Jump to content

కపిల్ శర్మ

వికీపీడియా నుండి
కపిల్ శర్మ

కపిల్ శర్మ
జననం (1981-04-02) 1981 ఏప్రిల్ 2 (వయసు 43)
క్రియాశీలక సంవత్సరాలు 2007 - ప్రస్తుతం

కపిల్ శర్మ (జననం 1981 ఏప్రిల్ 2)[1] ప్రముఖ భారతీయ స్టాండప్ కమెడీయన్, నటుడు, టివి వ్యాఖ్యాత, నిర్మాత. జూన్ 2013 నుంచి జనవరి 2016 వరకు భారత అతిపెద్ద కామెడీ షో కామెడీ నైట్స్ విత్ కపిల్ కు వ్యాఖ్యాతగా వ్యవహరించారు ఆయన. 2013లో ఫోర్బ్స్ సంస్థ భారతీయ సెలబ్రటీ జాబితాలో 93వ వ్యక్తిగా పేర్కొంది. 

2013లో ఎంటర్టైన్మెంట్ క్యాటగిరీలో సి.ఎన్.ఎన్-ఐబిఎన్ కపిల్ ను ఇండియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుతో సత్కరించింది.[2] ది ఎకనమిక్ టైమ్స్ 2015లో మోస్ట్ ఎడ్మైర్డ్ ఇండియన్ పర్సనాలిటీ జాబితాలో 3వ ర్యాంకు ఇచ్చింది.[3]  భారత ప్రధాని నరేంద్రమోడి కపిల్ ను స్వచ్ఛ  భారత్ అభియాన్ కు ఎంపిక చేశారు.[4] సెప్టెంబరు 2015లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కపిల్ ను రాష్ట్రపతి భవన్ కు పిలిచి స్వచ్ఛ్ భారత్  అభియాన్ గురించి వివరించారు.[5] 2015 సెప్టెంబరు 25న విడుదలైన కిస్ కిస్కో ప్యార్ కరూన్ సినిమాతో బాలీవుడ్ తెరంగేట్రం చేశారు కపిల్.[6][7]

తొలినాళ్ళ జీవితం

[మార్చు]

కపిల్ శర్మ పంజాబ్ రాష్ట్రంలోని అమృత్ సర్లో పంజాబీ హిందూ  కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి జీతేంద్ర కుమార్ పంజాబ్ పోలీస్ శాఖలో కానిస్టేబుల్ గా పనిచేసేవారు. తల్లి గృహిణి.[8] క్యాన్సర్ తో బాధపడుతున్న ఆయన తండ్రి ఢిల్లీలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 2004లో మరణించారు.[9] ఆయన సోదరుడు అశోక్ కుమార్ కూడా కానిస్టేబులే. అమృత్ సర్ లోని హిందూ కళాశాలలో చదువుకున్నారు కపిల్

కెరీర్

[మార్చు]

ఎంహెచ్ వన్ లో హస్దే హసాందే రహో షోలో కనిపించారు కపిల్. ది గ్రేట్ ఇండియన్ లాఫర్ చాలెంజ్ కామెడీ షోతో మొట్టమొదటి విజయం సాధించారు ఆయన. ఆ తరువాత 9 రియాలిటీ షోల్లో విజేతగా నిలిచారు కపిల్. 2007లో ఒక షోలో 10లక్షల నగదు బహుమతి గెలుచుకున్నారు.[10]

ఆ తరువాత సోనీ ఎంటర్టైన్మెంట్ టెలివిజన్ లో కామెడీ సర్కస్ లో చేశారు.[11] కామెడీ సర్కస్ లో 6 సీజన్లు గెలుచుకున్నారు కపిల్.[12] ఝలక్ ధికలాజా సీజన్ 6, కామెడీ షో చోటే మియాన్ లకు  వ్యాఖ్యాతగా వ్యవహరించారు.[13][14][15] ఉస్తాదోం కా ఉస్తాద్ షోలో కూడా పాల్గొన్నారు కపిల్

2013లో కలర్స్ లో తన స్వంత నిర్మాణ సంస్థ కె9 ప్రొడక్షన్స్ నిర్మాణంలో కామెడీ నైట్స్ విత్ కపిల్ షో మొదలు పెట్టారు కపిల్.[16]

