Jump to content

కన్నెమనసులు

వికీపీడియా నుండి
(కన్నె మనసులు నుండి దారిమార్పు చెందింది)
కన్నెమనసులు
(1966 తెలుగు సినిమా)
దర్శకత్వం ఆదుర్తి సుబ్బారావు
రచన ఆత్రేయ
కథ ముళ్ళపూడి వెంకటరమణ
తారాగణం రాంమోహన్,
ఘట్టమనేని కృష్ణ,
సంధ్య,
సుకన్య,
ప్రసన్నరాణి,
గుమ్మడి వెంకటేశ్వరరావు,
సూర్యకాంతం,
తుంగల చలపతిరావు,
కె.వి.చలం
సంగీతం కె.వి.మహదేవన్,
పుహళేంది (సహాయం)
నేపథ్య గానం ఘంటసాల వెంకటేశ్వరరావు,
పి.సుశీల,
జమున
సంభాషణలు ముళ్ళపూడి వెంకటరమణ
కూర్పు టి.కృష్ణ
నిర్మాణ సంస్థ బాబు మూవీస్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

ఈ చిత్రం జులై 22,1966 విడుదలైయింది.[1] కన్నెమనసులు ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో, రామ్మోహన్, కృష్ణ, సంధ్య, సుకన్య తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన 1966 నాటి తెలుగు చలనచిత్రం. సినిమాలో హీరోహీరోయిన్లుగా దాదాపు ఐదుగురు కొత్త నటులకు ఆదుర్తి సుబ్బారావు అవకాశం ఇచ్చారు. ఆ కొత్తనటుల్లో ఘట్టమనేని కృష్ణ తర్వాతి కాలంలో వందలాది చిత్రాల్లో నటించి సూపర్ స్టార్ గా నిలిచారు.

తారాగణం

[మార్చు]
  • రామ్మోహన్
  • ఘట్టమనేని కృష్ణ
  • సంధ్యారాణి
  • సుకన్య
  • గుమ్మడి వెంకటేశ్వరరావు
  • ఎం.వి.చలపతిరావు
  • సూర్యకాంతం
  • ప్రసన్న రాణి
  • కె.వి.చలం
  • తుంగల చలపతిరావు

సాంకేతిక వర్గం

[మార్చు]
  • దర్శకుడు: ఆదుర్తి సుబ్బారావు
  • కధ: ముళ్ళపూడి వెంకటరమణ
  • మాటలు: ముళ్ళపూడి వెంకటరమణ
  • సంగీతం: కె వి మహదేవన్
  • గీత రచయితలు: ఆచార్య ఆత్రేయ, దాశరథి కృష్ణమాచార్య, కొసరాజు రాఘవయ్య చౌదరి, ఆరుద్ర
  • నేపథ్య గాయకులు: ఘంటసాల వెంకటేశ్వరరావు, పులపాక సుశీల, కె.జమునారాణి, టి.కృష్ణ
  • ఎడిటింగ్: టి.కృష్ణ
  • నిర్మాత: సి.సుందరం
  • నిర్మాణ సంస్థ: బాబూ మూవీస్
  • విడుదల:22:07:1966.

నిర్మాణం

[మార్చు]

అభివృద్ధి

[మార్చు]

ఈ సినిమా కథను ముళ్ళపూడి రాశారు.

పాటలు

[మార్చు]
  1. ఈ ఉదయం నా హృదయం పురులు విరిసి ఆడింది పులకరించి పాడింది - ఘంటసాల, రచన: ఆత్రేయ
  2. ఓ..హృదయం లేని ప్రియురాలా వలపులు రగిలించావు పలుకకా - ఘంటసాల, రచన:ఆత్రేయ
  3. ఓహో తమరేనా చూడవచ్చారు చూసి ఏం చేస్తారు ఓ భామా అయ్యో రామా - ఘంటసాల , రచన: ఆరుద్ర
  4. వలపులో వద్దు వద్దు వద్దంటు పడ్డానులే కలలలో రా రమ్మంటు పిలిచావులే - పి.సుశీల, రచన: దాశరథి
  5. అమ్మలగన్నయమ్మ గాజుల , వెంకటరావు, పి సుశీల , కె.జమునారాణి బృందం , రచన: దాశరథి.
  6. ఓహో తమరేనా చూడవచ్చారు , పి సుశీల బృందం, రచన: ఆరుద్ర
  7. చిత్రంగాఉంది ఈవేళ , పి.సుశీల , రచన:దాశరథి
  8. సుక్కలాంటి సిన్నోడు షోకు , పీ సుశీల, కె.జమునారాణి బృందం, రచన: కొసరాజు
  9. హాయ్ హాయ్ ఏమిటిది , పి.సుశీల, టి.కృష్ణ, రచన:దాశరథి కృష్ణమాచార్య.

వనరులు

[మార్చు]
  • ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాదు - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
  • సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుంచి.
  • డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.

మూలాలు

[మార్చు]
  1. మద్రాసు ఫిలిం డైరీ (2017-07-08). 1966 లో విడుదలైన చిత్రలు. గోటేటి బుక్స్. p. 19.