కర్పూరి దేవి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కర్పూరి దేవి
జననం1929
రంతీ, మధుబని జిల్లా
మరణం2019 జూలై 30 (94 ఏళ్ల వయసు)
మంగరౌని, మధుబని
జాతీయతభారతీయురాలు
చేసిన పనులుజానపద కళాకారిణి, మధుబని కళలో పెయింటింగ్, సుజ్నిలో వస్త్ర కళ

కర్పూరి దేవి (1929-2019 జూలై 30) భారతీయ జానపద కళాకారిణి. ఆమె మధుబని కళలో పెయింటింగ్, సుజ్నిలో వస్త్ర కళకు ప్రసిద్ధిచెందింది. ఆమె జపాన్‌లోని మిథిలా మ్యూజియం సృష్టికర్త.

ఆమె మధుబని కళను వాణిజ్య విజయాలతో విక్రయించిన ప్రారంభ తరానికి చెందిన కళాకారిణి. ఆమె చిత్రకళ భారతదేశంతో పాటు జపాన్, ఆస్ట్రేలియా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని సేకరణలలో ఆర్కైవ్ చేయబడింది.

కెరీర్[మార్చు]

కర్పూరి దేవికి తల్లి మధుబని కళలో మెళకువలు నేర్పింది. ఆమె చిన్నతనంలో ఆవు పేడతో అలికిన నేల, గోడలపై పెయింటింగ్‌ను వేస్తూ గడిపింది.[1] ఆమె చదువు ప్రాథమిక పాఠశాల విద్యకే పరిమితమైంది.[2]

ఆమె మధుబని (మిథిల చిత్రకళ) కళాకారుల ప్రారంభ తరానికి చెందినవారు. వారి కళా శైలికి ప్రజల గుర్తింపు పొందారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ నేతృత్వంలోని ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న లలిత్ నారాయణ్ మిశ్రా మధుబని కళ సంప్రదాయాన్ని పరిరక్షించాల్సిన అవసరాన్ని ఆమెకు గుర్తుచేసాడు. దీంతో ఇందిరా గాంధీ స్వయంగా కర్పూరి దేవి కళను చూసి మెచ్చుకుంది.[3] అంతేకాకుండా బీహార్‌లోని మధుబని ప్రాంతంలో ఆల్ ఇండియా క్రాఫ్ట్స్ కౌన్సిల్ శాఖను స్థాపించారు.[4] క్రాఫ్ట్స్ కౌన్సిల్ కర్పూరి దేవి వంటి కళాకారులను వారి కళను నేల, గోడలపై కాకుండా కాగితంపైకి తీసుకురావడానికి ప్రోత్సహించింది. పైగా ఈ పెయింటింగ్‌లను విక్రయించడానికి వీలు కల్పించింది.[5]

ఆమె మొదట్లో తన పనికి సామాజిక ప్రతిఘటనను ఎదుర్కొంది. అంటే ప్రత్యేకించి పబ్లిక్ రంగంలో మహిళలకు సంబంధించిన సామాజిక నిషేధం అన్నమాట.[6] ఒక ఇంటర్వ్యూలో ఆమె తన కళకు సంబంధించి తన భర్త కుటుంబం నుండి నిరాకరించినందున, తాను మొదట రెండేళ్లపాటు రహస్యంగా చిత్రించానని చెప్పింది.[7]

మధుబని శైలితో పాటు, ఆమె సుజ్ని కళలో నైపుణ్యం కలిగి ఉంది, ఇది అంతగా ప్రాచూర్యంలేని జానపద శైలి. దీనిలో చేతితో వస్త్రంపై సాంప్రదాయ ఎంబ్రాయిడరీ చేయబడుతుంది.[8][9] మధుబని కళలో ఆమె కృషి 'కచ్ని' (లైన్ డ్రాయింగ్), 'భర్ణి' (రంగు శైలులు) మిక్స్. ఈ శైలుల ఉపయోగం సాంప్రదాయకంగా ఒక నిర్దిష్ట కుల సభ్యులకు మాత్రమే పరిమితమైనప్పటికీ, ఆమె పని రెండింటినీ స్వీకరించడం ద్వారా సామాజిక సరిహద్దులను అధిగమించింది.[10][11]

