Jump to content

కర్ణాటకలో హిజాబ్ వివాదం

వికీపీడియా నుండి

కర్ణాటక రాష్ట్రంలో 2022 ఫిబ్రవరి మొదటి వారంలో, హిజాబ్ నిరసన చెలరేగింది. ఒక కళాశాలలో హిజాబ్ ధరించిన ముస్లిం విద్యార్థులకు తరగతులకు అనుమతి నిషేధించింది. తర్వాత 2022 ఫిబ్రవరి 5న కర్ణాటక ప్రభుత్వం కాలేజీల్లో హిజాబ్ ధరించడాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కర్ణాటకలోని కొన్ని కాలేజీల్లో ముస్లిం యువతులు హిజాబ్ ధరించకుండా నిషేధం విధించడంతో హైకోర్టులో రెండు పిటిషన్లు కూడా దాఖలయ్యాయి.[1] [2] 2022 ఫిబ్రవరి 8న, భారతదేశంలోని కర్ణాటక రాష్ట్రంలో, ముస్లిం విద్యార్థులు హిజాబ్ ధరించడంపై వివాదం తీవ్రమైంది, ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం రాబోయే మూడు రోజుల పాటు ఉన్నత పాఠశాలలు, కళాశాలలను మూసివేస్తున్నట్లు ప్రకటించింది.[3][4]

నేపథ్యం

[మార్చు]

2021 డిసెంబరు చివరిలో, 2022 జనవరి ప్రారంభంలో, రాష్ట్రంలోని అనేక కళాశాలల్లో హిజాబ్‌కు సంబంధించి విద్యార్థులకు, పరిపాలనకు మధ్య వివాదం ఉంది, అయితే 2022 ఫిబ్రవరి ప్రారంభంలో వివాదం తీవ్రమైంది.[5]

హైకోర్టులో విచారణ

[మార్చు]

హిజాబ్ ధరించడం తమ రాజ్యాంగ హక్కు అని ఉడిపిలోని ప్రభుత్వ పీయూ కళాశాలకు చెందిన పలువురు విద్యార్థినులు పిటిషన్ వేశారు.[6] ఈ వివాదంపై 2022 మార్చి 15న క‌ర్ణాట‌క హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. విద్యాసంస్థలో హిజాబ్‌ తప్పనిసరి కాదని పేర్కొంటూ, విద్యార్థులు ప్రొటోకాల్‌ పాటించాల్సిందేనని అంది. ఈ మేరకు దాఖలైన పిటిషన్లన్నీ కొట్టేసింది ధర్మాసనం.[7][8]

సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు

[మార్చు]

ఈ వివాదంపై కర్ణాటక హైకోర్టు విచారణ జరుపుతుండగా, ఈ అంశంలో జోక్యం చేసుకోవాలంటూ సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలయ్యింది. ప్రస్తుతం హైకోర్టులో విచారణ కొనసాగుతున్నందున, ఆ కోర్టు ఏం నిర్ణయం తీసుకుంటుందో చూసిన తర్వాత దీనిని పరిశీలిస్తామని పిటిషనర్‌కు సూచించింది.[9]

ప్రతిచర్యలు

[మార్చు]

మలాలా యూసఫ్‌జాయ్ - హిజాబ్ ధరించిన బాలికలను పాఠశాలలోకి రాకుండా చేయడం చాలా భయంకరమైనదని మలాలా తన ట్వీట్‌లో పేర్కొంది. ఎక్కువ లేదా తక్కువ దుస్తులు ధరించే విషయంలో ఇప్పటికీ మహిళలపై అభ్యంతరాలు ఉన్నాయని, ముస్లిం మహిళలను ప్రధాన స్రవంతి నుండి వేరు చేసే ప్రక్రియను భారతీయ నాయకులు ఆపాలని ఆమె డిమాండ్ చేశారు.[10]

