కట్ట కవిత

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కట్ట కవిత
Katta Kavitha.jpg
జననం
జాతీయతభారతీయురాలు
వృత్తిపాత్రికేయురాలు
తల్లిదండ్రులువెంకటేశం, భారతమ్మ

కట్ట కవిత మలిదశ తెలంగాణ ఉద్యమకారిణి, పాత్రికేయురాలు. ప్రజాశక్తి, వనితా టీవీ, మహా టీవీ, నవ తెలంగాణ వంటి ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలలో పనిచేసిన కవిత, 2017లో తెలంగాణ ప్రభుత్వం నుండి తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం అందుకుంది.[1] కోవిడ్ 19 మహమ్మారి సమయంలో లాక్‌డౌన్ కారణంగా మీడియాలో పనిచేస్తున్నవారికి ఇచ్చే నెట్‌వర్క్ ఆఫ్ ఉమెన్ ఇన్ మీడియా 2020 ఫెలోషిప్ ను అందుకుంది.[2]

జననం - విద్యాభ్యాసం[మార్చు]

కట్ట కవిత, వెంకటేశం భారతమ్మ దంపతులకు నల్గొండ జిల్లా, చిట్యాల లోని తాల్లయెల్లెంల గ్రామంలో జన్మించింది. గ్రామం నుంచి ఉన్నత విద్యను అభ్యసించిన అతి తక్కువ మంది మహిళల్లో కవిత ఒకరు. ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల్లోనే చదువు పూర్తి చేసింది. విద్యార్థిగా ఎస్‌.ఎఫ్‌.ఐ ఉద్యమంలో నల్లగొండ జిల్లా అధ్యక్ష బాధ్యతలు నిర్వహించింది.[3] ఉస్మానియా విశ్వవిద్యాలయం, తెలుగు విశ్వవిద్యాలయంలలో జర్నలిజం కోర్సులు పూర్తిచేసింది.

తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం అందుకుంటున్న కట్ట కవిత

వృత్తిజీవితం[మార్చు]

2004లో జర్నలిజంలోకి ప్రవేశించింది. ప్రజాశక్తి పత్రిక ద్వారా మీడియాలోకి వచ్చి, 13 సంవత్సరాలుగా పలు పత్రికలు, టీవీ మీడియాల్లోనూ జర్నలిస్టుగా సేవలు పనిచేస్తోంది. మహిళలు, సామాజిక న్యాయానికి సంబంధించిన సమస్యలపై వార్తలను రాసింది. ప్రతిభ ఉన్న మహిళలను ప్రపంచానికి పరిచయం చేసే ప్రయత్నం చేస్తూ, చాలామందిని వెలుగులోకి తెచ్చింది. నమస్తే తెలంగాణ పత్రికలో స్టాఫ్ రిపోర్టర్ గా, సాక్షి పత్రికలో సబ్ ఎడిటర్ గా పనిచేసింది.

తెలంగాణ ఉద్యమంలో[మార్చు]

మలిదశ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ కోసం జర్నలిస్ట్‌గా విధులు నిర్వహిస్తూనే ప్రత్యక్ష పోరాటంలోనూ తన సత్తా చాటింది. తెలంగాణ ఉద్యమకారులను అణచివేస్తున్న సమయంలో ఎదురుతిరిగి పోరాడింది. తెలంగాణ సాధనే ధ్యేయంగా అనేక కథనాలు సైతం రాసింది.

బహుమతులు - పురస్కారాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. నమస్తే తెలంగాణ. "ప్రతిభకు పురస్కారం!". Archived from the original on 9 March 2017. Retrieved 2 April 2017.
  2. NWM India (24 September 2020). "Kavitha Katta conferred Fourth NWMI Fellowship". Retrieved 28 December 2021.
  3. నమస్తే తెలంగాణ. "నలుగురు ఉత్తములు..!". Retrieved 5 April 2017.[permanent dead link]
  4. www.siasat.com. "INTERNATIONAL WOMEN'S DAY ON MARCH 8—TS GOVT TO HONOUR EMINENT WOMEN". www.siasat.com. Retrieved 28 December 2021.
  5. సాక్షి. "తెలంగాణ మహిళా మణులు వీరే." Retrieved 28 December 2021.
"https://te.wikipedia.org/w/index.php?title=కట్ట_కవిత&oldid=3437534" నుండి వెలికితీశారు