ఆమె చిత్రకళను జపాన్‌లో పలుమార్లు ప్రదర్శించారు. అక్కడ మిథిలా ఆర్ట్ మ్యూజియం ఏర్పాటు చేయడంతో ఇది సాధ్యమైంది. 1987లో కెరీర్‌ను ప్రారంభించిన ఆమె తొమ్మిది సార్లు జపాన్‌ను సందర్శించింది. తోటి మధుబని కళాకారిణి మహాసుందరీ దేవితో కలిసి కళను రూపొందించడానికి, మెళకువలను బోధించడానికి మ్యూజియంలో పనిచేసింది.[12] ఆమె కళలు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్, ఫ్రాన్స్‌లలో కూడా ప్రదర్శించబడ్డాయి.[13][14] మధుబని కళపై ప్రదర్శనలో భాగంగా శాన్ ఫ్రాన్సిస్కోలోని ఏషియన్ ఆర్ట్ మ్యూజియంలో 'పెయింటింగ్ ఈజ్ మై ఎవ్రీథింగ్' అనే పేరుతో ఆమె కళను ప్రదర్శించింది. ఆమె తయారు చేసిన సుజ్ని శైలి ఎంబ్రాయిడరీ ప్యానెల్‌లు ఆస్ట్రేలియాలోని నేషనల్ గ్యాలరీ ఆఫ్ విక్టోరియా సేకరణలో భాగంగా ఉన్నాయి.[15][16]

పురస్కారాలు[మార్చు]

ఆమె తన కెరీర్‌లో బీహార్ రాష్ట్ర ప్రభుత్వం, భారత కేంద్ర ప్రభుత్వం నుండి అనేక అవార్డులను గెలుచుకుంది. 1986లో కేంద్ర ప్రభుత్వ టెక్స్‌టైల్స్ మంత్రిత్వ శాఖ ద్వారా సుజ్ని కళకు జాతీయ అవార్డుతో సహా; 1980లో మధుబని ఆర్ట్‌లో ఆమె చేసిన కృషికి బీహార్ స్టేట్ ఆర్ట్ అవార్డు, 1983లో ఉత్తమ హస్తకళాకారిణిగా రాష్ట్ర ప్రభుత్వ అవార్డు పొందింది.[17]

వ్యక్తిగతం[మార్చు]

కర్పూరి దేవి బీహార్ రాష్ట్రంలోని మధుబని జిల్లాలోని రంతి గ్రామంలో జన్మించింది. ఆమె భర్త క్రిష్కాంత్ దాస్ రంతీలో కళలను నేర్పించేవాడు.[18] వారికి ఒక కుమారుడు వినయ్ భూషణ్, ఒక కుమార్తె మోతీ కర్ణ్ ఉన్నారు. మోతీ కర్న్ కూడా మధుబని కళాకారిణి.[19]

ఆమె సహచర మధుబని కళాకారిణి మహాసుందరీ దేవితో సన్నిహిత వృత్తిపరమైన, సహకార సంబంధాన్ని కొనసాగించింది.[20] ఆమె కుటుంబ సభ్యులకు, బంధూవులకు మధుబని, సుజని కళల సంప్రదాయ కళలను నేర్పించడంతో పాటు, పద్మశ్రీ పురస్కారగ్రహిత మధుబని కళాకారిణి అయిన దులారీ దేవికి కూడా మార్గదర్శకత్వం వహించింది.[21]

మరణం[మార్చు]

ప్రముఖ మిథిలా పెయింటింగ్ ఆర్టిస్ట్ కర్పూరి దేవి 94 ఏళ్ల వయసులో అనారోగ్యంతో మధుబనిలోని మంగరౌని గ్రామంలోని హార్ట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ 2019 జూలై 30న తుదిశ్వాస విడిచింది.[22][23]

మూలాలు[మార్చు]

