Jump to content

కర్రా పరశురామయ్య

వికీపీడియా నుండి

కర్రా పరశురామయ్య (1954 నవంబరు 5) భారతదేశ ఐ.ఏ.ఎస్ అధికారి, జె.డి.యు పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు.[1] అతను బీహార్ రాష్ట్రంలో ప్రిన్సిపల్ సెక్రెటరీ గా పనిచేసాడు.

జీవిత విశేషాలు

[మార్చు]

అతను ఆంధ్రప్రదేశ్ [2] [3]నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం మండలం కొండూరుపాళెం దళితవాడలో నారయ్య , పెంచలమ్మలకు ఆరవ బిడ్డగా జన్మించాడు. నెల్లూరు జిల్లాలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకున్నాడు. తరువాత నెల్లూరులోని వి.ఆర్ కళాశాలలో ఆర్థిక శాస్త్రం లో డిగ్రీ చేసాడు. తిరుపతి లోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి రాజనీతి శాస్త్రంలో పోస్టు గ్రాడ్యుయేషన్న్ చేసాడు. బి.ఇ.డి డిగ్రీని చేసి అధ్యాపక వృత్తిని స్వీకరించాడు. 1983లో అతను వి.ఆర్.కళాశాల నుండి బి.ఎల్. చేసాడు.[2] 1986లో బీహార్ కేడర్ లో ఐ.ఎ.ఎస్ లో చేరాడు.[2] [3] 1989లో భభువా లో ఎస్.డి.ఓ గా ఉద్యోగంల్ చేరాడు.[4] సివిల్ సర్వెంట్ గా అతను పాట్నా జిల్లా మెజిస్ట్రేట్ గా చేరాడు. తరువాత పాట్నా, తిర్హుట్ లకు డివిజినల్ కమీషనరుగా చేసాడు. తరువాత ఎస్.సి&ఎస్.టి విభాగంలో ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమితులైనాడు. [3]

వ్యవసాయకూలీ నుంచి ఐ.ఏ.ఎస్.స్థాయికి ఎదిగారు. బీహార్‌లో పేదలు అతనిని అభినవ అంబేద్కర్ గా గౌరవిస్తున్నారు. అతను చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలకు మెచ్చి మగధ విశ్వవిద్యాలయం అతనికి డాక్టరేట్ ప్రధానం చేసింది. 1982 లో లాలాగూడ రైల్వే కాలేజీలో, తరువాత ఉదయగిరీ ప్రభుత్వ కాలేజీలో లెక్చరర్ గా పనిచేశాడు. 1986-87 లో ఐ.ఏ.ఎస్. గా ఎంపికయ్యాడు.[5] అతను బిహార్‌ కేడర్‌లో అధికారిగా 1983లో చేరాడు. అనేక శాఖల్లో కార్యదర్శిగా పనిచేసిన ఆయనను బీహార్ ముఖ్యమంత్రి నితిశ్‌ కుమార్ ‘మహాదళిత్‌ వికాస్‌ మిషన్‌’ కు ఛైర్‌పర్సన్ ‌గా నియమించారు. అక్కడ కోట్లాది రూపాయల మేర నిధులను కైంకర్యం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నాడు. పదవికి రాజీనామా చేశాక జే డీయూ పార్టీలో చేరి 2014లో "ససారం నియోజకవర్గం" నుండి నుంచి జేడీయూ తరఫున పోటీచేశాడు.[6]

మూలాలు

[మార్చు]
  1. Ramaiah, Karra Parasu (25 July 2011). "Everyone wants to come to Patna". The Telegraph. Retrieved 14 June 2019.
  2. 2.0 2.1 2.2 Ramaiah, Karra Parasu (25 July 2011). "Everyone wants to come to Patna". The Telegraph. Retrieved 14 June 2019.
  3. 3.0 3.1 3.2 Indian Express. IAS K P Ramaiah joins JD(U) to take on Speaker Meira Kumar
  4. Times of India. Senior IAS officer K P Ramaiah may contest against Meira Kumar in Sasaram
  5. epaper.sakshi.com/apnews/Sri_PottiSriramulu_Nellore/17022014/Details.aspx?id=2176239&boxid=25569224 సాక్షి17.2.2014
  6. "ఆర్కైవ్ నకలు". www.andhrajyothy.com. Archived from the original on 2020-07-05. Retrieved 2020-07-05.