2013లో సి.ఎన్.ఎన్-ఐబిఎన్ కపిల్ ను ఇండియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుతో సత్కరించింది. ఈ అవార్డును అమోల్ పాలేకర్ చేతి నుండి  అందుకున్నారు ఆయన.[17] 2014 లోక్ సభ ఎన్నికలలో ఢిల్లీ ఎన్నికలు కమిషన్ కు కపిల్ ను బ్రాండ్ అంబాసిడర్ గా నియమించింది.[18]

కరణ్ జోహార్ తో కలసి 2015 ఫిలింఫేర్ అవార్డు ఫంక్షన్ కు వ్యాఖ్యాతగా  వ్యవహరించారు కపిల్.[19] సెలెబ్రటీ క్రికెట్ లీగ్ 2014 4వ సీజన్ కు ప్రెజెంటర్ గా వ్యవహరించారు ఆయన.[20] 17 ఆగస్టున మొదలైన కౌన్ బనేగా కరోడ్ పతీ సీజన్ 8కు ఆయన మొదటి అతిథిగా పాల్గొన్నారు.[21] ది అనుపమ్ ఖేర్ షోకు కూడా అతిథిగా వచ్చారు కపిల్.[22]

యశ్ రాజ్ ఫిలింస్ నిర్మాణంలో తన మొదటి సినిమా చేయడానికి మొదలుపెట్టారు, కానీ ఆ సినిమా నిర్మాణదశలోనే ఆగిపోయింది.[23]   కిస్ కిస్కో ప్యార్ కరూన్ సినిమాతో బాలీవుడ్ తెరంగేట్రం చేశారు కపిల్. ఈ సినిమా 2015 సెప్టెంబరు 25న విడుదలై చాలా పెద్ద హిట్ అయింది.[24]

కామెడీ నైట్స్ విత్ కపిల్ షో తరువాత సోనీ టివిలో ది కపిల్ శర్మ షోను 2016 ఏప్రిల్ 23న మొదలుపెట్టారు.[25][26] 2016 జూన్ 26న ప్రో కబడ్డీ లీగ్ 4 ప్రారంభోత్సవంలో జాతీయ గీతం పాడి కార్యక్రమాన్ని మొదలుపెట్టారు కపిల్.[27]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

కపిల్ శర్మ ముంబై లో ఉంటున్నారు.[9] కిస్ కిస్కో ప్యార్ కరూన్ సినిమాలో ఒక పాటలో నటిస్తున్నప్పుడు ఆయన వెన్నులో ఒక డిస్క్ జారిపోయింది. ఫిబ్రవరి 2015లో ఈ విషయమై ట్వీట్ చేస్తూ 8 ఏళ్ళ నిర్విరామ పని తర్వాత మొదటిసారి విశ్రాంతి తీసుకుంటున్నాని తెలిపారు కపిల్.[28]

సామాజిక సేవ

[మార్చు]

జులై 2014లో ఒక అనాథ కుక్కను దత్తత తీసుకున్నారు కపిల్. దానికి జంజీర్ అని పేరు పెట్టారు. అది ముంబైలోని ఒక విశ్రాంత పోలీస్ ఉద్యోగి కుక్క. కామెడీ నైట్స్ విత్ కపిల్ షోలోనూ, సోషల్ మీడియాలోనూ కనిపించింది అది. ఏనుగులపై జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు ఆయన.[29]

అనాధ కుక్కలను, పిల్లులను దత్తత తీసుకునే కార్యక్రమానికి కపిల్, కామెడీ నైట్స్ విత్ కపిల్ కాస్ట్ ప్రచారంలో పాల్గొన్నారు.[30]

