పేరు ఉన్నప్పటికీ, ప్రభుత్వపు అలసత్వంతో కాటస్‌రాజ్ శిథిలదశకు చేరుకుంది. ఇక్కడి సరస్సు చెత్తాచెదారంతో నిండిపోయింది. అయితే రానురానూ ఇక్కడి నిర్మాణాల గురించి ప్రపంచవ్యాప్తంగా ప్రచారం జరగడంతో... వాటిని పట్టించుకోక తప్పలేదు. సరస్సుని శుద్ధి చేసేందుకు, ఆలయాలకి శిఖరాలను పునర్నిర్మించేందుకు, వాటిలో సరికొత్త విగ్రహాలను ప్రతిష్టించేందుకు నవాజ్‌ షరీఫ్‌ ప్రభుత్వం ముందుకు వచ్చింది. తమకి ఇతర మతాల పట్ల కూడా సహనం ఉందని చెప్పుకొనేందుకు కాటస్‌రాజ్‌ అభివృద్ధిని వారు ఓ ఉదాహరణగా చూపిస్తున్నారు.


యక్ష ప్రశ్నలు": మహా భారతం లోని అరణ్య పర్వంలో పాండవులు వనవాసంలో ఉన్నప్పుడు ధర్మరాజును పరీక్షించటానికి యమధర్మరాజు యక్షుని రూపంలో అడిగిన ప్రశ్నలే యక్ష ప్రశ్నలు. వ్యవహారికములో చిక్కు ప్రశ్నలను, సమాధానం కష్టతరమైన ప్రశ్నలకు పర్యాయంగా యక్ష ప్రశ్నలు అనే మాటను వాడతారు.. పూర్వం మహాభారత అరణ్య పర్వంలో పాండవులు అరణ్య వాసంలో ఉన్నప్పుడు ఒక బ్రాహ్మణుడు పాండవుల వద్దకు వచ్చి తన ఆరణి లేడికొమ్ములలో యిరుక్కొని పోయినదని దానిని తెచ్చి యివ్వవలసినదిగా ఆ బ్రాహ్మణుడు కోరగా ధర్మరాజు నలుగురు తమ్ములతో లేడిని పట్టుటకు బయలుదేరినారు. కొంతసేపటికి ఆ లేడి మాయమైనది. వెతికి వెతికి అలసట చెంది మంచి నీరు తెమ్మని నకులుని పంపినారు. నకులుడు ఎంతకూ రాకుండుటచే సహదేవుని పంపారు. అదే విధంగా అర్జునుడు, భీముడు ఎవరు తిరిగిరాలేదు. చివరకు ధర్మరాజు బయలు దేరాడు. మంచినీటి కొలను ప్రక్కనే నలుగురు తమ్ములను చూసి, దు:ఖంతో భీతిల్లసాగాడు. అంతలో అదృశ్యవాణి పలికినది... ధర్మనందనా నేను యక్షుడను. ఈ సరస్సు నా ఆధీనంలో ఉంది. నేనడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పక, నీ తమ్ములు అహంభావంతో దాహం తీర్చుకోబోయి నందుననే ఈ గతి పట్టినది. నీవయిననూ, నా ప్రశ్నలకు సమాధానం చెప్పి దాహం తీర్చుకో అన్నాడు యక్షుడు. సరే అన్నాడు ధర్మరాజు

72 ప్రశ్నలు-జవాబులు  : ధర్మరాజును పరీక్షిచుటకు యమధర్మరాజు యక్షుడి రూపంలో 72 చిక్కు ప్రశ్నలు వాటికి ధర్మరాజు ఇచ్చిన జవాబులు:

  1. సూర్యుణ్ణి ఉదయింప చేయువారు ఎవరు? (బ్రహ్మం)



  1. సూర్యుని చుట్టూ తిరుగువారెవరు? (దేవతలు)
  2. సూర్యుని అస్తమింపచేయునది ఏది? (ధర్మం)
  3. సూర్యుడు దేని ఆధారంగా నిలచియున్నాడు? (సత్యం)
  4. మానవుడు దేనివలన శ్రోత్రియుడగును? (వేదం)
  5. దేనివలన మహత్తును పొందును? (తపస్సు)

7.      మానవునికి సహాయపడునది ఏది? (ధైర్యం)

8. మానవుడు దేనివలన బుద్ధిమంతుడగును? (పెద్దలను సేవించుటవలన)

9. మానవుడు మానవత్వమును ఎట్లు పొందును? (అధ్యయనము వలన)

10. మానవునికి సాధుత్వాలు ఎట్లు సంభవిస్తాయి? (తపస్సువలన సాధుభావము, శిష్టాచార భ్రష్టత్వం వల్ల అసాధుభావము సంభవించును.)

