కమల్ రాణి వరుణ్
కమల్ రాణి వరుణ్ | |
---|---|
ఉత్తరప్రదేశ్ విద్యా శాఖ మంత్రి | |
In office 2019 ఆగస్టు 21 – 2020 ఆగస్టు 2 | |
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి | యోగి ఆదిత్యనాథ్ |
అంతకు ముందు వారు | అశుతోష్ పాండాన్ |
తరువాత వారు | జితిన్ ప్రసాద్ |
ఉత్తరప్రదేశ్ శాసనసభ్యురాలు | |
In office 2017–2020 | |
అంతకు ముందు వారు | ఇంద్రజిత్ |
తరువాత వారు | ఉపేంద్ర నాథ్ |
నియోజకవర్గం | గౌతంపూర్ శాసనసభ నియోజకవర్గం |
పార్లమెంట్ సభ్యురాలు | |
In office 1996–1999 | |
అంతకు ముందు వారు | కేసరి లాల్ |
నియోజకవర్గం | గౌతమ్ పూర్ లోక్సభ నియోజకవర్గం |
వ్యక్తిగత వివరాలు | |
జననం | 1958 మే 3 లక్నో, ఉత్తర ప్రదేశ్ , |
మరణం | 2020 ఆగస్టు 2 లక్నో ఉత్తరప్రదేశ్ భారతదేశం |
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ |
జీవిత భాగస్వామి | కిషన్ లాల్ |
సంతానం | కూతురు |
నివాసం | కాన్పూర్ |
కమల్ రాణి వరుణ్ ( 1958 మే 3 – 2020 ఆగస్టు 2) భారతీయ రాజకీయ నాయకురాలు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసింది. కమల్ రాణి వరుణ్ ఉత్తరప్రదేశ్ శాసనసభ సభ్యురాలు. కమల్ రాణి వరుణ్ రెండుసార్లు పార్లమెంట్ సభ్యురాలుగా ఎన్నికయింది.[1]
బాల్యం
[మార్చు]కమల్ రాణి వరుణ్ 1958 మే 3న ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో జన్మించింది. 1975లో కిషన్ లాల్ ను వివాహం చేసుకుంది. కమల్ రాణి వరుణ్ కు ఒక కుమార్తె ఉంది కమల్ రాణి కాన్పూర్ విశ్వవిద్యాలయంలో సోషియాలజీలో ఎంఏ పూర్తి చేసింది.[2][3]
రాజకీయ జీవితం
[మార్చు]1989లో, కమల్ రాణి మునిసిపల్ ఎన్నికలలో కాన్పూర్ ద్వారకాపురి వార్డు నుండి పోటీ చేసి వార్డు సభ్యురాలిగా ఎన్నికయ్యారు. కమల్ రాణి వరుణ్ 1995 లో మళ్లీ వార్డు సభ్యురాలిగా విజయం సాధించారు. 1996 లో బిజెపి ఆమెను ఘటంపూర్ పార్లమెంటరీ నియోజకవర్గం నుండి పోటీకి నిలిపింది. కమల రాణి వరుణ్ ఆ ఎన్నికలలో విజయం సాధించింది. 1998 భారత సాధారణ ఎన్నికలలో రెండోసారి ఎంపీగా ఎన్నికయింది. అయితే, కమల్ రాణి వరుణ్ 1999ఎన్నికలలో ప్యారే లాల్ సంఖ్వార్‌పై 585 ఓట్ల తేడాతో ఓడిపోయారు. కమల్ రాణి పార్లమెంటు సభ్యురాలుగా ఉన్న సమయంలో, కార్మిక, సంక్షేమం, పరిశ్రమలు, మహిళా సాధికారత, అధికార భాష పర్యాటక శాఖలకు సంబంధించిన సలహా కమిటీలలో పనిచేశారు.[2]
కమల్ రాణి 2012 ఉత్తర ప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో రసూలాబాద్ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయారు.,[2] కమల్ రాణి వరుణ్ 2017 ఎన్నికలలో ఘటంపూర్ శాసనసభ నియోజకవర్గం నుండి 48.52% ఓట్లతో ఎన్నికయ్యారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆమెను 2019 ఆగస్టు 21న రాష్ట్ర మంత్రి వర్గం లోకి తీసుకున్నారు. 2019 భారత సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన తర్వాత రీటా బహుగుణ జోషి రాజీనామా చేసిన తర్వాత ఆమె ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ఏకైక మహిళా మంత్రి అయ్యారు.[1]
మరణం
[మార్చు]భారతదేశంలో COVID -19 మహమ్మారి సమయంలో మంత్రి కమల్ రాణి వరుణ్ కరోనా.తో ఆసుపత్రిలో చేరారు .[4] కమల్ రాణి వరుణ్ ఆసుపత్రిలో చేరాక మధుమేహం, రక్తపోటు, లాంటి సమస్యలతో బాధపడింది .[5] కమల్ రాణి వరుణ్ ఆగస్టు 2న 9:30 గంటలకు మరణించింది. ఆమె మరణించే సమయానికి ఆమె వయస్సు 62 [6]
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కమల్ రాణి వరుణ్ మృతికి సంతాపం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ కూడా కమల్ రాణి వరుణ్ మరణానికి సంతాపం తెలిపారు.[5] ఆగస్టు 2న ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంతాప దినంగా ప్రకటించింది .
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "Tracking the political journey of UP minister Kamal Rani Varun, who died of Covid-19". Hindustan Times. 2 August 2020. Retrieved 3 August 2020.
- ↑ 2.0 2.1 2.2 "UP Cabinet Minister Kamal Rani Varun, Admitted to Hospital With Covid-19, Passes Away". News 18. 2 August 2020. Retrieved 3 August 2020.
- ↑ "Uttar Pradesh minister Kamal Rani Varun dies due to COVID-19, CM Yogi Adityanath condoles her demise". Free Press Journal. Retrieved 3 August 2020.
- ↑ "Yogi Adityanath's Ayodhya visit cancelled after minister Kamal Rani Varun's death". Hindustan Times (in ఇంగ్లీష్). 2 August 2020. Retrieved 2 August 2020.
- ↑ 5.0 5.1 "UP Minister Kamal Rani Varun Dies From COVID-19 Two Weeks After Being Hospitalised". NDTV (in ఇంగ్లీష్). Retrieved 3 August 2020.
- ↑ Rashid, Omar (2 August 2020). "COVID-19: Uttar Pradesh Minister Kamla Rani Varun dies at 62". The Hindu (in ఇంగ్లీష్). Retrieved 2 August 2020.