కధా రచన (పుస్తకం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కధా రచన
పటం కతలు పుస్తక ముఖచిత్రం
కధా రచన పుస్తక ముఖచిత్రం
కృతికర్త: కె. ధశరథ్
సంపాదకులు: మామిడి హరికృష్ణ
దేశం: భారత దేశము
భాష: తెలుగు
విభాగం (కళా ప్రక్రియ): సినిమా కథ రచన
ప్రచురణ: సంచాలకులు, తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ
విడుదల: జూన్, 2022
పేజీలు: 134
ఐ.ఎస్.బి.ఎన్(ISBN): 978-81-954118-3-2


కధా రచన అనేది తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ప్రచురించిన పుస్తకం. సినిమా రచనపై అవగాహన కలిగించడంకోసం సినీ దర్శక రచయిత కె. దశరథ్ ఈ పుస్తకాన్ని రాశాడు. సినీ దర్శకుడు సుకుమార్ ఈ పుస్తకానికి ముందుమాట రాయగా, తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డా. మామిడి హరికృష్ణ సంపాదకులుగా వ్యవహరించాడు.[1]

పుస్తక విశేషాలు[మార్చు]

ఒక సినిమా ప్రేక్షకుల మనసుని హత్తుకోవాలన్న, వాళ్ళు గుర్తుపెట్టుకోవాలన్నా, విజయం సాధించాలన్నా చక్కని స్క్రీన్ ప్లే, నేరేషన్, స్టొరీ టెల్లింగ్ విషయాల్లో ఔత్సాహికులకు ఉపయోగపడేలా, సినిమా కథా రచనలో కొన్ని మెలకువలు దానిలో ఉండే వివిధ దశలతో ఈ పుస్తకం రాయబడింది. మంచి స్క్రీన్ ప్లే గురించి తెలుగులో ఒక పుస్తకం ఉండాలనే తపనతో దాదాపు 14 నెలలు శ్రమించి రచయిత ఈ పుస్తకం రాశాడు. ఒక రచయిత, దర్శకుడు యూనిక్‌గా ఎలా ముందుకు వెళ్ళాలనేది ఇందులో వుంటుంది.[2]

రచనలో మెళకువలు సూచించడంతోపాటు చాలా సరళమైన భాషలో అర్థమయ్యే పలు ప్రముఖ సినిమా ఉదాహరణణతో స్క్రీన్ రైటింగ్ ఈక్వేషన్ ని రచయిత సరళంగా అందించాడు. ఇందులో స్క్రీన్ ప్లే రచన గురించి చెప్పడమే కాక దాన్ని రాశాక పరిశ్రమలో ప్రాక్టికాలిటీని కూడా పరిచయం చేశాడు. కథా రచనలో ఉండే ఎన్నో మౌలిక అంశాలని, అంతర్లీన విశేషాలను ఎంతో సాధికారికంగా సులభ శైలిలో ఈ పుస్తకం ద్వారా అందించాడు. కథకు సంబంధించి మనకు తెలుసు అనిపించిన ఎన్నో అంశాలను సైతం సరికొత్త కోణాన్ని ఆవిష్కరించాడు. ఎన్నో దశాబ్దాల నుండి ధశరథ్ సముపార్జించిన సినిమా అనుభవం, తను అనుకుంటున్న ఆలోచనలన్నింటినీ క్రోడీకరించి ఒక చక్కని ఆచరణాత్మక ఆలోచనలను గ్రంథంగా రూపొందించాడు. ఈ పుస్తకంలో సినిమాకు సంబంధించి, ముఖ్యంగా కథా రచనకు సంబంధించి ఎన్నో విలువైన విషయాలు అందించాడు.

ఆవిష్కరణ[మార్చు]

2023 జనవరి 9న హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో ఈ పుస్తకావిష్కరణ జరిగింది. తెలంగాణ రాష్ట్ర ఐటీ-పురపాలక శాఖామంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఈ పుస్తకాన్ని ఆవిష్కరించగా, దర్శకులు వివి వినాయక్, హరీష్ శంకర్, నాగ్ అశ్విన్, విఎన్ ఆదిత్య, వై. కాశీ విశ్వనాథ్, మహేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.[3]

మూలాలు[మార్చు]

  1. K.DASARADH (2022-01-01). KATHA RACHANA (in Telugu). MAIN STREAM MOVIES RESEARCH FOUNDATION. ISBN 978-81-954118-3-2.{{cite book}}: CS1 maint: unrecognized language (link)
  2. Nagaraju, Pandari (2023-01-09). "దశరథ్ 'కథా రచన' పుస్తకాన్ని ఆవిష్కరించిన మంత్రి కెటిఆర్". Mana Telangana. Archived from the original on 2023-01-10. Retrieved 2023-01-10.
  3. Telugu, 10TV; Nill, Saketh (2023-01-10). "KTR : కంటెంట్ ఉన్న సినిమా దేశం అంతా ఆడుతుంది.. మరి కంటెంట్ ఉన్న నాయకుడు ఎందుకు హిట్ కాడు??". 10TV Telugu. Archived from the original on 2023-01-10. Retrieved 2023-01-10.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)