కన్నెగంటి తిరుమలదేవి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కన్నెగంటి తిరుమలదేవి
కన్నెగంటి తిరుమలదేవి
జననం (1972-10-18) 1972 అక్టోబరు 18 (వయసు 51)
కొత్తగూడెం, భద్రాద్రి, తెలంగాణ
నివాసంహైదరాబాదు, తెలంగాణ, భారతదేశం
జాతీయతభారతీయురాలు
రంగములుఇమ్యునాలజిస్ట్
చదువుకున్న సంస్థలుఉస్మానియా విశ్వవిద్యాలయం
ప్రసిద్ధిస్టెమ్ సెల్ థెరపీపై పరిశోధన

కన్నెగంటి తిరుమలదేవి, తెలంగాణకు చెందిన మహిళా శాస్త్రవేత్త. ఇమ్యునాలజిస్ట్ గా, రోజ్ మేరీ థామస్ ఎండోడ్ చైర్ గా, ఇమ్యునాలజీ విభాగం వైస్ చైర్ గా, సెయింట్ జూడ్ చిల్డ్రన్స్ రీసెర్చ్ హాస్పిటల్‌లో సభ్యురాలిగా బాధ్యతలు నిర్వర్తిస్తోంది.[1] ఆరోగ్యం, వ్యాధిలో ఎన్ఎల్ఆర్ ప్రోటీన్లు, ఇన్‌ఫ్లమేసమ్‌ల పాత్రపై ప్రాథమిక దృష్టితో సహజమైన రోగనిరోధక శక్తి, తాపజనక కణాల మరణం వంటి అంశాలలో పరిశోధనలు చేసింది.[1]

జననం, విద్య[మార్చు]

తిరుమలదేవి 1972, అక్టోబరు 18న తెలంగాణ రాష్ట్రం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం పట్టణంలో జన్మించింది.[2] కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలోని కొత్తగూడెంలోని సింగరేణి కాలరీస్ మహిళా కళాశాల నుండి అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ (రసాయన శాస్త్రం, జంతు శాస్త్రం, వృక్షశాస్త్రం) పూర్తిచేసింది.[3][4] ఆ తరువాత హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఎంఎస్సీ, పిహెచ్.డి. పూర్తిచేశాడు.[4]

వృత్తిరంగం[మార్చు]

తిరుమలదేవి పిహెచ్‌డి విద్యార్థిగా మొక్కల వ్యాధికారక కారకాలు, ఫంగల్ టాక్సిన్‌లను అధ్యయనం చేసే పరిశోధన ప్రారంభించింది.[5] తరువాత విస్కాన్సిన్ విశ్వవిద్యాలయం, ఒహియో రాష్ట్ర విశ్వవిద్యాలయంలో పోస్ట్‌డాక్టోరల్ ఫెలోషిప్‌లు చేసి శిలీంధ్ర జన్యుశాస్త్రం, మొక్కల సహజమైన రోగనిరోధక శక్తిని అధ్యయనం చేసింది.[3][4] మిచిగాన్‌ విశ్వవిద్యాలయంలో క్షీరదాల సహజమైన రోగనిరోధక శక్తిని అధ్యయనం చేసింది.[3][4] 2007లో సెయింట్ జూడ్ చిల్డ్రన్స్ రీసెర్చ్ హాస్పిటల్‌లో ఇమ్యునాలజీ డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్ మెంబర్‌గా చేరింది, అక్కడ ఇన్‌ఫ్లమేసమ్‌లు-సెల్ డెత్‌పై అధ్యయనం చేయడంపై దృష్టి సారించింది.[1][4] 2013లో పూర్తి సభ్యురాలిగా పదోన్నతి పొందింది. 2016లో ఇమ్యునాలజీ విభాగానికి వైస్ చైర్‌గా మారింది, 2017లో రోజ్ మేరీ థామస్ ఎండోడ్ చైర్‌ను పొందింది.

