కదిలి పాపహరేశ్వర దేవాలయం
కదిలి పాపహరేశ్వర స్వామి దేవాలయం-దిలావార్ పూర్ | |
---|---|
భౌగోళికాంశాలు : | 19°07′N 78°12′E / 19.12°N 78.20°E |
పేరు | |
ఇతర పేర్లు: | జాతర |
ప్రధాన పేరు : | పాపహరేశ్వర స్వామి ఆలయం |
ప్రదేశం | |
దేశం: | భారతదేశం |
రాష్ట్రం: | తెలంగాణ |
జిల్లా: | నిర్మల్ |
ప్రదేశం: | దిలావర్ పూర్ ,కదిలి |
ఆలయ వివరాలు | |
ప్రధాన దైవం: | శివాలయం |
ఇతిహాసం | |
నిర్మాణ తేదీ: | 9 వ శతాబ్ధంలో |
సృష్టికర్త: | బాదామి చాళుక్యులు |
కదిలి పాపహరేశ్వరస్వామి దేవాలయం, తెలంగాణ రాష్ట్రం నిర్మల్ జిల్లా దిలావర్ పూర్ మండలంలోని కదిలి గ్రామానికి సమీపం లో ఉంది. సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో[1] సహజసిద్ధమైన ప్రకృతి ఒడిలో[2]అత్యంత ప్రాచిన మైన ఆలయం, బాదామి చాళుక్యుల కాలం నాటిది.ఈ ఆలయానికి 400 ఏళ్ల చరిత్ర ఉంది.[3][4]ఇచట దోషం నివారణ పూజలు చేయటం వలన అన్ని పాపాలు పొయి కోరిన కోరికలు నేరవేరుతాయిని అంటారు.
చరిత్ర
[మార్చు]దిలావర్ పూర్ మండలం కదిలి గ్రామంలో కొలువైన పాపహరేశ్వర స్వామి ఆలయానికి 400 ఏళ్ళ చరిత్ర ఉంది. ఇది అత్యంత పురాతన ఆలయం. ఈ ఆలయాన్ని బాదామి చాళుక్యులు క్రీ,శ 9 వ శతాబ్ధంలో నిర్మించి ఉంటారని అంటారు. ఆలయ నిర్మాణం ఇక్కడి శృంగి, బృంగీ విగ్రహాల శిల్పనైపుణ్యం, దేవుని మెడలో పాములు, కాపాలికం, రుద్రాక్షలు నడుముకు నగీషీలు దిద్దిన ఆభరణాలు, చెవికి కుండలాలు పరిశీలిస్తే ఆశ్చర్యం గొల్పేవిగా ఉన్నాయి. ఇక్కడ బ్రహ్మ, విష్ణు, అన్నపూర్ణ, పార్వతి, వినాయకుల విగ్రహాలు దేవాలయ ప్రాంగణంలో మనం చూడవచ్చు. కోనేరు ప్రక్కన ఉన్న చెట్టును ఆనుకొని ఉన్న విగ్రహాలలో శివ పార్వతుల విగ్రహాలు దర్శనమిస్తాయి. ఈ ఆలయానికి కాకతీయ రాజుల కాలంలో ఉన్న పద్మనాయక రాజుల సమయంలో కొన్ని మార్పులు జరిగినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఇక్కడి స్త్రీ విగ్రహాలు శిథిలమై ఉన్నాయి.
ఆలయ స్థల పురాణం
[మార్చు]ఈ ఆలయం స్థలం పురాణం ప్రకారం తొమ్మిదవ శతాబ్దం నాటి ఆ ఆలయం బాదామి చాళుక్యు రాజుల కాలానికి చేదింది. ఈ కదిలే శివాలయం నిర్మాణం దక్షిణ భారతదేశ హిందూ వాస్తుశిల్పి ప్రకారం నిర్మించబడినది. విశాల ప్రదేశం ఉన్న ఆలయం పురాతన రాతి కట్టడాలతో నిర్మితమైంది. దేవాలయం గర్భగుడిలో పానవట్టం పై చతురస్రాకారం లో శివలింగం ఉంది. భార్గవరాముడైన పరుశురాముడు ప్రతిష్టించిన శివలింగమని స్థల పురాణం చెబుతుంది. పురాణ నేపథ్యాన్ని పరిశీలిస్తే జమదగ్ని మహారుషి ప్రతీకారానికి పట్టుదలకు ,ఆవేశానికి ప్రతీక రేణుకాదేవి భర్త జమదగ్ని విశ్వాసమిత్రుని వలే ముక్కోపి కామధేనువు విషయంలో కార్తవీర్యార్జునునికి, జమదగ్ని కి మధ్యవైరముండేది. రాజు తన సైన్యంతో ఆశ్రమంలో విధ్వంసం సృష్టించి కామధేనువును దొంగలిస్తాడు.