హిజాబ్‌ వస్త్రధారణ వివాదం దేశవ్యాప్తంగానే గాక, అంతర్జాతీయంగా చర్చకు దారితీసిన నేపథ్యంలో ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ అంతర్గత విషయాలపై విదేశీ ప్రముఖులు, ఇతర దేశాలు రెచ్చగొట్టే కామెంట్లు చేయడం తగదని కేంద్ర విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరీందమ్ బాగ్చీ ఓ ప్రకటన విడుదల చేశారు.[11]

హింస

[మార్చు]
2022 ఫిబ్రవరి 21న, శివమొగ్గ జిల్లాలో హిందూ విద్యార్థుల హిజాబ్ వ్యతిరేక నిరసనల్లో పాల్గొన్న భజరంగ్ దళ్ సభ్యుడు హర్ష హత్యకు గురయ్యాడు .[12] పోలీసుల ప్రకారం, అతన్ని కనీసం ఐదుగురు దుండగులు దాడి చేసి చంపారు, విచారణలు కొనసాగుతూనే ఉన్నాయి. నిరసనలకు, హత్యకు మధ్య ఇంకా ఎటువంటి సంబంధం కనుగొనబడలేదు అని హోం మంత్రి చెప్పాడు.[13] అతని అంత్యక్రియల ఊరేగింపుపై రాళ్లు రువ్వబడ్డాయి, దీనివల్ల 3 మంది గాయపడ్డారు, కొన్ని వాహనాలకు కూడా నిప్పు పెట్టారు.[14] హత్యతో సంబంధం ఉన్న ఐదుగురిలో ముగ్గురిని అరెస్టు చేశారు.[15]

మూలాలు

[మార్చు]
  1. "Hijab row: Maintain peace, says Karnataka high court as tempers flare". Hindustan Times. February 9, 2022.
  2. "Indian students block roads as row over hijab in schools mounts". Reutes.
  3. "Hijab protests spread, Karnataka govt shuts colleges, high schools for three days". February 9, 2022.
  4. "Karnataka colleges shut for 3 days as hijab row turns violent | India News - Times of India". The Times of India.
  5. "Hijab Row Live: Protests Intensify, Spread To Other States, Karnataka High Court Hearing Today". NDTV.com.
  6. "Hijab Row Karnataka High Court To Hear Students". www.india.com.
  7. S, Shashidhar (2022-03-14). "హిజాబ్ వివాదం: మరికొన్ని గంటల్లో తీర్పు..బెంగళూరులో హై అలర్ట్.. అక్కడ స్కూల్స్ బంద్". telugu.oneindia.com. Retrieved 2022-03-14.
  8. "Hijab Row: హిజాబ్‌ వివాదంపై కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు". EENADU. Retrieved 2022-03-15.
  9. "Hijab Row: సుప్రీం కోర్టుకు చేరిన 'హిజాబ్‌' వివాదం." EENADU. Retrieved 2022-02-11.
  10. "'Horrifying': Malala Yousafzai reacts to Karnataka hijab row". India Today. February 9, 2022.
  11. "Hijab Row: హిజాబ్‌ వివాదంపై ఇతర దేశాల కామెంట్లు.. కేంద్రం ఆగ్రహం". EENADU. Retrieved 2022-02-12.
  12. "Karnataka: Police suspect past criminal record may hold key to murder of Bajrang Dal worker in Shivamogga". The Indian Express (in ఇంగ్లీష్). 22 February 2022. Retrieved 22 February 2022. Police sources said that Harsha Hindu, who was murdered on Sunday, was involved in at least five cases of assault and attempt to murder having communal overtones.
  13. "Amidst ongoing Hijab row, 'murder' of Bajrang Dal activist creates further tension in Karnataka". The Print. 21 February 2022.
  14. "Stones hurled at funeral procession of Bajrang Dal worker, vehicles set afire". Deccan Herald (in ఇంగ్లీష్). 2022-02-21. Retrieved 2022-02-21.
  15. "Three arrested for Bajrang Dal activist Harsha's murder: K'taka home minister". Hindustan Times (in ఇంగ్లీష్). 2022-02-21. Retrieved 2022-02-22.