  1. "कर्पूरी देवी: मधुबनी पेंटिंग काे दी अंतर्राष्‍ट्रीय पहचान, सात दशक की कला यात्रा पर लगा विराम". Dainik Jagran (in హిందీ). Retrieved 2021-02-26.
  2. "स्मृति शेष: यूं ही नहीं दुनियाभर में छा गयी थीं कर्पूरी". Hindustan (in hindi). Retrieved 2021-02-26.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  3. "कर्पूरी देवी: मधुबनी पेंटिंग काे दी अंतर्राष्‍ट्रीय पहचान, सात दशक की कला यात्रा पर लगा विराम". Dainik Jagran (in హిందీ). Retrieved 2021-02-26.
  4. "Mithila, Museums, and Memories: Travels in Bihar". The Maxwell School of Syracuse University (in ఇంగ్లీష్). 2018-03-02. Archived from the original on 2021-01-23. Retrieved 2021-02-26.
  5. Tripathi, Shailaja (2013-11-22). "Madhubani beyond the living rooms". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2021-02-26.
  6. "स्मृति शेष: यूं ही नहीं दुनियाभर में छा गयी थीं कर्पूरी". Hindustan (in hindi). Retrieved 2021-02-26.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  7. "Mithila, Museums, and Memories: Travels in Bihar". The Maxwell School of Syracuse University (in ఇంగ్లీష్). 2018-03-02. Archived from the original on 2021-01-23. Retrieved 2021-02-26.
  8. "Karpuri Devi, the eminent Mithila painting artist and creator of Mithila Museum in Japan passes away". Hindustan Times (in ఇంగ్లీష్). 2019-07-31. Retrieved 2021-02-26.
  9. Balasubramaniam, Chitra (2019-06-20). "Sujni, equally elegant twin of Kantha". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2021-02-26.
  10. "कर्पूरी देवी: मधुबनी पेंटिंग काे दी अंतर्राष्‍ट्रीय पहचान, सात दशक की कला यात्रा पर लगा विराम". Dainik Jagran (in హిందీ). Retrieved 2021-02-26.
  11. "स्मृति शेष: यूं ही नहीं दुनियाभर में छा गयी थीं कर्पूरी". Hindustan (in hindi). Retrieved 2021-02-26.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  12. "Karpuri Devi, the eminent Mithila painting artist and creator of Mithila Museum in Japan passes away". Hindustan Times (in ఇంగ్లీష్). 2019-07-31. Retrieved 2021-02-26.
  13. "Karpuri Devi, the eminent Mithila painting artist and creator of Mithila Museum in Japan passes away". Hindustan Times (in ఇంగ్లీష్). 2019-07-31. Retrieved 2021-02-26.
  14. Tripathi, Shailaja (2013-11-22). "Madhubani beyond the living rooms". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2021-02-26.
  15. "'Painting is my Everything': Art from India's Mithila region" (PDF). Asian Art Museum.{{cite web}}: CS1 maint: url-status (link)
  16. "Artists: Karpoori Devi". National Gallery of Victoria.{{cite web}}: CS1 maint: url-status (link)
  17. "मधुबनी पेंटिंग की शिल्पी कर्पूरी देवी का निधन". Hindustan (in hindi). Retrieved 2021-02-26.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  18. "कर्पूरी देवी: मधुबनी पेंटिंग काे दी अंतर्राष्‍ट्रीय पहचान, सात दशक की कला यात्रा पर लगा विराम". Dainik Jagran (in హిందీ). Retrieved 2021-02-26.
  19. "Karpuri Devi, the eminent Mithila painting artist and creator of Mithila Museum in Japan passes away". Hindustan Times (in ఇంగ్లీష్). 2019-07-31. Retrieved 2021-02-26.
  20. "Madhubani art veteran Karpuri Devi dies at 94". Outlook India. Retrieved 2021-02-26.{{cite web}}: CS1 maint: url-status (link)
  21. "बिहार के दो दलित जिन्हें मिला पद्म श्री, जानें किस कला में हैं माहिर, 74 साल से नाच रहे हैं मांझी". Jansatta (in హిందీ). 2021-01-30. Retrieved 2021-02-26.
  22. "Karpuri Devi, the eminent Mithila painting artist and creator of Mithila Museum in Japan passes away - Hindustan Times". web.archive.org. 2023-04-09. Archived from the original on 2023-04-09. Retrieved 2023-04-09.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  23. "मधुबनी पेंटिंग की विख्यात शिल्पी कर्पूरी देवी का निधन, BJP नेता गिरिराज सिंह ने यूं दी श्रद्धांजलि". NDTVIndia. Archived from the original on 2019-12-01. Retrieved 2021-02-26.