సన్మానాలు[మార్చు]

 • అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఇమ్యునాలజీ-BD బయోసైన్సెస్ ఇన్వెస్టిగేటర్ అవార్డు (2015) [6]
 • విన్స్ కిడ్ మెమోరియల్ మెంటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు (2015)[1]
 • సొసైటీ ఫర్ ల్యూకోసైట్ బయాలజీ అత్యుత్తమ మాక్రోఫేజ్ పరిశోధకుడు డాల్ఫ్ ఓ. ఆడమ్స్ అవార్డు (2017)[7][8]
 • అమెరికన్ సొసైటీ ఫర్ మైక్రోబయాలజీ ఎలి లిల్లీ అండ్ కంపెనీ-ఎలాంకో రీసెర్చ్ అవార్డ్ (2017)[8]
 • ఇంటర్‌ఫెరాన్, సైటోకిన్ రీసెర్చ్ సేమౌర్ & వివియన్ మిల్‌స్టెయిన్ అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్ (2018)[1][5]
 • క్లారివేట్స్/వెబ్ ఆఫ్ సైన్స్ లిస్ట్ ఆఫ్ హైలీ సైటెడ్ పరిశోధకుల (2017, 2018, 2019, 2020, 2021)[1][9][10][11][12]
 • ఎన్ఐహెచ్ ఆర్35 అత్యుత్తమ ఇన్వెస్టిగేటర్ అవార్డు (2020)[13][14]
 • అమెరికన్ అకాడమీ ఆఫ్ మైక్రోబయాలజీలో ఫెలోషిప్‌కి ఎన్నిక, అమెరికన్ సొసైటీ ఫర్ మైక్రోబయాలజీ (2021)[15]

మూలాలు[మార్చు]

 1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 "Thirumala-Devi Kanneganti, PhD". www.stjude.org. Retrieved 2022-03-29.
 2. "కరోనాపై పోరులో.. తెలుగు బిడ్డ". m.andhrajyothy.com. 2020-11-22. Archived from the original on 2022-03-29. Retrieved 2022-03-29.
 3. 3.0 3.1 3.2 Olsen, Patricia R. (2017-10-27). "After Witnessing Illness in India, She Seeks Ways to Fight It". The New York Times. ISSN 0362-4331. Retrieved 2022-03-29.
 4. 4.0 4.1 4.2 4.3 4.4 "Thirumala-Devi Kanneganti: Immersed in Immunology". The Scientist Magazine. Retrieved 2022-03-29.
 5. 5.0 5.1 "Thirumala-Devi Kanneganti". The Milstein Awards. 2018-06-29. Archived from the original on 2022-05-26. Retrieved 2022-03-29.
 6. "AAI-BD Biosciences Investigator Award". The American Association of Immunologists. Retrieved 2022-03-29.
 7. "Dolph O. Adams Award". Society for Leukocyte Biology. Retrieved 2022-03-29.
 8. 8.0 8.1 Geiger, Terrence (2017-10-19). "Thirumala-Devi Kanneganti, PhD, honored for discoveries in immunology". St. Jude Progress. Retrieved 2022-03-29.
 9. "Highly Cited Researchers".
 10. "St. Jude researchers among the most highly cited in 2019". www.stjude.org (in ఇంగ్లీష్). Retrieved 2022-03-29.
 11. "St. Jude researchers are among the most highly cited scientists in the last decade". www.stjude.org (in ఇంగ్లీష్). Retrieved 2022-03-29.
 12. Kumar, Ruma. "St. Jude scientists make prestigious list of Highly Cited Researchers". www.stjude.org (in ఇంగ్లీష్). Retrieved 2022-03-29.
 13. "St. Jude immunologist Thirumala-Devi Kanneganti, Ph.D., receives NCI Outstanding Investigator Award". www.stjude.org (in ఇంగ్లీష్). Retrieved 2022-03-29.
 14. "NCI Outstanding Investigator Award Recipients - National Cancer Institute". www.cancer.gov (in ఇంగ్లీష్). 2015-10-14. Retrieved 2022-03-29.
 15. "65 Fellows Elected into the American Academy of Microbiology". ASM.org (in ఇంగ్లీష్). Retrieved 2022-03-29.