11. మానవుడు మనుష్యుడెట్లు అవుతాడు? ( మృత్యు భయమువలన)

12. జీవన్మృతుడెవరు? (దేవతలకూ, అతిధులకూ పితృసేవకాదులకు పెట్టకుండా తినువాడు)

13. భూమికంటె భారమైనది ఏది? (జనని)

14. ఆకాశంకంటే పొడవైనది ఏది? (తండ్రి)

15. గాలికంటె వేగమైనది ఏది? (మనస్సు)

16. మానవునికి సజ్జనత్వం ఎలావస్తుంది? ( ఇతరులు తనపట్ల ఏపని చేస్తే, ఏ మాట మాట్లాడితే తన మనస్సుకు బాధ కలుగుతుందో తాను ఇతరుల పట్ల కూడా ఆ మాటలు మాట్లాడకుండా ఎవడు ఉంటాడో అట్టి వానికి సజ్జనత్వం వస్తుంది)

17. తృణం కంటే దట్టమైనది ఏది? (చింత)

18. నిద్రలో కూడా కన్ను మూయనిది ఏది? (చేప)

19. రాజ్యమేలేవాడు దైవత్వం ఎలా పొందుతాడు? ( అస్త్రవిద్యచే)

20. రాజ్యాధినేతకు సజ్జనత్వం ఎలా కలుగుతుంది? ( యజ్ఞం చేయుటవలన)

21. జన్మించియు ప్రాణంలేనిది (గుడ్డు)

22. రూపం ఉన్నా హృదయం లేనిదేది? (రాయి)

23. మానవుడికి దుర్జనత్వం ఎలా వస్తుంది? (శరణుజొచ్చిన వారిని రక్షించక పోవడంవలన)

24. ఎల్లప్పుడూ వేగం గలదేది? (నది)

25. రైతుకు ఏది ముఖ్యం? (వాన)

26. బాటసారికి, రోగికి, గౄహస్ధునకూ, చనిపోయిన వారికి బంధువులెవ్వరు? (సార్ధం, వైద్యుడు, శీలవతి అనుకూలవతి అయిన భార్య, సుకర్మ వరుసగా బంధువులు)

27. ధర్మానికి ఆధారమేది? (దయ దాక్షిణ్యం)

28. కీర్తికి ఆశ్రయమేది? (దానం)

29. దేవలోకానికి దారి ఏది? (సత్యం)

30. సుఖానికి ఆధారం ఏది? (శీలం)

31. మనిషికి దైవిక బంధువులెవరు? (భార్య/భర్త)

32. మనిషికి ఆత్మ ఎవరు? ( కుమారుడు)

33. మానవునకు జీవనాధారమేది? (మేఘం)

34. మనిషికి దేనివల్ల సంతసించును? (దానం)

35. లాభాల్లో గొప్పది ఏది? (ఆరోగ్యం)

36. సుఖాల్లో గొప్పది ఏది? (సంతోషం)

37. ధర్మాల్లో ఉత్తమమైనది ఏది? (అహింస)

38. దేనిని నిగ్రహిస్తే సంతోషం కలుగుతుంది? (మనస్సు)

39. ఎవరితో సంధి శిథిలమవదు? (సజ్జనులతో)

40. ఎల్లప్పుడూ తృప్తిగా పడియుండునదేది? (యాగకర్మ)

41. లోకానికి దిక్కు ఎవరు? (సత్పురుషులు)

42. అన్నోదకాలు వేనియందు ఉద్భవిస్తాయి? (భూమి, ఆకాశములందు)

43. లోకాన్ని కప్పివున్నది ఏది? (అజ్ఞానం)

44. శ్రాద్ధవిధికి సమయమేది? (బ్రాహ్మణుడు వచ్చినప్పుడు)

45. మనిషి దేనిని విడచి సర్వజనాదరణీయుడు, శోకరహితుడు, ధనవంతుడు, సుఖవంతుడు అగును? ( వరుసగా గర్వం, క్రోధం, లోభం, తృష్ణ విడచినచో)

