బండి సంజయ్ కుమార్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బండి సంజయ్ కుమార్
Bandi Sanjay.jpeg
జననంజూలై 11, 1971
నివాసంకరీంనగర్, తెలంగాణ
జాతీయతభారతీయుడు
వృత్తిఎంపీ, కరీంనగర్‌
ప్రసిద్ధులురాజకీయ నాయకుడు
జీవిత భాగస్వామిఅపర్ణ
పిల్లలుభగీరథ్, సుముఖ్‌
తల్లిదండ్రులుశకుంతల, నర్సయ్య

బండి సంజయ్ కుమార్ ( జననం: జూలై 11, 1971 ) తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు.

బాల్యం[మార్చు]

ఈయన జులై 11, 1971 న శకుంతల, నర్సయ్య దంపతులకు జన్మించాడు.బండి సంజయ్ నాన్న ప్రభుత్వ టీచర్‌గా పని చేసేవాడు. సంజయ్ ను అయన తండ్రి ఒకటో తరగతిలోనే సరస్వతి శిశుమందిర్‌ లో చేర్పించాడు, అప్పటినుండే అయన ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవాడు. బండి సంజయ్ ఆర్‌ఎస్‌ఎస్‌లో ఘటన్‌ నాయక్‌గా, ముఖ్య శిక్షక్‌గా ప్రాథమిక విద్యా స్థాయిలోనే పనిచేశాడు. 1996లో బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ సురాజ్‌ రథయాత్ర సమయంలో అప్పటి మెట్‌పల్లి ఎమ్మెల్యే విద్యాసాగర్‌ రావు, బిజెపి సీనియర్ నాయకుడు వెంకయ్యనాయుడు ఆయనకు అద్వానీ రథయాత్ర వాహన శ్రేణికి ఇన్‌చార్జిగా నియమించారు.

ఎన్నికల నేపథ్యంలో అద్వానీ రథయాత్ర నిలిచిపోవడంతో బండి సంజయ్‌ను ఢిల్లీ సెంట్రల్‌ ఆఫీస్‌లో సహాయక్‌గా నియమించారు.[1][2]

రాజకీయ విశేషాలు[మార్చు]

బండి సంజయ్ అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్‌ (ABVP)లో కరీంనగర్ పట్టణ కన్వీనర్, పట్టణ ఉపాధ్యక్షునిగా, రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగానూ బాధ్యతలు నిర్వర్తించాడు. 1994-2003 మధ్యకాలంలో ది కరీంనగర్ కో-ఓపరేటివ్ అర్బన్ బ్యాంక్‌లో రెండు పర్యాయాలు డైరెక్టర్‌గా పనిచేశాడు. భారతీయ జనతా యువమోర్చా కరీంనగర్ పట్టణ ప్రధాన కార్యదర్శి, పట్టణ అధ్యక్షునిగా, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబెర్‌గా, రాష్ట్ర ఉపాధ్యక్షునిగా, నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబెర్‌గా, జాతీయ కార్యదర్శిగా వివిధ హోదాల్లో పార్టీలో పని చేశాడు. అనంతరం భారతీయ జనతా పార్టీ కేరళ,తమిళనాడు ఇంచార్జి‌గా బాధ్యతలు నిర్వహించాడు.

2005 లో ఏర్పడిన కరీంనగర్ నగర పాలక సంస్థ‌కు జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి 48వ డివిజన్ నుండి బిజెపి కార్పొరేటర్ మూడుసార్లు గెలిచాడు. సంజయ్ రెండు పర్యాయాలు కరీంనగర్ బిజెపి అధ్యక్షునిగా పనిచేశాడు. 2014 సాధారణ ఎన్నికల్లో కరీంనగర్ శాసనసభ బిజెపి అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యాడు, 2018లో జరిగిన తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ముందస్తు ఎన్నికల్లో కరీంనగర్ స్థానం నుండి భారతీయ జనతా పార్టీ తరపున పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి గంగుల కమలాకర్ పై 14,000 పైగా ఓట్ల తేడాతో తో ఓడిపోయాడు. 2019 లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరపున కరీంనగర్ లోక్ సభ స్థానం నుండి పోటీ చేసి టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి బి.వినోద్‌ కుమార్‌పై 87 వేలపైగా ఓట్ల తేడాతో భారీ విజయం సాధించాడు. బీజేపీ హైకమాండ్ ఆయనను 11 మార్చ్ 2020 న తెలంగాణ బీజేపీకి అధ్యక్షుడిగా నియమించింది. [3]

మూలాలు[మార్చు]

  1. https://www.andhrajyothy.com/elections/prajatantram_biography?PLID=324[permanent dead link]
  2. సాక్షి, హోం .. పాలిటిక్స్ (12 March 2020). "బీజేపీ బండికి.. సంజయుడే సారథి". Sakshi. Archived from the original on 12 మార్చి 2020. Retrieved 12 March 2020. Check date values in: |archivedate= (help)
  3. http://myneta.info/telangana2014/candidate.php?candidate_id=910