టెలివిజన్

[మార్చు]
Television
సంవత్సరం షో పాత్ర
2007 ది గ్రేట్ ఇండియన్ లాఫర్ చాలెంజ్ 3 పార్టిసిపెంట్
2008 చోటే మియాన్ వ్యాఖ్యాత
2009 ఉస్తాదోన్ కా ఉస్తాద్ పార్టిసిపెంట్
2011–12 స్టార్ యా రాక్ స్టార్ పార్టిసిపెంట్
2008–13 కామెడీ సర్కస్ పార్టిసిపెంట్
2013 ఝలక్ ధిఖలాజా 6 వ్యాఖ్యాత
2013–2016 కామెడీ నైట్స్ విత్ కపిల్ వ్యాఖ్యాత
2014 కౌన్ బనేగా కరోడ్ పతి సీజన్ 8 అతిథి
2014 ది అనుపమ్ ఖేర్ షో అతిథి
2015 60వ ఫిలింఫేర్ అవార్డులు వ్యాఖ్యాత
2015 ఫరాహ్ కీ దావత్ అతిథి
2015 ఆప్ కీ అదాలత్ అతిథి
2015 డాన్స్ ఇండియా డాన్స్ అతిథి
2015 ఇండియన్ ఐడల్ జూనియర్ అతిథి
2015 ది వాయిస్ ఇండియా అతిథి
2015 స్టార్ గిల్డ్ అవార్డ్స్ వ్యాఖ్యాత
2016 22nd స్టార్ స్క్రీన్ అవార్డ్స్ వ్యాఖ్యాత
2016 61st ఫిలింఫేర్ అవార్డ్స్ వ్యాఖ్యాత
2016-Present ది కపిల్ శర్మ షో [31] వ్యాఖ్యాత

సినిమాలు

[మార్చు]
సంవత్సరం చిత్రం పాత్ర నోట్స్
2015 ఎబిసిడి 2 స్వంత పాత్ర అతిథి
2015 కిస్ కిస్కో ప్యార్ కరూ కుమార్ శివ్ రామ్ కిషన్-ఎస్.ఆర్.కె హీరో

అవార్డులు

[మార్చు]

కామెడీ సర్కస్ సిరీస్ 6 సీజన్లలోనూ మొదటి బహుమతి గెలుచుకున్నారు కపిల్.

సంవత్సరం అవార్డులు క్యాటగిరి షో/సినిమా ఫలితం మూలాలు
2012 ఇండియన్ టెలివిజన్ అకాడమీ అవార్డులు ఉత్తమ నటుడు - కామెడీ కహానీ కామెడీ సర్కస్ కీ rowspan="7" గెలిచారు [32]
2013 కామెడీ నైట్స్ విత్ కపిల్ [33]
ఫన్నిఎస్ట్ సీరియల్ - కామెడి కామెడీ నైట్స్ విత్ కపిల్
సి.ఎన్.ఎన్-ఐబిఎన్ ఇండియన్ ఆఫ్ ది ఇయర్ ఎంటర్టైనర్ ఆఫ్ ది ఇయర్ [34]
బిగ్ స్టార్ ఎంటర్టైన్మెంట్ అవార్డ్స్ 2013 మోస్ట్ ఎంటర్టైనింగ్ కామెడీ షో కామెడీ నైట్స్ విత్ కపిల్ [35]
2014 స్టార్ గిల్డ్ అవార్డ్స్ 2014 బెస్ట్ కామెడీ షో [36]
2015 సోనీ గిల్డ్ ఫిలిం అవార్డులు ప్రామిసింగ్ డెబ్యూ (మేల్) కిస్ కిస్కో ప్యార్ కరూ [37]