46. తపస్సు అంటే ఏమిటి? ( తన వృత్తి, కుల ధర్మం ఆచరించడం)

47. క్షమ అంటే ఏమిటి? ( ద్వంద్వాలు సహించడం)

48. సిగ్గు అంటే ఏమిటి? (చేయరాని పనులంటే జడవడం)

49. సర్వధనియనదగు వాడెవడౌ? ( ప్రియాప్రియాలను సుఖ దు:ఖాలను సమంగా ఎంచువాడు)

50. జ్ఞానం అంటే ఏమిటి? (మంచి చెడ్డల్ని గుర్తించ గలగడం)

51. దయ అంటే ఏమిటి? ( ప్రాణులన్నింటి సుఖము కోరడం)

52. అర్జవం అంటే ఏమిటి? ( సదా సమభావం కలిగి వుండడం)

53. సోమరితనం అంటే ఏమిటి? (ధర్మకార్యములు చేయకుండుట)

54. దు:ఖం అంటే ఏమిటి? ( అజ్ఞానం కలిగి ఉండటం)

55. ధైర్యం అంటే ఏమిటి? ( ఇంద్రియ నిగ్రహం)

56. స్నానం అంటే ఏమిటి? (మనస్సులో మాలిన్యం లేకుండా చేసుకోవడం)

57. దానం అంటే ఏమిటి? ( సమస్తప్రాణుల్ని రక్షించడం)

58. పండితుడెవరు? ( ధర్మం తెలిసినవాడు)

59. మూర్ఖుడెవడు? (ధర్మం తెలియక అడ్డంగావాదించేవాడు)

8.      ఏది కాయం? ( సంసారానికి కారణమైంది)

9.      అహంకారం అంటే ఏమిటి? ( అజ్ఞానం)

10.  డంభం అంటే ఏమిటి? (తన గొప్పతానే చెప్పుకోవటం)

11.  ధర్మం, అర్ధం, కామం ఎక్కడ కలియును? (తన భార్యలో, తన భర్తలో)

12.  నరకం అనుభవించే వారెవరు? (ఆశపెట్టి దానం ఇవ్వనివాడు, వేదాల్నీ, ధర్మ శాస్త్రాల్నీ, దేవతల్నీ, పితృదేవతల్నీ, ద్వేషించేవాడు, దానం చెయ్యనివాడు)

13.  బ్రాహ్మణత్వం ఇచ్చేది ఏది? (ప్రవర్తన మాత్రమే)

14.  మంచిగా మాట్లాడేవాడికి ఏమి దొరుకుతుంది? (మైత్రి)

15.  ఆలోచించి పనిచేసేవాడు ఏమవుతాడు? (అందరి ప్రశంసలుపొంది గొప్పవాడవుతాడు)

16.  ఎక్కువమంది మిత్రులు వున్నవాడు ఏమవుతాడు? (సుఖపడతాడు)

17.  ఎవడు సంతోషంగా ఉంటాడు? (అప్పులేనివాడు, తనకున్న దానిలో తిని తృప్తి చెందేవాడు)

18.  ఏది ఆశ్చర్యం? (ప్రాణులు ప్రతిరోజూ మరణిస్తూ ఉండడం చూస్తూ మనిషి తానే శాశ్వతంగా ఈ భూమి మీద ఉండి పోతాననుకోవడం)

19.  లోకంలో అందరికన్న ధనవంతుడెవరు? (ప్రియయూ అప్రియమూ, సుఖమూ దు:ఖమూ మొదలైన వాటిని సమంగా చూసేవాడు)

20.  స్ధితప్రజ్ఞుడు అని ఎవరిని ఆంటారు? (నిందాస్తుతులందూ, శీతోష్ణాదులందూ, కలిమి లేములందూ, సుఖదు:ఖాదులందూ సముడై, లభించిన దానితో సంతృప్తుడై అభిమానాన్ని విడచి, అరిషడ్వర్గాలను జయించి స్ధిరబుద్ధికలవాడుగా ఎవరైతే ఉంటాడో వానినే స్థితప్రజ్ఞుడంటారు)


మేము చేస్తున్న ప్రయత్నాన్ని మీరు సమర్ధిస్తే దయచేసి వీటిని అందరికీ చేరేలా షేర్ చేయండి


మీరు తెలుసుకుని అందరికీ తెలిసేలా చేయండి