జమదగ్ని,రేణుకల కుమారులు రువణ్యన్ సుహూత్ర వసువివస్వాన్, పరుశురాముడు వీరిలో పరుశురాముడు కోపోద్రికుడై ఆక్షత్రం చేస్తానని ప్రతినబూని నరమేధం ప్రారంభింంచి క్షత్రియరాజులను సంహరిస్తాడు. ఈ యుద్ధాల వల్ల ఆశయం నెరవేరకపోయినా, నిరాశ మాత్రం మిగిలింది.యోగసాధన చేసినా ఫలితం లేకపోయింది. పాపాలను ప్రాయశ్చిత్తం చేసుకోవాలనే తపనతో ముప్పయి రెండు దేవాలయాలను ,అందులో శివలింగాలను ప్రతిష్టించి ప్రశాంతత పొందినట్లు చివరి శివలింగం కదిలిలో నిలిపి పశ్చిమ సముద్రంవైపు వెళ్లిపోయాడని బ్రహ్మండపురాణం చెబుతుంది.
ఆలయ విశేషం
[మార్చు]ఈ ఆలయం ముఖద్వారం పడమర దిశగా ఉండటం మరో విశేషం.ఆలయ సమీపంలో సప్త గుండాలతో పాటు 18 రకాల చెట్లతో కూడిన వటవృక్షం ఉంది.ఇక్కడికి వచ్చే భక్తులు సప్తగుండాలలో స్నానాలు ఆచరించి వటవృక్షం చుట్టూ ప్రదక్షిణలు చేసి స్వామి వారిని దర్శించుకుంటారు.
మహాశివరాత్రి ఉత్సవాలు
[మార్చు]ఈ కదిలే శివాలయంలో మహాశివరాత్రి పండుగ సందర్భంగా ఆలయంలో మూడు రోజులు ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు[5]. మొదటి రోజున సాయంత్రం గణపతి దేవుని పూజలు చేసి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.మహాశివరాత్రి రోజున స్వామి వారికీ అభిషేకాలు అనంతరం అదేరోజు రాత్రి వెళ్ళలో శివపార్వతుల కల్యాణోత్సవం అంగరంగా వైభవంగా జరుగుతుంది.ఆలయం చుట్టూ స్వామి వారి పల్లకి సేవ ఉంటుంది. నిర్మల్ జిల్లా వివిధ మండలాల నుండి భక్తులు స్వామి దర్శనం కోసం భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకోని పూజలు చేసి మొక్కులు తీర్చుకుంటారు. ఈ ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. పర్వదినాన్ని పురస్కరించుకొని ఉదయం నుంచే భక్తులు ఆలయాల వద్ద బారులు తీరుతారు.
కదిలే శివుడు
[మార్చు]ఈ ఆలయంలో గుట్టలు కోనేరు కు ఆనుకుని ఏటవాలుగా ఉంటాయి.నీటి ఊటలు సన్నని ధారగా ప్రవహిస్తాయి.అన్ని వైపుల నుండి జలధారలుండటంతో పానవట్టం చుట్టు నీటిబుగ్గగా ఏర్పడి శివలింగం కోన్ని మార్లు కదులుతుంది.నీటి బుగ్గలు ఏర్పడడం ప్రాకృతికంగా జరిగే వింత మార్పు అని భక్తుల నమ్మకం.అందుకే ఈ కదిలి పాపహరేశ్వర ఆలయానికి కదిలే శివుడు కదిలే శివాలయం అని పేరుంది.అందుకే స్థానికులు ఇక్కడ శివుడు స్థిరంగా ఉండరని అంటారు.
ఎలా చేరుకోవచ్చు
[మార్చు]ఈ ఆలయాన్ని మంచిర్యాల, ఆదిలాబాద్, ఆసిఫాబాదు, నిజామాబాద్, ఆర్మూర్, కరీంనగర్, మహారాష్ట్రలోని సరిహద్దు జిల్లాల నుండి వచ్చే భక్తులు నిర్మల్ చేరుకోవాలి. నిర్మల్ నుండి 18 కిలోమీటర్లు దూరంలో దిలావర్ పూర్ మండలం ఉంది. అచట నుండి బైకులో గాని, ఇతర ప్రైవేటు వాహనాల్లో వెళ్ళి కదిలి పాపహరేశ్వర స్వామి ఆలయాన్ని చేరుకో వచ్చు.
మూలాలు
[మార్చు]- ↑ "సహ్యాద్రి పర్వత పంక్తుల్లో కొలువైన కదిలి పాపహరేశ్వరం." MyindMedia. 2023-11-01. Retrieved 2024-10-10.
- ↑ Shireesha (2022-03-01). "కొండలు, కోనల్లో కొలువైన కదిలే పాపహరేశ్వర ఆలయం.. దర్శించుకుంటే..." www.hmtvlive.com. Retrieved 2024-10-10.
- ↑ Bharat, E. T. V. (2024-03-07). "400 ఏళ్ల చరిత్ర కలిగిన పాపహరేశ్వరాలయం - ఇక్కడ ఏం కోరినా నెరవేరుతుందట". ETV Bharat News. Retrieved 2024-10-10.
- ↑ "Welcome to Official Website of Telangana Tourism - Magnificent Telangana". tourism.telangana.gov.in. Retrieved 2024-10-10.
- ↑ "పరుశరాముడికే పాపవిమోచనం.. శతాబ్ధాల చరిత్ర ఈ ఆలయం సొంతం!". Samayam Telugu. Retrieved 2024-10-10.