Jump to content

కటుకం మృత్యుంజయం

వికీపీడియా నుండి
కటుకం మృత్యుంజయం

ఎమ్మెల్యే
పదవీ కాలం
1983 – 1985
ముందు నలుమాచు కొండయ్య
తరువాత సి.ఆనంద రావు
నియోజకవర్గం కరీంనగర్ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1960
గంభీరావుపేట్ గ్రామం, గంభీరావుపేట మండలం, రాజన్న సిరిసిల్ల జిల్లా, తెలంగాణ రాష్ట్రం
జాతీయత  భారతదేశం
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ
భారతీయ జనతా పార్టీ
నివాసం కరీంనగర్
వృత్తి రాజకీయ నాయకుడు

కటుకం మృత్యుంజయం తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 1983లో కరీంనగర్ నియోజకవర్గం శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహించాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

కటుకం మృత్యుంజయం 1981లో గంభీరావుపేట్ గ్రామా పంచాయతీ వార్డు సభ్యుడిగా పనిచేసి 1983లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో కరీంనగర్ నియోజకవర్గం నుండి సంజయ్‌ విచార్‌ మంచ్‌ పార్టీ (స్వతంత్ర) అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నలుమాచు కొండయ్య పై 20,510 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[2] మృత్యుంజయం కాంగ్రెస్ పార్టీలో చేరి 1992 నుండి 1995 వరకు గంభీరావుపేట సింగిల్‌ విండో చైర్మన్‌గా పనిచేసి ఉమ్మడి కరీంనగర్‌ సహకార బ్యాంక్‌ చైర్మన్‌గా ఎన్నికయ్యాడు. ఆయన 2020 మార్చిలో డీసీసీ అధ్యక్ష పదవికి, కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి 2020 జూన్ 5న గంభీరావుపేటలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరాడు.[3]

ఆయన 2024 మార్చి 30న బీజేపీ పార్టీకి రాజీనామా చేశాడు.[4]

మూలాలు

[మార్చు]
  1. Sakshi (10 February 2020). "దిగ్గజ నాయకులను అందించిన సహకార ఎన్నికలు". Archived from the original on 12 April 2022. Retrieved 12 April 2022.
  2. Sakshi (12 November 2018). "కరీంనగర్‌ కదనరంగం". Archived from the original on 13 April 2022. Retrieved 13 April 2022.
  3. The New Indian Express (6 June 2020). "Telangana Congress leader Katakam Mruthyunjayam joins BJP camp". Archived from the original on 13 April 2022. Retrieved 13 April 2022.
  4. Andhrajyothy (31 March 2024). "కాంగ్రెస్‌లోకి జోరుగా వలసలు". Archived from the original on 31 March 2024. Retrieved 31 March 2024.