References

[మార్చు]
  1. http://www.india.com/showbiz/kapil-sharma-happy-birthday-1075897/ Archived 2016-08-05 at the Wayback Machine Kapil Sharma happy birthday
  2. "Kapil Sharma thanks fans after winning Indian Of The Year award". Archived from the original on 2016-03-04. Retrieved 2016-08-02.
  3. Kapil Sharma – 20 most admired people in India | The Economic Times Archived 2018-07-11 at the Wayback Machine.
  4. Kapil Sharma: Will do my best for Swachh Bharat Abhiyaan – The Times of India Archived 2015-01-01 at the Wayback Machine.
  5. KoiMoi – Kapil Sharma To Meet President Pranab Mukherjee Archived 2015-09-28 at the Wayback Machine.
  6. "Kapil Sharma's film sets box office on fire". Archived from the original on 2016-08-01. Retrieved 2016-08-02.
  7. "Kapil Sharma's film goes on flooor". The Times of India. 8 November 2014.
  8. "Life has changed ever since, says comedian Kapil's family". Hindustan Times. Archived from the original on 20 డిసెంబరు 2014. Retrieved 18 December 2014.
  9. 9.0 9.1 Kapil Sharma: Seeing my daddy suffer in his last days, I prayed to God to take him – The Times of India.
  10. "Kapil Sharma plays the 'Traffic monitor' at India Gate". The Times of India. 26 September 2013.
  11. "Parvati Singhal, Kapil crown Comedy King". Siasat. 29 August 2010. Retrieved 3 March 2014.
  12. Kapil wins yet another season of Comedy Circus – The Times of India.
  13. Kapil Sharma Archived 2014-12-25 at the Wayback Machine.
  14. Aparna Banerji (24 July 2009). "Lady laughter sends T-town rolling". Tribune India. Archived from the original on 27 ఫిబ్రవరి 2014. Retrieved 21 July 2014.
  15. "Daily soaps weren't creatively satisfying: Manish Paul". The Times of India. 11 August 2013. Archived from the original on 15 ఆగస్టు 2013. Retrieved 16 August 2013.
  16. Srivastava, Priyanka. (6 September 2013) Kapil Sharma has redefined stand-up comedy on Indian television | Daily Mail Online.
  17. Wadehra, Randeep (16 September 2007). "The Great Punjabi Challenge". The Tribune.
  18. Comedian Kapil Sharma to be brand ambassador for Delhi poll.
  19. Narayan, Girija. (5 February 2015) When Kapil Sharma Stole Karan Johar's Thunder At Filmfare Awards 2015! Archived 2016-09-29 at the Wayback Machine
  20. Narayan, Girija. (20 January 2014) Kapil Sharma To Host CCL 2014; Launch Event With Sachin, Dhanush, Venkatesh.
  21. "Kapil Sharma is Amitabh Bachchan's first guest on KBC 8". India Today. 30 July 2014. Retrieved 30 July 2014.
  22. Narayan, Girija. (19 August 2014) Emotional Revelations Kapil Sharma Made On The Anupam Kher Show! Archived 2016-03-04 at the Wayback Machine
  23. "Kapil Sharma opts out of YRF's upcoming film Bank Chor". IANS. news.biharprabha.com. Retrieved 3 July 2014.
  24. "Kapil Sharma's film goes on floor". The Times Of India. 8 November 2014.
  25. "The Kapil Sharma Show tops the non-fiction category". 2016-06-26.
  26. "The Kapil Sharma Show Watch Full Episodes Online Sony TV Know About". The Kapil Sharma Show TV (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2016-07-06. Retrieved 2016-04-08.
  27. "Kapil Sharma to sing National Anthem at Pro Kabaddi 4 inauguration". 2016-06-25.
  28. Kapil Sharma Performs in Hamilton For the First Time After Surgery – NDTV Movies Archived 2016-03-04 at the Wayback Machine.
  29. 10 reasons why we love Kapil Sharma – The Times of India.
  30. ‘Comedy Nights With Kapil’ cast in new PETA campaign.
  31. http://indianexpress.com/article/entertainment/television/kapil-sharma-team-back-with-the-kapil-sharma-show-new/
  32. "Indian Television Academy Awards 2012". IndianTelevisionAcademy.com. Archived from the original on 21 అక్టోబరు 2013. Retrieved 22 January 2014.
  33. "Indian Television Academy Awards 2013". IndianTelevisionAcademy.com. Archived from the original on 3 డిసెంబరు 2013. Retrieved 22 January 2014.
  34. "Entertainer of the Year". CNN-IBN. 23 December 2013. Archived from the original on 8 నవంబరు 2014. Retrieved 2 ఆగస్టు 2016.
  35. Narayan, Girija. (19 December 2013) Big Star Entertainment Awards 2013: Comedy Nights With Kapil, Diya Aur.., Maharana Archived 2013-12-21 at the Wayback Machine. Entertainment.oneindia.in. Retrieved on 16 September 2015.
  36. Narayan, Girija. (17 January 2014) Comedy Nights With Kapil Bags Best Comedy Show At Star Guild Awards 2014! Archived 2014-02-22 at the Wayback Machine. Entertainment.oneindia.in. Retrieved on 16 September 2015.
  37. Praveen Pareek http://www.bollywoodhungama.com/movies/features/type/view/id/9455