కన్హయ్య లాల్ మిశ్రా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పండిట్ కన్హయ్య లాల్ మిశ్రా
అడ్వకేట్ జనరల్ (ఉత్తరప్రదేశ్) ఇండియా
In office
22 మే 1952 – 9 మార్చి 1969
వ్యక్తిగత వివరాలు
జననం(1903-08-31)1903 ఆగస్టు 31
మౌ, యునైటెడ్ ప్రావిన్సెస్ ఆఫ్ ఆగ్రా, ఔద్, బ్రిటిష్ ఇండియా
మరణం1975 అక్టోబరు 14(1975-10-14) (వయసు 72)
అలహాబాద్, ఉత్తర ప్రదేశ్, భారతదేశం
జాతీయతభారతీయుడు

కన్హయ్య లాల్ మిశ్రా ( 1903 ఆగస్టు 31 - 1975 అక్టోబరు 14) ఒక భారతీయ న్యాయవాది. స్వాతంత్ర్య సమరయోధుడు. అతను 1952 నుండి 1969 వరకు ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర అడ్వకేట్ జనరల్‌గా పనిచేశాడు.[1]

జీవిత చరిత్ర

[మార్చు]

కన్హయ్య లాల్ మిశ్రా ఉత్తరప్రదేశ్‌లోని అజంగఢ్ జిల్లాలోని మరియాద్‌పూర్ (ప్రస్తుతం మౌలో ఉంది) బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. అతను శ్రీ కృష్ణ జన్మాష్టమి రోజున జన్మించాడని కన్హయ్య లాల్ అని నామకరణం చేసారు అతని తల్లిదండ్రులు. అజంగఢ్ బార్‌లో సివిల్, క్రిమినల్ లాయర్ అయిన బైద్నాథ్ మిశ్రా సంతానం.. ఒక కుమార్తె, నలుగురు కుమారులలో పెద్ద వాడు.  బైద్నాథ్ మిశ్రా సుదీర్ఘకాలం ఎం.ఎల్.సిగా కూడా సేవలు అందించాడు.

కన్హయ్య లాల్ మిశ్రా రెండు వివాహాలు చేసుకున్నాడు. అతని మొదటి వివాహం సావిత్రి దేవితో జరిగింది, ఆమెకు ఇద్దరు పిల్లలు శాంతి (కుమార్తె), విజయ్ ప్రకాష్ (కొడుకు) ఉన్నారు. సావిత్రీ దేవి మరణం తరువాత, అతను గాయత్రీ దేవిని వివాహం చేసుకున్నాడు. ఆమెకు రవీంద్ర ప్రకాష్ (కొడుకు), జస్టిస్ అజయ్ ప్రకాష్ (కొడుకు), జ్యోతి (కుమార్తె), ప్రీతి (కుమార్తె), రంజన్ (కొడుకు), మునీంద్ర (కొడుకు) [2] సంతానం. గాయత్రీ దేవి 1969 ఏప్రిల్ 29న మరణించింది.

అడ్వకేట్ జనరల్ యు.పి. (భారతదేశం)

[మార్చు]

1937లో భారత ప్రభుత్వ చట్టం, 1935 ప్రకారం ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ద్వారా ప్రావిన్స్‌లో మొదటి బాధ్యతాయుతమైన ప్రతినిధి ప్రభుత్వం ఏర్పడింది. అప్పటినుంచి ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి ముగ్గురి పదవి కాలం ముగిసిన తరువాత కన్హయ్య లాల్ మిశ్రా నాల్గవ అడ్వకేట్ జనరల్ గా బాధ్యతలు చేపట్టారు. 1952 నుండి 1969 వరకు.. సుదీర్ఘంగా 17 సంవత్సరాల పాటు అతను ఈ పదవిలో ఉన్నారు. ఈ కాలంలో ఎన్ని రాజకీయ పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా అతనే కొనసాగడం 2015 అక్టోబరు నాటి వరకు ఒక రికార్డు. ఆయన 1969లో అడ్వకేట్ జనరల్ పదవికి రాజీనామా చేశారు. ఇదే సంవత్సరం అతని భార్య మరణించింది.

పండిట్ కన్హయ్య లాల్ మిశ్రా కంటే ముందు ఉత్తరప్రదేశ్ అడ్వకేట్ జనరల్ గా వ్యవహరించిన వారు వరుసగా.. 1937లో డాక్టర్ నారాయణ్ ప్రసాద్ ఆస్థాన, 1942లో మహమ్మద్ వాసిం (1947లో పాకిస్తాన్ మొదటి అడ్వకేట్ జనరల్), 1947లో సర్ పీరీ లాల్ బెనర్జీ.

కాలచక్రం

[మార్చు]

కన్హయ్య లాల్ మిశ్రా బనారస్ (వారణాసి) లో థియోసాఫికల్ స్కూల్‌లో డాక్టర్ శ్రీమతి అనీ బిసెంట్ దగ్గర చదువుకున్నాడు.

1925 - ఆర్థిక శాస్త్రంలో ఆనర్స్‌తో పట్టభద్రుడయ్యాడు.

1926 - ఇండియన్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్‌కు హాజరై, ఇంగ్లీష్ పేపర్‌లో 150/150 సాధించి తిరుగులేని రికార్డు సాధించారు. కానీ

విద్యార్థి దినోత్సవం నాటి స్వాతంత్ర్య ప్రసంగాలు, గాంధేయవాదం కారణంగా అతను ఎంపిక చేయబడలేదు.

1927 - న్యాయ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి జిల్లా బార్‌లో చేరారు.

1930 - అక్టోబరులో అలహాబాద్ హైకోర్టుకు బదిలీపై వెళ్లాడు. అతనికి హిందీ, ఇంగ్లీషు, ఉర్దూ భాషలపై అసాధారణమైన పట్టు ఉంది.

1942 - భారత స్వాతంత్ర్య పోరాట సమయంలో నైని సెంట్రల్ జైలులో జవహర్‌లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, పి.డి.టాండన్.. ఇతరులతో సహా కన్హయ్య లాల్ మిశ్రా ఖైదు చేయబడ్డాడు.[3]

1951 - న్యాయమూర్తి పదవికి అవకాశమున్నా అయిష్టం చూపారు. అయినా న్యాయవాద రంగంలో ఖ్యాతిని గడించారు.

1952 - ఉత్తరప్రదేశ్ అడ్వకేట్ జనరల్ గా నియమితులయ్యారు. అధికారంలోకి ఏ రాజకీయ పార్టీ వచ్చినా 1969 మార్చి 9 వరకు నిరాటంకంగా కొనసాగారు.

1955 - సుప్రీం కోర్ట్ జడ్జిషిప్ అవకాశాన్ని వదులుకుని అతను ప్రజా జీవితంలో ఉండాలని, వారికి పెద్ద ఎత్తున సేవ చేయాలని కోరుకున్నాడు.

1969 - యు.పి. అడ్వకేట్ జనరల్ గా రాజీనామా చేశారు.

మూలాలు

[మార్చు]
  1. http://www.allahabadhighcourt.in/event/MyPredecessorsinOfficeKLMisra.pdf
  2. Misra, Munindra (3 June 2014). Pt. Kanhaiya Lal Misra - My Father (First ed.). India: Partridge Publishing. p. 202. ISBN 978-1482818567.
  3. http://pdtandon.in/?page_id=1309