బుచ్చిరెడ్డిపాలెం
పట్టణం | |
Coordinates: 14°32′17″N 79°52′30″E / 14.538°N 79.875°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా |
మండలం | బుచ్చిరెడ్డిపాలెం మండలం |
జనాభా (2011)[1] | |
• మొత్తం | 38,405 |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | స్త్రీ, పురుష జనాభా వివరాలు లేవు |
ప్రాంతపు కోడ్ | +91 ( 08622 ) |
పిన్(PIN) | 524305 |
Website |
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
బుచ్చిరెడ్డిపాలెం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, బుచ్చిరెడ్డిపాలెం మండలం లోని పట్టణం, మండలకేంద్రం.
భౌగోళికం
[మార్చు]నెల్లూరు నుండి 15 కి.మీ.ల దూరంలో వాయవ్య దిశలో ఉంది.
పరిపాలన
[మార్చు]జమీందార్లు, రాజకీయ పెత్తందార్లకు నెలవైన ఈ పంచాయతీ సర్పంచి పదవిని, 72 సంవత్సరాల తరువాత 2013 జూలైలో జరిగిన పంచాయతీ ఎన్నికలలో ఎస్.సి.వర్గానికి లభించింది. 1940 లలో బుచ్చి రెడ్డిపాలెం పంచాయతీ ప్రెసిడెంటుగా ఎస్.సి.సామాజిక వర్గానికి చెందిన జూగుంట బోడెయ్య పనిచేసాడు. 1940 జూన్ 12 నుండి 1941 ఏప్రిల్-2 వరకు, కేవలం 10 నెలలు ప్రసిడెంటుగా పనిచేశాడు. బుచ్చిరెడ్డిపాలెం నగరపంచాయతీ పట్టణ పరిపాలన నిర్వహిస్తుంది.
రవాణా సౌకర్యాలు
[మార్చు]ఇది నెల్లూరు - ముంబైని కలుపుతున్న రాష్ట్ర రహదారి మీద ఉంది. సమీప రైల్వే స్టేషను నెల్లూరులో, ఓడరేవు కృష్ణపట్నం వద్ద, విమానాశ్రయం రేణిగుంటలో ఉన్నాయి.
ప్రధాన వృత్తులు
[మార్చు]ఇక్కడి ప్రజల ముఖ్య జీవనాధారం వ్యవసాయం, వ్యాపారము. వరి, చెరుకు పండిస్తారు. రొయ్యలు, చేపల పెంపకము (ఆక్వా కల్చర్) కూడా చేస్తారు.
దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు
[మార్చు]- శ్రీ కోదండ రామస్వామి ఆలయం - పల్లవుల నాటిది.
- శ్రీ భద్రావతి దేవి సమేత శ్రీభావనాఋషిశ్వర స్వామి దేవస్థానం .
- శ్రీకళ్యాణ వేంకటేశ్వర స్వామి దేవస్థానం
- శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం
- శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానం
- శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి దేవస్థానం
- శ్రీ సాయిబాబా మందిరం
- శ్రీ చాముండేశ్వరి దేవస్థానం
- శ్రీమహాలక్ష్మీ అమ్మవారి దేవస్థానం
- శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి దేవస్థానం
- శ్రీకృష్ణ మందిరం
- శ్రీ కామాక్షమ్మ దేవస్థానం
- శ్రీ బాల వరసిద్ధి వినాయక దేవస్థానము.
- శ్రీ సిద్ధి విఘ్నేశ్వర దేవస్థానము.
చిత్ర మాలిక
[మార్చు]-
బుచ్చిరెడ్డిపాలెం పార్కు -1
-
బుచ్చిరెడ్డిపాలెం పార్కు -2
శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి దేవస్థానం .
[మార్చు]బుచ్చి రెడ్డి పాలెం గ్రామంలో వెలసిన శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఆలయ నిర్మాణం కొరకు స్వస్తి శ్రీ మన్మధ నామ సంవత్సరం జేస్ట బహుళ పంచమి ఆదివారం తేదీ 07:06:2015 న శ్రవణా నక్షత్ర యుక్త కర్కాటక లగ్నంలో ఉదయం 8-2 9నుండి 8-53 ల మధ్య రామకృష్ణ నగర్ నందు శ్రీ ప్రజ్ఞా నంద స్వామి వారి (యోగి రామ తపోవనం) స్వహస్తాలతో శంకుస్థాపన మహోత్సవం పూజా కార్యక్రమం అత్యంత వైభవం గా జరిగినది.
ఇతర విశేషాలు
[మార్చు]- బుచ్చిరెడ్డిపాలెం విస్తారమైన ఆక్వా కల్చర్‌కు ప్రసిద్ధి చెందింది.
- అతి దగ్గరలో కనిగిరి రిజర్వాయర్ ఉంది.
ప్రముఖులు
[మార్చు]- బెజవాడ రామచంద్రారెడ్డి
- బెజవాడ గోపాలరెడ్డి - ఉత్తర ప్రదేశ్ తొలి గవర్నర్‌గా పనిచేసిన వారు.
- బెజవాడ పాపిరెడ్డి
- ఏ.ఎం.రత్నం - ప్రముఖ తెలుగు సినిమా నిర్మాత, దర్శకుడు.
- యోగి రామయ్య
ఇవీ చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]వెలుపలి లింకులు
[మార్చు]- ↑ https://web.archive.org/web/20210422193328/https://cdma.ap.gov.in/en/nagarpanchayats. Archived from the original on 22 ఏప్రిల్ 2021. Retrieved 4 జూలై 2022.
{{cite web}}
: Missing or empty|title=
(help)
- Pages using the JsonConfig extension
- క్లుప్త వివరణ ఉన్న articles
- Pages using infobox settlement with bad settlement type
- Infobox mapframe without OSM relation ID on Wikidata
- మూలాలు లేని వ్యాసాలు
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మండల కేంద్రాలు
- రెవెన్యూ గ్రామాలు కాని మండల కేంద్రాలు
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పట్టణాలు
- Pages using the Kartographer extension